విజయ్ కాంత్ 10 లక్షల విరాళం
చెన్నై: వరదలతో అతలాకుతలమైన జమ్మూ,కాశ్మీర్ ను ఆదుకునేందుకు డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ కాంత్ 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. గత 60 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా జమ్మూ, కాశ్మీర్ ను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా ప్రజల జీవితం దుర్భరంగా మారిందని విజయ్ కాంత్ తెలిపారు.
విజయ్ కాంత్ తన సహాయాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి అందించారు. కష్టాల్లో ఉన్న జమ్మూ,కాశ్మీర్ ప్రజలను ఆదుకునేందుకు సంపన్నులు, వ్యాపారవేత్తలు, యువకులు ముందుకు రావాలని ఓ ప్రకటనలో కోరారు.