నటుడు విజయకాంత్ సతీమణి ప్రేమలత తన చేతిపై భర్త బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డీఎండికే అధినేత, నటుడు అనారోగ్యం కారణంగా గత డిసెంబర్‌లో కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయంలో ఖననం చేశారు.
విజయకాంత్ మృతి చెంది నెలరోజులు కావొస్తున్నా.. ఆయన స్మారక స్థూపానికి సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు రోజూ పెద్దసంఖ్యలో తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. ముఖ్యంగా బయట ప్రాతాల నుంచి చైన్నెకి వచ్చిమరీ అభిమానులు సందర్శిస్తున్నారు. అలాగే నిత్యం ఇక్కడ అన్నదానం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా విజయకాంత్ సతీమణి ప్రేమలత తాజాగా తన కుడిచేతిపై విజయకాంత్ బొమ్మను టాటూగా వేయించుకున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిత్యం విజయకాంత్‌ను చూసుకునేలా ఈ టాటూ వేసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment