చెన్నై: జయలలిత జయంతి రోజు ఈనెల 24వ తేదీ తరువాత ఏం జరుగుతుందో చూడండి, చోటుచేసుకునే అనూహ్య రాజకీయ పరిణామాలకై వేచి ఉండండని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (అమ్మముక) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే శ్రేణులకు సవాల్ విసిరారు. నామక్కల్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాదరణతో మళ్లీ అధికారంలోకి వస్తాం, ఎంజీఆర్, జయలలిత చేత దుష్టశక్తి అని పిలువబడే డీఎంకేను అధికారంలోకి రానిస్తే ప్రజలు బాధితులుగా మారతారని అన్నాడీఎంకే ప్రచారం చేస్తోందన్నారు. అమ్మముక ప్రాబల్యం దక్షిణ తమిళనాడులో మాత్రమేనని కొందరు మంత్రులు ఎద్దేవా చేస్తున్నారన్నారు.
అయితే శశికళ విడుదల కాగానే రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు తరలివస్తున్నారన్నారు. శశికళకు స్వాగతానికి రూ.198 కోట్లు ఖర్చుచేశారని దుష్ప్రచారం చేస్తున్నారని, అన్నాడీఎంకే, డీఎంకే 60:40 శాతం నిష్పత్తితో చేతులు కలిపారని అన్నారు. చెన్నై కేకే నగర్‌లో నా గెలుపుగా రాబోయే ఎన్నికల్లో అమ్మముక పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమ్మ జయలలిత జయంతి తరువాత ఏమవుతుందో చూడండి అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment