సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ శశికళ సాగిస్తున్న పయనానికి తమ మద్దతును అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ ప్రకటించారు. ఆమె పర్యటనలకు తమ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతారని తెలిపారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్క వనితామణి కుమారుడు దినకరన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నమ్మ ప్రతినిధిగానే ఆయన రాజకీయ పయనంలో ఉన్నారు. అన్నాడీఎంకేలో చీలికతో ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను ఏర్పాటు చేశారు.
తొలుత చిన్నమ్మ ఈ కళగంకు ప్రతినిధిగా పేర్కొన్నా, చివరకు తానే ప్రధాన కార్యదర్శి ఆయన చాటుకున్నారు. అన్నాడీఎంకే కైవసంలో చిన్నమ్మకు కోర్టుల్లో చట్టపరంగా కొత్త చిక్కులు ఎదురు కాకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనేది జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితుల్లో తాజాగా చిన్నమ్మ దూకుడు పెంచారు. అన్నాడీఎంకే కేడర్‌ను తన వైపుకు తిప్పుకుని పార్టీ కైవశంకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు.
చదవండి: (స్వగ్రామానికి రాజ్ కిరణ్ మృతదేహం.. సీఎం స్టాలిన్ రూ. పది లక్షల సాయం)
శశికళ పర్యటన ఇలా..
రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిన్న చిన్నమ్మ శశికళ ఈనెల 27న తంజావూరులో , 28న మదురైలో, 29న రామనాథపురంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. పలు కార్యక్రమాలు, కేడర్‌తో పలకరింపుల దిశగా ఆమె పయనం సాగనుంది. ఈ పర్యటనల విజయవంతంతో పాటుగా ఆమెకు బ్రహ్మరథం పట్టేందుకు అమ్మమక్కల్ మున్నేట్ర కళగం సేనల్ని రంగంలోకి దించేందుకు దినకరన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా, చిన్నమ్మకు తన మద్దతు అని శనివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment