2014 లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎండీకే పార్టీ మధ్య పొత్తులు కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయి. Rahul Gandhi Vijyakant DMDK Congress రాహుల్ గాంధీ విజయ్ కాంత్ డీఎండీకే కాంగ్రెస్
విజయ్ కాంత్ కు రాహుల్ శుభాకాంక్షలు
Published Mon, Aug 26 2013 3:25 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2014 లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎండీకే పార్టీ మధ్య పొత్తులు కుదిరే దిశగా అడుగులు పడుతున్నాయి. డీఎండీకే వ్యవస్థాపకుడు, ప్రతిపక్ష నేత 'కెప్టెన్' విజయ్ కాంత్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలుపడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గత కొద్దికాలంగా డీఎండీకే తో పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందనే వార్తలకు ఈ సంఘటన కొంత బలం చేకూర్చింది.
అయితే విజయ్ కాంత్ తో రాహుల్ మాట్లాడటం వెనుక ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు లేవని డీఎండీకే పార్టీకి చెందిన సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయ పొత్తుల గురించి మాట్లాడటం తొందరపాటుతనమే అని అన్నారు. సరియైన సమయంలో తమ నాయకుడు పొత్తుల గురించి నిర్ణయం తీసుకుంటాడన్నారు.
Advertisement
Advertisement