సాక్షి, వేలూరు: జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే శశికళ చేతిలోకి అన్నాడీఎంకే పార్టీ వెళ్లడం కాయమని పార్లమెంట్ సభ్యులు కార్తీ చిదంబరం తెలిపారు. ఆయన బెంగళూరు నుంచి చెన్నైకి కారులో వచ్చారు. ఆ సమయంలో ఆంబూరు బస్టాండ్ ప్రాంతంలో తిరుపత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభు అధ్యక్షతన పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో కార్తీ చిదంబరం విలేకరులతో మాట్లాడారు. కందశష్టి కవశాన్ని అవమానం పరచడాన్ని మత నమ్మకం ఉన్న వారు ఎవరూ వదిలి పెట్టరన్నారు. మురుగుడి భక్తుడిగా ఉన్న తానే వాటిని అంగీకరించనన్నారు. ఒక మతానికి చెందిన దేవున్ని అవమాన పరిచడం సరికాదు. దేవుళ్లను అవమాన పరిచేందుకు పూనుకోకూడదన్నారు. (సీఎం నివాసంగా వేద నిలయం..)
శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అన్నాడీఎంకే పార్టీ పూర్తి అ«ధికారాలను ఆమె చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. టీటీవీ దినగరన్ మరోసారి అన్నాడీఎంకే పార్టీలో చేరిపోతారన్నారు. వారి కుటుంబం అదుపులోనే ఉంటుందన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి కాంగ్రెస్ ఇదివరకే తెలిపిన విధంగా ఒక్కొక్కరికీ రూ.10 వేలు అందజేసి ఉండాలన్నారు. అయితే రూ. 1000 మాత్రమే అందజేశారని చెప్పారు. బాధితులకు అదనంగా నివారణ సాయం అందజేయాలన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్ అమలులో ఉన్నందున నిబంధనలుకు విరుద్ధంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరడంతో ఆంబూరు పోలీసులు కార్తీ చిదంబరంతో పాటు జిల్లా అధ్యక్షులు ప్రభుతో పాటు 50 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. (వేదనిలయంలోకి దీపక్)
Comments
Please login to add a commentAdd a comment