మా ఆయన కింగ్ అవుతారు | DMDK chief Captain Vijaykanth will be the king, says wife Premalatha | Sakshi
Sakshi News home page

మా ఆయన కింగ్ అవుతారు

Published Mon, May 2 2016 4:31 PM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

మా ఆయన కింగ్ అవుతారు

మా ఆయన కింగ్ అవుతారు

చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో డీఎండీకే చీఫ్ కెప్టెన్ విజయ్కాంత్ భార్య ప్రేమలత దూసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి జయలలిత సారథ్యంలోని అధికార అన్నా డీఎంకే, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నేతృత్వంలోని డీఎంకేలను విమర్శిస్తూ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తన వాగ్ధాటితో ఓటర్లను ఆకర్షిస్తూ, డీఎండీకే కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కృషిచేస్తున్నారు. ప్రేమలత తమ తరపున ప్రచారం చేయాలని డీఎండీకే అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఎన్నికల అనంతరం విజయ్కాంత్ కింగ్ అయితే, ప్రేమలత పాత్ర కింగ్ మేకర్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన భర్త విజయ్ కాంత్ కింగ్ అవుతారని ప్రేమలత ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడు ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలసి డీఎండీకే పోటీ చేస్తోంది. ఈ కూటమి తరపున విజయ్కాంత్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. కూటమి గెలుపుకోసం విజయ్ కాంత్, ప్రేమలత వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు. విజయ్కాంత్ గెలుపు కోసం ప్రేమలత నిమిషం కూడా వృథా చేయకుండా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు డీఎండీకేనే ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. ఈ రెండు ప్రధాన పార్టీలను వ్యతిరేకిస్తున్న ప్రేమలత.. గత ఎన్నికల్లో అన్నా డీఎంకేతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవడం అతిపెద్ద తప్పని అంగీకరించారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్కు ప్రజలతో సంబంధాలు లేవని విమర్శించారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇక జయలలితపైనా ఆమె ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఎండలకు పిల్లలు (ప్రజలు) చనిపోతుంటే అమ్మ (జయలలిత) ఏసీలో కూర్చోరని అన్నారు. తన భర్త విజయ్కాంత్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన సినిమాల్లో నటిస్తారు కానీ ప్రజల ముందుకాదంటూ వ్యాఖ్యానించారు. తమిళనాడు మార్పును కోరుకుంటోందని, తమ పార్టీలో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. విజయ్కాంత్ సినిమాల్లోని పవర్ఫుల్ డైలాగులు చెబుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement