Public Welfare Alliance
-
టాటా..బైబై
ఇక ఎవరి దారి వారిదే త్వరలో కొత్త పొత్తులు వాసన్ బహిరంగ ప్రకటన తదుపరి కెప్టెన్ సమాయత్తం వీసీకే, వామపక్షాలు కూడా సంక్షేమ కూటమి శుభం కార్డు ప్రజా సంక్షేమ కూటమికి టాటా.. బైబై చెప్పేందుకు అందులోని పార్టీల నాయకులు సిద్ధమయ్యారు. ఆ కూటమితో పొత్తు ముగిసిందంటూ తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ వ్యాఖ్యానించారు. తదుపరి ఇదే వ్యాఖ్యను అందుకునేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. ఆయన బాటలో తలా ఓ దారి అన్నట్టుగా వీసీకే, వామపక్షాలు నడిచేందుకు నిర్ణయించాయి. ఈ దృష్ట్యా, ఇక ప్రజా సంక్షేమ కూటమి అడ్రస్సు గల్లంతైనట్టే. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామే అని జబ్బలు చరిచిన డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమికి ఫలితాలు చెంప పెట్టే. ఈ కూటమిలోని డీఎండీకే, ఎండీఎంకే, వీసీకే, తమిళ మానిల కాంగ్రెస్, సీపీఎం, సీపీఐల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. అందరి కన్నా,ఈ ఎన్నికల్లో భారీ నష్టాన్ని డీఎండీకే, సీపీఎం, సీపీఐలు చవిచూశాయి. ఇక, కాంగ్రెస్‌ను వీడి తమిళ మానిల కాంగ్రెస్‌కు పునర్ జీవం పోసిన సీకే వాసన్‌కు తొలి ఎన్నికలే పెద్ద షాక్. డీఎంకే గొడుగు నీడన రాజకీయ పయనం సాగించి ప్రజా సంక్షేమ కూటమిలోకి చేరిన వీసీకేకు కోలుకోలేని దెబ్బ తప్పలేదు. ఇక, ఎండీఎంకే అంటారా..?. గత ఎన్నికల్ని బహిష్కరించిన ఆ పార్టీకి, తాజా ఫలితాల ఓ లెక్కే కాదు. ఎన్నికల అనంతరం ఆ కూటమిలో బీటలు వారినట్టే అన్న ప్రచారం బయలు దేరింది. అయితే, కూటమి కన్వీనర్ ఎండీఎంకే నేత వైగో మాత్రం తమ కూటమిలో చీలికకు అవకాశం లేదని, ప్రజల కోసం ఒకే గళం, ఒకే నినాదంతో ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ కూటమికి టాటా..బైబై అని స్పందించడంతో అదే నినాదంతో ముందుకు వెళ్లేందుకు మిగిలిన పార్టీలు సిద్ధమయ్యాయి. టాటా.. బైబై : చెన్నైలో పార్టీ ముఖ్య నాయకులు, జిల్లాల నేతలతో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ సమాలోచించారు. ఇందులో తీసుకున్న నిర్ణయం మేరకు ఇక టాటా గుడ్ బై అంటూ ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. ఆ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వరకు మాత్రమేనని ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వాసన్ వ్యాఖ్యానించారు. అందుకే ఎన్నికల సమయంలో తమ కంటూ ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించామని గుర్తు చేశారు. ఆ కూటమి ఆ ఎన్నికలతో ముగిసిందని, ఇక తమ పయనం బలోపేతం అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్టు వివరించారు. స్థానిక ఎన్నికల్లో తమ బలాన్ని చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో పొత్తు ఎవరితో అన్నది తేల్చుతామని వ్యాఖ్యానించారు. సందర్భానుచితంగా, సమయానుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ కొత్త పొత్తు ప్రయత్నాలు ఉంటాయని చెప్పారు. కెప్టెన్ కూడా : వాసన్ అధికారికంగా ప్రకటించి కూటమి నుంచి బయటకు వెళ్లడంతో ఆ బాటను అనుసరించేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. పార్టీ నేతలతో సమీక్షను ముగించిన విజయకాంత్ ఇక, భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి పెట్టి ఉన్నారు. ఇందులో భాగంగా ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నామన్న అధికారిక ప్రకటనను ఒకటి రెండు రోజుల్లో విజయకాంత్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో సమీక్షల సమయంలో నాయకుల అభిప్రాయాల్ని విన్న విజయకాంత్, వారి అభిష్టానికి అనుగుణంగా నడచుకునే విధంగా వ్యవహరించడమే కాకుం డా, కొన్ని సందర్భాల్లో తిరగబడే విధంగా వ్యాఖ్యల్ని సంధించినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించిన నాయకులకు దూకుడుకు కల్లెం వేసే రీతిలో అవసరం అయితే, పార్టీని రద్దు చేయడం, లేదా మరో పార్టీలోకి విలీనం చేయడానికి తాను వెనుకాడబోనంటూ విజయకాంత్ హెచ్చరించి ఉండటం గమనించాల్సిన విషయమే. ఇక, ప్రజా సంక్షేమ కూటమితో ఒరిగిందేమీ లేని దృష్ట్యా, మళ్లీ డీఎంకేకు దగ్గరయ్యే విధంగా వీసీకే నేత తిరుమా ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇందుకు అద్దం పట్టే రీతిలో డీఎంకే అధినేత కరుణానిధికి అనుకూల వ్యాఖ్యల్ని అందుకుని ఉండటం ఆలోచించాల్సిందే. అదే విధంగా వామపక్షాలు సైతం కూటమి నుంచి బయటకు వచ్చేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వామపక్షాలు మాత్రమే ఇక కలిసి నడిచే రీతిలో కార్యాచరణను సీపీఎం, సీపీఐ వర్గాలు సిద్ధం చేసి ఉండడం ఆలోచించ దగ్గ విషయం. స్థానిక ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలు కలిసి కట్టుగా సాగితే, తమకు పట్టున్నచోట్ల గెలుపు బావుటాకు మార్గం సుగమం అవుతుందన్న ధీమాతో ఆ పార్టీల వర్గాలు ఉండడం విశేషం. -
సంక్షేమ కూటమికి బీటలు
* వైదొలగనున్న డీఎండీకే, తమాకా * అదే దిశగా వామపక్షాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని ప్రచారం చేసుకుంటూ ప్రజాసంక్షేమ కూటమి ఆవిర్భవించింది. ఎండీఎంకే అధినేత వైగో కూటమి రథసారధిగా, డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు కూటమిలో చేరిపోయాయి. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించారు. అధికారంలోకి రాకున్నా కనీసం పది సీట్లు గెలుచుకుంటామని కూటమి నేతలు ఆశించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో వారి ఆశలు తల్లకిందులయ్యాయి. కనీసం ఒక్కసీటును కూడా గెలుచుకోలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి విజయకాంత్ ఎంతో అవమానకరంగా డిపాజిట్టు కోల్పోయారు. ఆఖరుకు కూటమిలోని పార్టీలు ఈసీ గుర్తింపునే కోల్పోయే దుస్థితికి చేరుకున్నాయి. కూటమి ఓటమికి నువ్వంటే నువ్వు కారణమని నేతలు వాదించుకుంటున్నారు. సీఎం అభ్యర్థిగా విజయకాంత్‌ను ప్రకటించడం వల్లనే ఘోరపరాజయాన్ని చవిచూశామని వీసీకే అధినేత తిరుమావళవన్ ఫలితాలు వెలువడగానే వ్యాఖ్యానించాడు. కూటమి పార్టీల్లోని నేతలకు ఒకరంటే ఒకరికి పడని వైషమ్యాలు తలెత్తాయి. కూటమి నుంచి వెంటనే వైదొలగాల్సిందిగా డీఎండీకే జిల్లా కార్యదర్శులు విజయకాంత్‌పై ఒత్తిడి తెచ్చారు. తమిళ మానిల కాంగ్రెస్ అధినేత జీకే వాసన్ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి నుంచి వైదొలగడమే మేలని డీఎండీకే, తమాకా నిర్ణయించుకున్నాయి. మూడో కూటమికి ముగింపు పలికి పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు నిర్ణయించుకున్నాయి. అలాగే వామపక్షాలు సైతం వైదొలగాలనే ఆలోచనలో పడ్డాయి. ఎన్నికల్లో కూటమి ఆశించిన విజయాన్ని అందుకోలేదు, అయితే కూటమి ఏర్పాటైన పదినెలలకే గణనీయమైన ఓట్లు సాధించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జి.రామకృష్ణన్ అంటున్నారు. ఘన విజయాన్ని తాము అంచనా వేయలేదు, అయితే ప్రస్తుత పరాజయ పరిస్థితి తాత్కాలికమేనని అన్నారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాలు కొనసాగుతాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొనసాగాలంటే ధనస్వామ్యాన్ని అరికట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. -
ట్విట్టర్లో కెప్టెన్
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత, ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి విజయకాంత్ ఆదివారం ట్విట్టర్లో ప్రత్యక్షం అయ్యారు. అభిమానులు, ప్రజలు , పార్టీ వర్గాలు సంధించిన ప్రశ్నలకు గంట పాటుగా సమాధానాలు ఇచ్చారు. సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి విజయకాంత్ ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలో ఉన్నారు. ఎండ వేడి ఎక్కువగా ఉండటంతో కేవలం సాయంత్రం వేళల్లో బహిరంగ సభలతో తన ప్రచారాన్ని సాగించేస్తున్నారు. సీఎం అభ్యర్థిగా మారడంతో తన దూకుడును దక్కించుకుని, తన ధోరణిని మార్చుకుని వినూత్న రీతిలో పయనం సాగించే పనిలో కెప్టన్ నిమగ్నం అయ్యారు. ఇప్పటికే ప్రచారంలో కొత్త బాణి సాగిస్తున్న విజయకాంత్ ప్రస్తుతం ట్విట్టర్లో ప్రత్యక్షం అయ్యారు. సోషల్ మీడియాకు ఉన్న అమిత స్పందనను పరిగణలోకి తీసుకుని ఆదివారం గంట సేపు ట్విట్టర్లో అభిమానులు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తమిళంలో అడిగిన ప్రశ్నలకు తమిళంలోనే సమాధానాలు, ఆంగ్లంతో అడిగిన వారికి ఆంగ్లంలోనే సమాధానాలు ఇచ్చారు. ముందుగానే పది న్నర నుంచి పద కొండున్నర వరకు విజయకాంత్ ట్విట్టర్లో అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారంటూ డీఎండీకే వర్గాలు పదే పదే ప్రచారం ఇవ్వడంతో స్పందన అమితంగానే ఉందని చెప్పవచ్చు. అయితే, విజయకాంత్‌ను ఉక్కిరి బిక్కిరికి చేస్తూ పలువురు ప్రశ్నల్ని సంధించడంతో ఇరకాటంలో పడ్డారట..!. చివరకు తనదైన శైలిలోనే స్పందించి గంట గడిపేశారు. -
వై'గో'?
ఎన్నికల సంగ్రామంలో ముందుండి నడిపించాల్సిన రథసారధే తప్పుకుంటే... గెలుపు వ్యూహంతో అందరికీ మార్గదర్శనం చేయాల్సిన వ్యక్తే పోటీ నుంచి తప్పుకుంటే. ప్రజా సంక్షేమ కూటమిలో సోమవారం ఇదే జరిగింది. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రజా సంక్షేమ కూటమి అధినేత వైగో అకస్మాత్తుగా అస్త్రసన్యాసం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించేశారు. * పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన * వైగో వైఖరిపై నిరసన ప్రదర్శన * సంకటంలో సంక్షేమ కూటమి చెన్నై, సాక్షి ప్రతినిధి: కూటమి నేతలతో కలిసి గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కోవిల్పట్టి నుంచి పోటీ చేయబోతున్నట్లు వైగోనే ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రకారం సో మవారం ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత కూడా వైగో నామినేషన్ వేయనున్నట్లే ప్రచారం జరిగింది. సోమవారం ఉదయం పరిమిత సంఖ్యలో వెన్నంటి వచ్చిన అనుచరులతో కలిసి కోవిల్పట్టికి చేరుకున్న వైగో తాను పోటీచేయడం లేదని ప్రకటించడంతో నేతలంతా ఖిన్నులయ్యారు. తన బదులుగా ఎండీఎంకే తూత్తుకూడి జిల్లా యువజన విభాగం కార్యదర్శి వినాయక రమేష్‌తో సోమవారం నామినేషన్ వేయించారు. జాతి, మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న డీఎంకే వైఖరిని నిరసిస్తూ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వైగో తెలిపారు. పసుంపొన్ ముత్తరామలింగ దేవర్ విగ్రహానికి గత నలభై ఏళ్లుగా మాల వేసి గౌరవిస్తున్నానని, దేవర్ కులస్తులకు తాను అనేక విషయాల్లో అండగా నిలిచినట్లు తెలిపారు. కోవిల్పట్టిలో దేవర్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నందున అదే కులానికి చెందిన సుబ్రమణియం డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని అన్నారు. తన అభ్యర్థిత్వంతో దేవర్, నాయుడు కులస్తుల మధ్య విద్వేషాలు రగిల్చేం దుకు డీఎంకే సిద్ధమైందని ఆయన ఆరోపించారు. తన పోటీ కారణంగా దేవర్, నాయుడు సామాజిక వర్గాల మధ్య విభేదాలు రాకూడదని డీఎంకేకు ఆ అవకాశం ఇవ్వకూడదనే పోటీ నుంచి తప్పుకుంటున్నానని వివరించారు. తమ కూ టమి అభ్యర్థుల విజయానికి పాటుపడతానని చెప్పారు. ఇదిలా ఉండగా, వైగో తన అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలుకు వెళుతుండగా ఇండియ దేవర్ ఇన మక్కల్ కూటమి కార్యకర్తలు నల్లజెండాల ప్రదర్శన నిర్వహించారు. కోవి ల్పట్టిలోని దేవర్ విగ్రహానికి మాలవేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సుమారు వంద మంది ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిశ్రమ స్పందన పోటీ చేయబోవడం లేదంటూ వైగో చేసిన ప్రకటన కూటమిలో మిశ్రమ స్పందన కలిగించింది. అకస్మాత్తుగా ఆయన ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ పేర్కొన్నారు. తనకే కాదు, కూటమిలోని పార్టీలూ ఆశ్చర్యచకితులైనారని అన్నా రు. వైగో తన నిర్ణయాన్ని మార్చుకుం టారని ఆశిస్తున్నట్లు చెప్పారు. వైగో నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ అన్నారు. తన గెలుపు కోసం కాక కూట మి గెలుపు కోసం వైగో పనిచేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా ప్రజా సంక్షేమ కూటమిని ఏర్పాటు చేసిన వైగో తన వాక్చాతుర్యం తో దాన్ని ఎంతో బలోపేతం చేశాడు. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేను గట్టిపోటీ మీద కూటమిలో చేర్చుకున్నాడు. ఎటుపోవాలో తెలియక తంటా లు పడుతున్న తమిళ మానిల కాంగ్రెస్‌ను కూటమిలో భాగస్వామిని చేశాడు. దళిత నేత వీసీకే అధినేత తిరుమావళవన్ అంతకు ముందే కూటమి తీర్థం పుచ్చుకున్నాడు. కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్‌ను వైగో రంగంలోకి దించాడు. తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారాలు సాగించాడు. తూత్తుకూడి జిల్లా కోవిల్పట్టి నియోజకవర్గం నుంచి సోమవారం దాఖలు చేయకుండా చల్లగా తప్పుకున్నాడు. వైగో వైఖరితో సంక్షేమ కూటమి సంకటంలో పడిపోయింది. దేవర్, నాయుడు కులస్తుల మధ్య ఘర్షణలు తలెత్తకూడదన్న కారణంతోనే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారా. ఘర్షణలు తలెత్తకూడదన్న కారణంతోనే ఆయన పోటీ నుంచి తప్పుకున్నారా, పోటీకి దూరంగా ఎందుకు (వై), వెళ్లిపోయారు (గో) అనే సందేహాలు తలెత్తుతున్నాయి. -
ఇక రాత్రుల్లోనే ప్రచారం కెప్టెన్ కొత్తబాట
సాక్షి, చెన్నై: ఎండ దెబ్బకు తానేమి చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి, డీఎండీకే అధినేత విజయకాంత్ ఉన్నట్టుంది. ఇక, సాయంత్రం, రాత్రుల్లోనే ప్రచారం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని అభ్యర్థులకు సూచించే పనిలో పడ్డారు. విజయకాంత్ రూటే సెపరేటు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏదీ ముందుగా తలచుకోరు, సమయానికి తగ్గట్టుగా మాత్రమే వ్యవహరిస్తారు. ప్రసంగాల్లో కూడా తనకు తోచిందే మాట్లాడుతుంటారు. అలాంటి విజయకాంత్‌కు తరచూ కోపం రావడం సహజం. బుధవారం మీడియాను టార్గెట్ చేసి తీవ్రంగా స్పందించిన విజయకాంత్, ఇక జాగ్రత్తల్లో పడ్డారు. ఇదంతా ఎండ దెబ్బే అని చాటుకునే విధంగా, దానికి ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ప్రచారానికి దూరం అని ప్రకటించేసుకున్నారట!. అబ్బో విజయకాంత్ ఏమైనా తెలివైన వాడే. ఎండ దెబ్బకు తానే కాదు, తన కార్యకర్త కూడా సొమ్మసిల్లి పోకూడదనే, ఇక సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రచార, బహిరంగ సభలకు చర్యలు తీసుకోవాలని పార్టీ వర్గాలకు సూచించే పనిలో పడ్డారు. ఎండ వేడి మరీ ఎక్కువగా ఉందని, ఇతరుల సభల్లో కార్యకర్తలు భానుడి దెబ్బకు మృత్యువాత పడుతున్నారని పరోక్షంగా అమ్మ జయలలిత సభల్లో చోటుచేసుకున్న ఘటనల్ని ఎత్తి చూపుతూ కార్యకర్తలకు, పార్టీ వర్గాలకు గురువారం సందేశాన్ని పంపించారు. -
సమాలోచన
డీఎండీకే, ప్రజాకూటమి నాయకులు ఒకే వేదిక మీద దర్శనం ఇవ్వనున్నారు. పొత్తు పదిలం , సీట్ల పందేరం కొలిక్కిరావడంతో అభ్యర్థుల జాబితా ప్రకటనకు నిర్ణయించింది. ఈ నెల పదో తేదీన చెన్నై శివారులోని మామండూరులో భారీ మహానాడు రూపంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేపట్టారు. ఇక ఈ కూటమికి ఆమ్ ఆద్మీ ఝలక్ ఇచ్చింది. ఎవ్వరికీ మద్దతుగానీ, అనుకూలంగాగానీ వ్యవహరించ కూడదని ఆ పార్టీ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే వీరితో పొత్తుపై టీఎంసీ నేత జీకే వాసన్ ఎటూతేల్చుకోలేని పరిస్థితిలో పడ్డారు. సాక్షి, చెన్నై: డీఎండీకే, ప్రజాసంక్షేమ కూటమి తమ బలాన్ని మరింతగా పెంచుకునేందుకు కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ)నేత జీకేవాసన్, తమిళనాడులోని ఆమ్ ఆద్మీ పార్టీని తమతో కలసి అడుగులు వేయించేందుకు కుస్తీలు తీవ్రంగానే పట్టింది. అయితే, జీకే వాసన్ ఎన్నికల్ని ఎవరితో ఎదుర్కొంటారో అన్నది ఆ పార్టీ వర్గాలకే అంతు చిక్కడం లేదు. డీఎండీకే అధినేత విజయకాంత్ వంటి నాయకుడే పొత్తు వ్యవహారాన్ని తేల్చినా, వాసన్ మాత్రం ఎవరికీ చిక్కడం లేదు. అన్నాడీఎంకే ఇంటర్వ్యూల పర్వం శుక్రవారంతో ముగిసింది. సీట్ల పందేరాల పర్వాన్ని ముగించి ఆ పార్టీ 234 స్థానాల్లో అభ్యర్థుల్ని రంగంలోకి దించే కసరత్తుల్లో మునిగింది. ఇక, డిఎంకే తమ గొడుగు నీడన వాసన్‌కు చోటు లేదన్నది తేల్చేసింది. మిగిలిందల్లా డీఎండీకే- ప్రజా సంక్షేమ కూటమి మాత్రమే. వాళ్లు కూడా ఇక, వాసన్‌ను పక్కన పెట్టే దిశగా కసరత్తుల్లో పడ్డారని చెప్పవచ్చు. ఇందుకు అద్దం పట్టే వ్యవహారాలు శుక్రవారం చోటు చేసుకున్నాయి. అదే సమయంలో ఆమ్ ఆద్మీ తమకు మద్దతుగా వ్యవహరిస్తుందని గురువారం ఆశాభావం వ్యక్తం చేసిన ప్రజా సంక్షేమ కూటమికి మిగిలింది నిరాశే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో తమిళనాట ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకూడదని, ఎవరికీ అనుకూలంగా వ్యవహరించకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఆమ్ ఆద్మీ తమకు హ్యాండ్ ఇవ్వడంతో ఇక, తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు డీఎండీకే- ప్రజా సంక్షేమ కూటమి సిద్ధమయ్యాయి. ఇందుకు ఈనెల పదో తేదీన చెన్నై శివారులోని మామండూరు వేదికగా భారీ మహానాడుకు నిర్ణయించారు. ఒకే వేదిక మీదకు: ఇన్నాళ్లు ఎన్నికల ప్రచారంలో ప్రజా సంక్షేమ కూటమిలోని వైగో, తిరుమా, రామకృష్ణన్, ముత్తరసన్ ఒకే వేదిక మీద దర్శనం ఇస్తున్నారు. అయితే, విజయకాంత్ మాత్రం ఇంత వరకు వేదిక ఎక్కలేదు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్నదని చెప్పవచ్చు. అదే సమయంలో విజయకాంత్ సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్ కూటమికి మద్దతుగా ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజా సంక్షేమ కూటమి నాయకులు వైగో, తిరుమావళవన్, ముత్తరసన్, రామకృష్ణన్ మధ్యాహ్నం విజయకాంత్‌తో భేటీ అయ్యారు. సీట్ల పందేరం కొలిక్కి రావడం, నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియ ముగియడంతో ఇక, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరితగతిన ముగించి ఈనెల పదో తేదిన ప్రకటించేద్దామన్న నిర్ణయానికి నేతలు వచ్చారు. మామండూరు వేదికగా జరిగే మహానాడులో విజయకాంత్‌ను కూటమి సీఎం అభ్యర్థిగా అధికార పూర్వకంగా పరిచయం చేయడానికి నిర్ణయించారు. అలాగే, ఆయా పార్టీలకు చెందిన కూటమి తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన, అభ్యర్థుల పరిచయ కార్యక్రమాన్ని ఇదే వేదిక మీద నిర్వహించేందుకు నిర్ణయించారు. తదుపరి మీడియాతో వైగో మాట్లాడుతూ, ఇక, ఎన్నికల ప్రచార ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. మామండూరు వేదికగా మహానాడు రూపంలో బహిరంగ సభకు నిర్ణయించామని పేర్కొన్నారు. ఇక, ఐదో తేదీ అన్నదాతలు చేపట్టనున్న ఆందోళనల్లో ప్రజా కూటమి వర్గాలు పాల్గొంటాయని, వారికి మద్దతుగా తమ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతారని ప్రకటించారు. -
ఆరోగ్యంగానే ఉన్నాను
పుకార్లు నమ్మొద్దు {పజా సంక్షేమ కూటమి విజయకాంత్ స్పష్టీకరణ చీలిక ఎవరి తరం కాదన్న ప్రేమలత వామపక్షాల వద్దకు వైగో, తిరుమా పరుగు ఒకే వేదిక మీదుగా అభ్యర్థుల జాబితా చెన్నై : ప్రజా సంక్షేమ కూటమికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలు, పుకార్లను నమ్మకండి అని తమ కేడర్‌కు ఆ కూటమి నేతలు సూచించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ డీఎండీకే అధినేత విజయకాంత్ స్పష్టం చేశారు. ఈ కూటమిని చీల్చడం ఎవరి తరం కాదని ప్రేమలత విజయకాంత్ వ్యాఖ్యానించారు. ఇక, కూటమి పేరు వ్యవహారంలో వామపక్షాల భిన్న స్వరంతో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమా పరుగులతో బుజ్జగింపులు సాగించి ఉన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా డీఎండీకే, ఎండీఎంకే, వీసీకే, వామపక్షాల నేతృత్వంలో ఏర్పాటైన కూటమిపై రోజుకో మలుపులతో చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కూటమి పేరు వ్యవహారంలో ఆదివారం వామపక్షాలు, ఎండీఎంకే, వీసీకేల మధ్య భిన్న స్వరాలు బయలు దేరాయి. అలాగే, డీఎండీకే అధినేత, సీఎం అభ్యర్థి విజయకాంత్ అనారోగ్యం పేరుతో సింగపూర్ పయన సమాచారం చర్చకు దారి తీశాయి. ఇక, మరెన్ని ట్విస్టులతో ఈ కూటమి పయనం సాగనుందో అన్న ప్రశ్న బయలు దేరింది. కెప్టెన్ టీం అన్న పేరుకు వ్యతిరేకంగా వామపక్షాల వ్యాఖ్యలతో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్ మేల్కొన్నట్టున్నారు. ఆగమేఘాలపై ఈ ఇద్దరు నేతలు సీపీఎం కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. సీపీఎం నేత జి రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్లను బుజ్జగించడంతో పాటుగా సీట్ల పందేరంలో సమయానుకూలంగా సర్దుకుందామన్న హామీని ఇచ్చి ఉన్నారు. దీంతో కూటమిపై వస్తున్న వదంతులు నమ్మ వద్దంటూ కేడర్‌కు నాయకులు సూచించే పనిలో పడ్డారు. ఇక, తమ కూటమిని చీల్చే యత్నం సాగుతున్నదని, ఇందుకు మీడియా కూడా వంత పాడుతున్నట్టుగా నాయకులు పల్లవిని అందుకోవడం గమనార్హం. ఇక, తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలను డీఎండీకే అధినేత విజయకాంత్ తీవ్రంగా ఖండించారు. విజయకాంత్ ఆరోగ్యంపై ఆయన సతీమణి ప్రేమలత చేసిన వ్యాఖ్యలతోనే సింగపూర్ పర్యటన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ విజయకాంత్ తరపున సోమవారం ప్రకటన వెలువడటం గమనార్హం. కూటమికి, తనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలు, ప్రచారాలు, పుకార్లు ఏ ఒక్కటినీ నమ్మొద్దని అందులో కేడర్‌కు సూచించారు. ఏదేని విషయాలు ఉంటే, పార్టీ కార్యాలయం సమాచారాలు అందిస్తుందని, అంతే గానీ, మీడియాల్లో వచ్చే వార్తలు, కథనాలతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికల ప్రచారంతో ప్రజల్లోకి వస్తానని విజయకాంత్ వివరించారు. అలాగే, ఏప్రిల్ పదో తేదిన కూటమిలోని పార్టీల అభ్యర్థులు ప్రకటన, పరిచయ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. ఇక, కూటమిని చీల్చేందుకు తీవ్ర కుట్రలు జరుగుతున్నాయని, ఇందుకు పలు మీడియాలు కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ప్రేమలత విజయకాంత్ తీవ్రంగా దుయ్యబట్టారు. మదురైలో జరిగిన ప్రచార కార్యాక్రమంలో అధికార మార్పు లక్ష్యంగా ప్రజా కూటమి ఆవిర్భవించిందని, దీనిని చీల్చేందుకు రకరకాల ప్రయత్నాలు, కుట్రలు జరుగుతూనే ఉన్నాయని మండి పడ్డారు. పండు తేనెలో పడిందని, ఇన్నాళ్లు అమ్మకు, అయ్యకు ఓటేయండంటూ నినాదాలు విన్పించాయని, ఇక ఆ రెండింటిని పక్కన పెట్టి అన్న(విజయకాంత్)కు ఓటేయండన్న నినాదాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలని పిలుపునిచ్చార