మీడియాపై విజయ్కాంత్ కస్సుబుస్సు | DMDK chief slams TV channels' poll surveys | Sakshi
Sakshi News home page

మీడియాపై విజయ్కాంత్ కస్సుబుస్సు

Published Mon, May 9 2016 2:24 PM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM

DMDK chief slams TV channels' poll surveys

చెన్నై: సినీ నటుడు, డీఎండీకే చీఫ్ విజయకాంత్ మరోసారి మీడియా కస్సుబుస్సులాడారు. త్వరలో తమిళనాడులో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓ రెండు చానెళ్ల పోల్ సర్వే ఫలితాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సర్వేలన్నీ తప్పుల తడకని, వాటిని ప్రజలు నమ్మాల్సిన పనిలేదని చెప్పారు.

ఒక సర్వే ఏఐఏడీఎంకే విజయం సాధిస్తుందని, మరో సర్వే డీఎంకే విజయం సాధిస్తుందని తెలిపిందని, ఆ రెండు చానెళ్లు కావాలని ఒక వ్యూహం ప్రకారమే అలా ప్రచారం చేస్తున్నాయి తప్ప ఆ ఫలితాలు సరైనవి కావని అన్నారు. తన పార్టీ ఒకప్పుడు డీఎంకే ఫౌండర్ సీఎన్ అన్నాదురై సాధించినంతటి గొప్ప విజయం సాధిస్తుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement