తళి నియోజకవర్గంలో అన్నాడీఎంకే,సీపీఐ అభ్యర్థుల నామినేషన్లు
తరలి వచ్చిన వేలాది మంది
డెంకణీకోట : తళి నియోజక వర్గంలోని వివిధ గ్రామాల నుంచి సీపీఐ, విడుదల చిరుత, డీఎండీకే, తమిళమానిల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రామచంద్రన్ అభిమానులు వేలాది మంది స్వచ్చందంగా తరలిరాగా తళి నియోజకవర్గ తళి నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి, తళి ఎమ్మెల్యే టి.రామచంద్రన్ డెంకణీకోట తాలూకాఫీసులో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టి. రామచంద్రన్ డీఎండీకే జిల్లా కార్యదర్శి చంద్రన్, తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శులు వెంటరాగా రామచంద్రన్ చేత నామినేషన్లు రెండు సెట్లు దాఖలు చేయించారు.
డెంకణీకోటలో ఎక్కడ చూసినా జనం ఇసుక వేస్తే నేలపై రాలనంత జనం. వీధులన్నీ ఎక్కడికక్కడే కదలని పరిస్థితి. ట్రాఫిక్‌జామ్‌తో సతమతమయ్యారు. డీఎండీకే, వీసీకె, తమిళమానిల కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు జెండాలు పట్టి పట్టణ వీధుల్లో ఊరేగింపు జరిపారు. డెంకణీకోట డీఎస్పీ నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
తళి నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా నాగేష్ గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. డెంకణీకోట తాలూకా కార్యాలయంలో అన్నాడీఎంకే నాయకులు సంపంగిరామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే.వి.మురళీధరన్‌లు వెంటరాగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. అన్నాడీఎంకే కార్యకర్తలు రైతు బజారు నుండి ఊరేగింపుగా వచ్చారు. రెండు ప్రధాన పార్టీ పార్టీలు ఒకే రోజు నామినేషన్‌లు వేయడంతో డెంకణీకోట పట్టణంలో ఎక్కడ చూసినా జనం కనపించారు. మండుటెండల్లో కార్యకర్తలు సేద తీరుర్చుకొనేందుకు నానా అవస్థలు పడ్డారు.