
చెన్నై: రెండాకుల గుర్తును తిరిగి సాధించుకుంటామని అన్నాడిఎంకే బహిష్కృత నాయకుడు టీటీవీ దినకరన్ ప్రతిజ్ఞ చేశారు. తిరుర్పూర్‌లో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ శపథం చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో తాను విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అన్నాడీఎంకే పార్టీ అధికార చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ను తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయంతో రెండాకుల గుర్తు కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది.
ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని దినకరన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఈసీ పక్షపాతంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. కాగా, ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ డిసెంబర్ 21న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment