ఇళయదళపతి వయసు 21 | Vijay completes 21 years in Kollywood | Sakshi
Sakshi News home page

ఇళయదళపతి వయసు 21

Published Sat, Dec 7 2013 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM

ఇళయదళపతి వయసు 21

ఇళయదళపతి వయసు 21

 నటుడు విజయ్‌కి ఆయన అభిమానుల కట్టబెట్టిన బిరుదు ఇళయదళపతి. అయితే ఆయన వయసు 21. ఏమిటంటారా? చూపరులకిప్పటికీ ఆయన 21 ఏళ్ల యువకుడిగానే కనిపిస్తారు. అయితే విజయ్ నిజ వయసు 21 ఏళ్లు కాకపోయినా ఆయన సినీ వయసు మాత్రం ఖచ్చితంగా 21 ఏళ్లే. విజయ్ 1992లో నాళయ తీర్పు చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. రెండవ చిత్రం సెంధూరపాండి. ఇందులో విజయ్‌కాంత్‌తో కలిసి నటించారు. అయితే 1996లో నటించిన పూవే ఉనక్కాగ  చిత్రం విజయం విజయ్‌ను స్టార్‌ను  చేసింది.

ఆ తరువాత నేరుక్కునేర్, కాదలుక్కు మరియాదై, తుళ్లాదమనం తుళ్లుం, ఖుషి, ఫ్రెండ్స్, తిరుమలై, గిల్లీ, తిరుపాచ్చి, శివకాశి వంటి పలు చిత్రాల విజయపరంపర విజయ్‌ను నెంబర్‌వన్ హీరోను చేశాయి. గత ఏడాది విజయ్ నటించిన తుపాకీ వందకోట్ల క్లబ్‌కు చేరింది.  ప్రస్తుతం నటిస్తున్న జిల్లా చిత్రం సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ 21 ఏళ్ల నట వయసులో 56 చిత్రాల్లో నటించడం విశేషం. ఈ సందర్భంగా ఈ ఇళయదళపతికి చిత్ర ప్రముఖులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement