ట్విట్టర్‌లో కెప్టెన్ | Vijayakanth takes Twitter by storm, reveals his favourite hero and villains | Sakshi
Sakshi News home page

ట్విట్టర్‌లో కెప్టెన్

Published Mon, May 2 2016 2:02 AM | Last Updated on Sun, Sep 3 2017 11:12 PM

ట్విట్టర్‌లో కెప్టెన్

ట్విట్టర్‌లో కెప్టెన్

సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత, ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి విజయకాంత్ ఆదివారం ట్విట్టర్‌లో ప్రత్యక్షం అయ్యారు. అభిమానులు, ప్రజలు , పార్టీ వర్గాలు సంధించిన ప్రశ్నలకు గంట పాటుగా సమాధానాలు ఇచ్చారు. సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి విజయకాంత్ ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలో ఉన్నారు. ఎండ వేడి ఎక్కువగా ఉండటంతో కేవలం సాయంత్రం వేళల్లో బహిరంగ సభలతో తన ప్రచారాన్ని సాగించేస్తున్నారు. సీఎం అభ్యర్థిగా మారడంతో తన దూకుడును దక్కించుకుని, తన ధోరణిని మార్చుకుని వినూత్న రీతిలో పయనం సాగించే పనిలో కెప్టన్ నిమగ్నం అయ్యారు. ఇప్పటికే ప్రచారంలో కొత్త బాణి సాగిస్తున్న విజయకాంత్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ప్రత్యక్షం అయ్యారు.
 
  సోషల్ మీడియాకు ఉన్న అమిత స్పందనను పరిగణలోకి తీసుకుని ఆదివారం గంట సేపు ట్విట్టర్లో అభిమానులు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తమిళంలో అడిగిన ప్రశ్నలకు తమిళంలోనే సమాధానాలు,  ఆంగ్లంతో అడిగిన వారికి ఆంగ్లంలోనే సమాధానాలు ఇచ్చారు. ముందుగానే పది న్నర నుంచి పద కొండున్నర వరకు విజయకాంత్ ట్విట్టర్లో అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారంటూ డీఎండీకే వర్గాలు పదే పదే ప్రచారం ఇవ్వడంతో స్పందన అమితంగానే ఉందని చెప్పవచ్చు. అయితే, విజయకాంత్‌ను ఉక్కిరి బిక్కిరికి చేస్తూ పలువురు ప్రశ్నల్ని సంధించడంతో ఇరకాటంలో పడ్డారట..!. చివరకు తనదైన శైలిలోనే స్పందించి గంట గడిపేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement