two leaves symbol
-
మళ్లీ కోర్టుకు రెండాకులు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ అప్పీలుకు వెళ్లారు. మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకే విజయ చిహ్నం రెండాకులు. డీఎంకే నుంచి బయటకు వచ్చినానంతరం ఎంజీఆర్ అన్నాడీఎంకే ఆవిర్భావం, విజయచిహ్నంగా రెండాకులను పరిచయం చేశారు. నాటి నుంచి రెండాకులు ప్రజల హృదయాల్లో పదిలమైంది. ఎంజీఆర్ మరణం తదుపరి పరిణామాలతో ఈ చిహ్నంకు సమస్య తప్పలేదు. తాజాగా అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో చిహ్నం కష్టాలు ఎక్కువే. ఈ చిహ్నం కోసం పెద్ద సమరమే సాగుతూ వస్తున్నది. తొలుత ఈ చిహ్నం కోసం పన్నీరుసెల్వం, పళనిస్వామిల మధ్య సమరం సాగింది. ఈ ఇద్దరు ఏకం కావడంతో దినకరన్ రూపంలో చిహ్నం కష్టాలు తప్పడం లేదు. ఈ చిహ్నాన్ని కైవసం చేసుకునేందుకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దినకరన్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. ఏడాదిన్నర కాలంగా న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు. చివరకు ఈ చిహ్నం వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల వెలువడ్డ తీర్పులో రెండాకుల చిహ్నం పళని, పన్నీరుల నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీకే చెందుతుందని ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. ఇక, చిహ్నం కష్టాలు, సమస్య తీరినట్టేనన్న ఆనందంలో మునిగారు. అయితే, దినకరన్ మాత్రం పట్టువదలడం లేదు. ఆ చిహ్నం కైవసం చేసుకునేందుకు మళ్లీ న్యాయ పోరాటం బాటపట్టారు. పిటిషన్: రెండాకుల చిహ్నాన్ని అన్నాడీఎంకేకు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దినకరన్ అప్పీలుకు రెడీ అయ్యారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు స్టే విధించి, రెండాకుల చిహ్నం విషయంగా విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దినకరన్ తరఫున మంగళవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో మళ్లీ చిహ్నం టెన్షన్ మొదలైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చిహ్నం వ్యవహారంలో కోర్టు ఏదేని ఉత్తర్వులు ఇచ్చిన పక్షంలో సంక్లిష్ట పరిస్థితులు తప్పదన్న ఆందోళన అన్నాడీఎంకేలో బయలు దేరింది. గత నెల తీర్పు వెలువరించే సమయంలో అన్నాడీఎంకే వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ బయలు దేరిన విషయం తెలిసిందే. తాజాగా దినకరన్ అప్పీలు రూపంలో ఏదేని కొత్త చిక్కులు వచ్చేనా అన్న ఆందోళన తప్పడం లేదు. -
రెండాకులు.. అన్నాడీఎంకేవే
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీ చిహ్నం ‘రెండాకులు’ను పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గానికి కేటాయి స్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. గతంలో కేం ద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ అగ్రనేతల్లో విభేదాలొచ్చి విడిపోయారు. ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం, శశికళ వర్గాలు రెండాకుల చిహ్నం కోసం పోటీపడ్డాయి. చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల చిహ్నం కోసం మూడు వర్గాలూ ఈసీని ఆశ్రయించాయి. అయితే, రెండాకుల చిహ్నం ఎవరికీ చెందకుండా తాత్కాలిక నిషేధం విధించింది. ఎన్నికల తర్వాత మూడు వర్గాలు ఈసీ వద్ద తమ వాదనలకు బలం చేకూరుస్తూ అనేక డాక్యుమెంట్లను సమర్పించాయి. కొన్నిరోజుల తర్వాత ఎడపాడి, పన్నీర్ సెల్వం ఏకమైపోగా శశికళ వర్గం ప్రతినిధిగా టీటీవీ దినకరన్ పోటీపడ్డారు. విచారణ జరిపాక ఎడపాడి, పన్నీర్‌సెల్వం నేతృత్వంలో అన్నాడీఎంకే పార్టీకే రెండాకుల చిహ్నాన్ని కేటాయిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈసీ నిర్ణయాన్ని దినకరన్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో వాదో పవాదాలు ముగియగా రెండాకుల చిహ్నాన్ని ఎడపాడి, పన్నీర్ సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకేకు కేటాయిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఓపీఎస్, ఈపీఎస్ బండారం బట్టబయలు!
సాక్షి, చెన్నై: తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు వేగంగా సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు శశికళ వర్గం కూడా సొంత కుంపటి పెట్టేదిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన టీటీవీ దినకరన్ సొంత పార్టీ పెట్టేదిశగా వేగంగా కదులుతున్నారు. మద్దతుదారులతో చర్చించి త్వరలోనే కొత్త పార్టీని ప్రకటిస్తానని తాజాగా బుధవారం దినకరన్ వెల్లడించారు. అన్నాడీఎంకేను, రెండాకుల గుర్తును కాపాడుకోవడానికే కొత్త పార్టీని పెట్టాలని భావిస్తున్నట్టు దినకరన్ తెలిపారు. రెండాకుల గుర్తును సొంతం చేసుకుంటామని అన్నారు. అన్నాడీఎంకేకు చెందిన 90శాతం కేడర్ తనవైపే ఉందని దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. ఓపీఎస్, ఈపీఎస్‌లకు తప్ప అందరికీ తన పార్టీలో స్థానం ఉంటుందన్నారు. ఓపీఎస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. అన్నాడీఎంకేలోని స్లీపర్ సెల్స్ బయటకు వస్తారని తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు. ఓపీఎస్ ప్రభుత్వం కూలిపోతుందని, ప్రభుత్వం పడిపోయాక ఓపీఎస్, ఈపీఎస్ బండారం బట్టబయలు చేస్తానని హెచ్చరించారు. సీఎం ఓపీఎస్ ఎంతటి అవినీతి తిమింగలమో త్వరలోనే బయటపెడతానని పేర్కొన్నారు. సినిమా వారు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు అని రజనీ, కమల్ ఎంట్రీ గురించి కామెంట్ చేశారు. కానీ సినిమాలే కాక రాజకీయాల్లో అనేక విషయాలు ఉంటాయని, ఆ విషయాలు తమకు తెలుసునని అన్నారు. అందుకే రాబోయే రోజుల్లో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
దినకరన్ శపథం
చెన్నై: రెండాకుల గుర్తును తిరిగి సాధించుకుంటామని అన్నాడిఎంకే బహిష్కృత నాయకుడు టీటీవీ దినకరన్ ప్రతిజ్ఞ చేశారు. తిరుర్పూర్‌లో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ శపథం చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో తాను విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే పార్టీ అధికార చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ను తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయంతో రెండాకుల గుర్తు కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని దినకరన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఈసీ పక్షపాతంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. కాగా, ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ డిసెంబర్ 21న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. -
రెండాకుల గుర్తు... శశికళ వర్గానికి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : అన్నాడీఎంకే పార్టీ గుర్తుపై నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రెండాకుల గుర్తును పళని-పన్నీర్ వర్గానికి కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శశికళ వర్గానికి మరోసారి చుక్కెదురైనట్లయ్యింది. జయలలిత చనిపోయాక ఆమె సహయకురాలు శశికళ నటరాజన్ ముఖ్యమంత్రి పదవి కోసం యత్నించటం.. పన్నీర్ సెల్వం తిరుగుబాటు, ఆపై అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లటం.. పళనిసామి ముఖ్యమంత్రి కావటం ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోయాయి. ఇక అప్పటి నుంచి పన్నీర్ వర్సెస్ పళని వర్సెస్ శశికళ-దినకరన్ వర్గ పోరుతో ఎంట్రీతో అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం తారా స్థాయికి చేరుకుంది. ఇక ఆర్కే నగర్ ఉప ఎన్నిక సమయంలో పార్టీ గుర్తు కోసం శశికళ-దినకరన్, పళని, పన్నీర్ వర్గాలు ఈసీని ఆశ్రయించటంతో ఆ సమయంలో గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేశారు. తర్వాత ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు ఏకం కావటంతో గుర్తు ఎవరికి కేటాయిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ అంశంపై పలు దఫాలుగా విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరకు బుధవారం నిర్వహించిన సమావేశంలో శశికళ వర్గ వాదనను పక్కకు పెట్టి పళని-పన్నీర్ వర్గానికే గుర్తును కేటాయిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. -
రెండాకుల గుర్తును శాశ్వతంగా నిలిపేయండి’
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీకి చెందిన ‘రెండాకుల’ గుర్తును ఎవరికీ కేటాయించకుండా శాశ్వతంగా నిలిపేయాలని శశికళ–దినకరన్ వర్గం కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ)ను కోరింది. సోమవారం ఈసీ రెండో విచారణలో భాగంగా శశికళ–దినకరన్ తరఫున మాజీ మంత్రి అశ్విని కుమార్ వాదిస్తూ.. తమిళనాడు సీఎం పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు దాఖలు చేసిన పత్రాలకు చట్టబద్ధత ఏముందని ప్రశ్నించారు. అన్నాడీఎంకే రాజ్యాంగం ప్రకారం పార్టీలో ప్రాథమిక సభ్యుల మద్దతునే పరిగణనలోకి తీసుకుంటామనీ, దీనిప్రకారం తమకే పార్టీలో పూర్తి మద్దతు ఉందన్నారు. అనంతరం ఈసీ విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. -
ఢిల్లీకి దినకరన్.. చెన్నైలో ముగిసిన విచారణ
-
ఢిల్లీకి దినకరన్.. చెన్నైలో ముగిసిన విచారణ
చెన్నై: రెండాకుల గుర్తు తమ వర్గానికి దక్కడం కోసం ఎన్నికల కమిషన్ అధికారులకే కోట్లలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ను క్రైం బ్రాంచ్ పోలీసులు చెన్నై నుంచి ఢిల్లీకి తరలించారు. తమ కస్టడీలో ఉన్న దినకరన్‌ను గురువారం చెన్నైకి తీసుకొచ్చిన పోలీసులు అడయార్‌లోని నివాసంలో గత రెండు రోజులుగా విచారణ చేశారు. ఇదే కేసులో అరెస్టయిన ఆయన స్నేహితుడు మల్లికార్జున్ అన్నానగర్ శాంతి కాలనీలోని ఇంట్లో ఉంచి విచారణ చేశారు. వీరి వద్ద నుంచి కొన్ని కీలక సాక్ష్యాలు సేకరించారు. చెన్నైలో దినకరన్‌ను విచారించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను రాజాజీ భవన్‌నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడే పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. పోరూర్‌లోని మరో ఇంట్లో, తిరువేర్కాడులోని ఓ నివాసంలో గంటపైగా విచారణ సాగించిన ఢిల్లీ బృందం తదుపరి రాజాజీభవన్‌కు చేరుకుని దినకరన్‌ను, మల్లికార్జున్‌ను పలు విషయాలపై ప్రశ్నించారు. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఢిల్లీలోనూ పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తు తమ వర్గానికి దక్కడం కోసం ఏకంగా ఎన్నికల కమిషన్ అధికారులకు రూ.50 కోట్లు లంచం ఇవ్వజూపిన కేసులో టీటీవీ దినకరన్ వెనక ఉన్నది మన్నార్గుడి మాఫియా అని దాదాపు తేలిపోయింది. ఐదు రోజుల కస్డడీలో ఉన్న దినకరన్‌ను ఢిల్లీకి తీసుకెళ్లి కేసుకు సంబంధించిన నివేదికను తయారు చేయనున్నారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని భావించిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముందస్తుగా ఆయనకు లుక్ అవుట్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. -
దినకరన్ నివాసంలో పోలీసుల సోదాలు
న్యూఢిల్లీ: ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్ట్ అయిన దినకరన్ నివాసంలో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గురువారం సోదాలు నిర్వహించారు. కాగా విచారణ నిమిత్తం ఆయనను న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి అప్పగించిన దృష్ట్యా, దినకరన్‌ను ఇవాళ ఢిల్లీ పోలీసులు చెన్నైకు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా తొమ్మిదిమంది సభ్యుల బృందం దినకరన్‌ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆయన సతీమణిని కూడా పోలీసులు విచారణ చేయనున్నట్లు సమాచారం. కాగా అన్నాడీఎంకే పార్టీ చిహ్నం కోసం రూ.50 కోట్లు ఎరగా వేయడం వెనుక దినకరన్ ఒక్కడి హస్తం మాత్రమే ఉండే అవకాశాలు లేవని, ఆ పార్టీకి చెందిన వారికి కూడా ఈ విషయాలు తెలిసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఈ కేసులో పది కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్టు సంకేతాలు ఉన్నా, పట్టుబడింది మాత్రం రూ.1.3 కోట్లే కావడంతో మిగిలిన మొత్తంపై లెక్క తేలాల్సి ఉంది. ఈ మొత్తం ఎవరి చేతిలో ఉన్నాయో, దీని వెనుక మరెవ్వరి హస్తం అయినా ఉండొచ్చన్న సంకేతాలతో, తదుపరి అరెస్టు ఎవరో, తదుపరి ఉచ్చు ఎవర్ని బిగుసుకుంటుందో అనే దానిపై ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్నాయి. -
దినకరన్‌కి ఐదు రోజుల పోలీస్ కస్టడీ
-
దినకరన్‌కి ఐదు రోజుల పోలీస్ కస్టడీ
న్యూఢిల్లీ: ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్ట్ అయిన అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అయిదు రోజులు పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ క్రైం బ్రాంచ్ డీసీపీ మాట్లాడుతూ ఈ కేసులో దినకరన్ ప్రమేయంపై కావాల్సినన్నీ ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అయితే మరింత సమాచారం బయటకు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. కాగా దినకరన్‌తో పాటు ఆయన సన్నిహితుడు మల్లికార్జునను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా వరుసగా నాలుగు రోజుల పాటు దినకరన్‌ను ప్రశ్నించిన ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు.. ఎట్టకేలకు ఆయనను గతరాత్రి అరెస్టు చేశారు. తమ వర్గానికి రెండాకుల గుర్తు తెచ్చుకోవడం కోసం ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వజూపారన్న నేరంలో దినకరన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దినకరన్‌తో పాటు ఆయన స్నేహితుడు మల్లికార్జునను కూడా అరెస్టు చేశారు. పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసినా, దినకరన్‌ను దాచిపెట్టారన్నది మల్లికార్జునపై ఉన్న అభియోగం. వీళ్లిద్దరినీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అలాగే దినకరన్‌ను తమ కస్టడీకి అనుమతించాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు...అయిదురోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. -
అర్ధరాత్రి హైడ్రామా.. దినకరన్ అరెస్టు
తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ (53) .. మంగళవారం అర్ధరాత్రి హైడ్రామా నడుమ అరెస్టయ్యారు. వరుసగా నాలుగు రోజుల పాటు దినకరన్‌ను ప్రశ్నించిన ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు.. ఎట్టకేలకు ఆయనను అరెస్టు చేశారు. సోమవారం కూడా రాత్రి 1 గంట వరకు దినకరన్‌ను ప్రశ్నించిన పోలీసులు.. మంగళవారం సైతం అదే పద్ధతిలో అర్ధరాత్రి వరకు ప్రశ్నిస్తుండటంతో అసలు అరెస్టు ఉంటుందా లేదా అన్న అనుమానాలు తలెత్తాయి. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా దినకరన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు అర్ధరాత్రి సమయంలో ప్రకటించారు. తమ వర్గానికి రెండాకుల గుర్తు తెచ్చుకోవడం కోసం ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇవ్వజూపారన్న నేరంలో దినకరన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దినకరన్‌తో పాటు ఆయన స్నేహితుడు మల్లికార్జునను కూడా అరెస్టు చేశారు. పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసినా, దినకరన్‌ను దాచిపెట్టారన్నది మల్లికార్జునపై ఉన్న అభియోగం. వీళ్లిద్దరినీ బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదే కేసులో ఇంతకుముందు అరెస్టయిన మధ్యవర్తి సుఖేష్ చంద్రశేఖర్‌ను తాను కలిసినట్లు దినకరన్ పోలీసుల విచారణలో అంగీకరించారు. అయితే, తాను అతడికి డబ్బులు మాత్రం ఏమీ ఇవ్వలేదని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని అంటున్నారు. ఏప్రిల్ 16వ తేదీన దక్షిణ ఢిల్లీలోని ఓ హోటల్లో రూ. 1.3 కోట్ల నగదుతో చంద్రశేఖర్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని తాను ఎన్నికల కమిషన్ అధికారులకు ఇవ్వాల్సి ఉందని విచారణలో సుఖేష్ చెప్పాడు. అంతకుముందు మంగళవారం నాడు.. లంచాల ఆరోపణలపై దినకరన్ మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని ఢిల్లీ పోలీసులను కోర్టు ప్రశ్నించింది. అసలే దినకరన్, శశికళ ఇద్దరినీ పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్న పన్నీర్ సెల్వం వర్గానికి.. ఇప్పుడు అతడి అరెస్టుతో మార్గం మరింత సులభతరమైంది. -
సుఖేష్ బుట్టలో దినకరన్ ఎలా పడ్డాడో తెలుసా?
అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న టీటీవీ దినకరన్.. చాలా తేలిగ్గా బుట్టలో పడిపోయాడట. సుఖేష్ చంద్రశేఖర్ తనను తాను హైకోర్టు జడ్జిగా పరిచేయం చేసుకుంటే నిజమేననుకుని నమ్మేసి ఎన్నికల కమిషన్ అధికారులకు లంచం ఇప్పించడానికి అతడే సరైన వ్యక్తి అనుకున్నాడట. ఈ విషయం ఢిల్లీ పోలీసుల విచారణలో తేలింది. ఏప్రిల్ 16న సుఖేష్ అరెస్టు కావడానికి సరిగ్గా 20 గంటల ముందు అతడికి దినకరన్ ఫోన్ చేశాడు. రెండాకుల గుర్తు తమకే దక్కాలన్న ఆశతో ఉన్న దినకరన్.. సుఖేష్ బుట్టలో సులభంగా పడిపోయాడు. వరుసగా మూడోరోజు కూడా దినకరన్‌ను ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు విచారించనున్నారు. ఆదివారం కూడా అర్ధరాత్రి 1 గంట వరకు విచారణ కొనసాగుతూనే ఉంది. తమ వద్ద ఉన్న పక్కా సాక్ష్యాలతో దినకరన్‌ను పోలీసులు ఉక్కిరిబిక్కిరి చేశారు. సుఖేష్.. చాలా సుఖ పురుషుడు! అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమించిన టీటీవీ దినకరన్.. ఆ తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఒకటైపోయే సూచనలు కనిపించడంతో పార్టీనుంచి తప్పుకోవాల్సి వచ్చింది. శశికళ, దినకరన్ కుటుంబ సభ్యులెవరూ పార్టీలో ఉండటానికి వీల్లేదని గట్టిగా డిమాండ్లు రావడంతో దినకరన్ వెళ్లక తప్పలేదు. సరిగ్గా ఇదే సమయంలో పోలీసులు సుఖేష్ చంద్రశేఖర్‌ను ఢిల్లీలో అరెస్టు చేయడం, అతడిచ్చిన సమాచారంతో దినకరన్‌కు నోటీసులు పంపడం తెలిసిందే. తాను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటానని, అయితే తనను పదవి నుంచి తొలగించాలంటే మాత్రం అది కేవలం ఒక్క శశికళ వల్లే అవుతుందని చెప్పారు. కాగా జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ ప్రస్తుతం బెంగళూరు జైల్లో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
ఢిల్లీ నుంచి వచ్చాక మాట్లాడుతా
-
ఢిల్లీ నుంచి వచ్చాక మాట్లాడుతా
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే గుర్తు 'రెండాకులు' దక్కించుకునేందుకు ఎన్నికల అధికారికి భారీ మొత్తంలో లంచం ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మధ్యవర్తి సుఖేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. శనివారం ఆయన చెన్నై నుంచి ఢిల్లీకి వచ్చారు. చెన్నై విమానాశ్రయంలో దినకరన్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడుతానని చెప్పారు. శనివారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని బుధవారం అర్థరాత్రి దినకరన్‌కు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఆర్కే నగర్ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఆయన అన్నాడీఎంకే శశికళ వర్గం తరఫున బరిలో నిలిచారు. కాగా ఓటర్లకు భారీగా డబ్బులు పంపిణీ చేశారని ఐటీ దాడుల్లో వెలుగు చూడటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆర్కే నగర్ ఎన్నికలను రద్దు చేస్తూ, ఎన్నికల తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. రెండాకుల గుర్తుకోసం ఎన్నికల అధికారికి రూ. 50 కోట్ల లంచం ఇవ్వజూపారని దినకరన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాలతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గాల మధ్య విలీన ప్రతిపాదనలు వచ్చాక అన్నాడీఎంకే నుంచి దినకరన్‌ను బహిష్కరించారు. -
రెండాకుల గుర్తుపై ఈసీ ఏమంటోంది?
తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకేలో రాజకీయాలు పలురకాల మలుపులు తిరుగుతున్నాయి. ఒకవైపు పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు విలీనం అయిపోయేందుకు ప్రయత్నిస్తున్నాయి. శశికళ, దినకరన్‌లను పూర్తిగా పార్టీ నుంచి బహిష్కరించినట్లు లిఖితపూర్వకంగా చూపించాలని, మరికొన్ని షరతులకు కూడా అంగీకరించాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. రెండాకుల గుర్తు కోసమే వీళ్లిద్దరూ కలుస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడా గుర్తు గురించిన వివాదం ఎన్నికల కమిషన్ వద్ద పెండింగ్‌లో ఉంది. ఇటీవల వాయిదాపడిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల కోసం పన్నీర్ వర్గానికి విద్యుత్ స్తంభం, శశికళ వర్గానికి టోపీ గుర్తులను ఈసీ కేటాయించింది. అయితే ఇప్పుడు అక్కడి రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోతున్నాయి. శశికళ వర్గం అంటూ ఇక ఏమీ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో రెండాకుల గుర్తుపై ఎవరేమంటారో చెప్పేందుకు జూన్ 16వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది. రెండు వర్గాలూ తమ వద్ద ఉన్న పత్రాలు, ఆధారాలు అన్నింటినీ ఆలోగా సమర్పించాలని తెలిపింది. ఇప్పుడు ఎటూ రెండు వర్గాలూ కలిసిపోతున్నాయి కాబట్టి గుర్తు విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే భావిస్తున్నారు. ఇద్దరూ ఒకే వర్గంగా కలిసిపోయి అప్పుడు ఎన్నికల కమిషన్‌కు ఒకే అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని అంటున్నారు. రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరిందుకు కాస్త సమయం పడుతుంది కాబట్టి.. ఎటూ ఎన్నికల కమిషన్ కూడా చాలా ఎక్కువ గడువు ఇచ్చినందున ఈలోపు విషయం మొత్తం సర్దుమణుగుతుందని చెబుతున్నారు. చిన్న చిన్న విభేదాలను త్వరలోనే పరిష్కరించుకుంటామని, ఇకమీదట ఒకే అన్నాడీఎంకే ఉంటుందని, రెండాకుల గుర్తు కూడా తమకే వస్తుందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. -
దినకరన్, సుఖేష్ చుట్టూ బిగుసుకున్న ఉచ్చు
రెండాకుల గుర్తు కోసం టీటీవీ దినకరన్ చేసిన ప్రయత్నం బాగా బెడిసికొట్టింది. తాజాగా ఆయనతో పాటు ఆయన తరఫున బ్రోకర్‌గా వ్యవహరించిన సుఖేష్ చంద్రశేఖర్ మీద కూడా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. రెండాకుల గుర్తు కోసం సుఖేష్‌కు దినకరన్ కొంత లంచం డబ్బులు ఇచ్చినట్లు ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన నేరంలో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో ఇప్పుడు దినకరన్, సుఖేష్ ఇద్దరి పేర్లు ఉన్నాయి. (చదవండి: సుకేష్.. చాలా సుఖ పురుషుడు!) జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నికల సందర్భంగా భారీ మొత్తంలో డబ్బులు పంచడం, దానికి సంబంధించి ఉప్పందడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేయగా 80 కోట్ల రూపాయలకు పైగా పంచినట్లు ఆధారాలు లభించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించి ఏకంగా ఆర్కేనగర్ ఉప ఎన్నికలనే రద్దుచేసింది. ఇలా భారీగా డబ్బులు పంచారన్న కారణంతో ఒక ఉప ఎన్నికను రద్దు చేయడం బహుశా ఇదే మొదటిసారి. అప్పుడే దినకరన్ - శశికళ వర్గం తమ పార్టీ వెబ్సైట్లోను, సోషల్ మీడియాలోను రెండాకుల గుర్తును విస్తృతంగా ప్రచారం చేసుకుంది. దానిపై కూడా ఈసీ తీవ్రస్థాయిలో మండిపడింది. అమ్మకు సంబంధించిన గుర్తు తమకు వస్తే తప్ప ఎన్నికల్లో ప్రజలు ఓటేసే అవకాశం లేదని భావించిన దినకరన్.. ఆ గుర్తు కోసం ఏకంగా ఈసీకే లంచం ఇవ్వాలని ప్రయత్నించి అడ్డంగా దొరికేశారు. ఆయనకు సహకరించిన సుఖేష్ కూడా బుక్కయ్యాడు. -
సుకేష్.. చాలా సుఖ పురుషుడు!
అది దక్షిణ ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్. అందులోని ఓ గదిలో సుకేష్ చంద్రశేఖర్ చాలా తాపీగా కూర్చున్నాడు. అంతలో ఉన్నట్టుండి అక్కడకు పోలీసులు వచ్చారు. వాళ్లు వచ్చే సమయానికి అతడి చేతికి రూ. 6.5 కోట్ల విలువైన బ్రేస్లెట్ ఉంది. దాదాపు 7 లక్షల రూపాయల విలువైన బూట్లు, 1.3 కోట్ల రూపాయల నగదు, ఇంకా చాలా చాలా విలాసవంతమైన వస్తువులున్నాయి. అన్నాడీఎంకే అభ్యర్థిగా ఆర్కే నగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన టీటీవీ దినకరన్ తరఫున ఎన్నికల కమిషన్‌కు లంచం ఇచ్చేందుకు బెంగళూరుకు చెందిన చంద్రశేఖర్ ఢిల్లీకి వచ్చాడని ఆ తర్వాత విచారణలో తేలింది. తమ పార్టీకి రెండాకుల గుర్తు వచ్చేందుకు 50 కోట్ల వరకు ఇవ్వడానికి తాను సిద్ధమని దినకరన్ చంద్రశేఖరన్‌కు చెప్పినట్లు తెలిసింది. నగరంలో నల్లధనం గురించి తమకు సమాచారం రావడంతో తాము సోదాలు చేసి, చంద్రశేఖర్‌ను అరెస్టు చేశామని, కానీ ఇది ఇంత పెద్ద కేసన్న విషయం ఆ తర్వాత తెలిసిందని పోలీసులు కూడా అంటున్నారు. ఢిల్లీలో పని మొదలుపెట్టడానికి ముందుగా రూ. 10 కోట్లు సుకేష్‌కు ఇచ్చారని సమాచారం. అయితే, ఎన్నికల కమిషన్ అధికారుల వద్దకు ఈ లంచం ప్రతిపాదన ఏమైనా వెళ్లిందా లేదా అనేందుకు మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు. ఢిల్లీలో పోలీసులు పట్టుకునేసరికి సుకేష్ లూయిస్ విట్టన్ చెప్పులు వేసుకున్నాడు. అతడి మీద చెన్నై, బెంగళూరు నగరాల్లో 12 కేసులున్నాయి. వాటిలో మోసం, ఫోర్జరీ.. ఇలా రకరకాలవి ఉన్నాయి. ఢిల్లీలో చాలా ఫ్యాన్సీ ఫాంహౌస్‌లు ఉన్నాయి. అతడి నెట్వర్క్ చాలా పెద్దదని, దినకరన్‌కు ఇతడు నాలుగేళ్లుగా తెలుసని పోలీసుల సమాచారం. సుకేష్ చంద్రశేఖర్ ఇంటర్మీడియట్తోనే చదువు ఆపేశాడు. 17 ఏళ్ల యవసులో తొలిసారిగా ఒక స్కాంలో ఇతగాడి పేరు బయటకు వచ్చింది. తన సొంత ఊళ్లో బ్రోకర్‌గా వ్యవహరిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులను అమ్మేసేవాడు. అప్పటికి మైనర్ కావడంతో అరెస్టు చేయలేకపోయారు. కానీ ఏడాది తర్వాత సరిగ్గా అదే పద్ధతిలో చెన్నైలో పెద్ద వ్యవహారం చేస్తూ దొరికేసి, కొన్నాళ్లు జైల్లో ఉండి బెయిల్ తెచ్చుకున్నాడు. తర్వాత ఉత్తరాదికి వ్యాపారాన్ని విస్తరించాడు. నకిలీ బీమా పాలసీలు అమ్ముతూ అతి తక్కువ కాలంలో 3 వేల కోట్లు సంపాదించాడు. తనను తాను ఎంపీగా చెప్పుకోడానికి నకిలీ ఐడీ కార్డులు కూడా వాడేవాడట! అతడి దగ్గర సీజ్ చేసిన ఒక బీఎండబ్ల్యు, ఒక మెర్సిడిస్ కార్ల మీద 'మెంబర్ ఆఫ్ పార్లమెంట్' అనే స్టిక్కర్లు లైసెన్సు ప్లేట్ల మీద ఉన్నాయి. తమిళ నటిని పెళ్లాడి... మద్రాస్ కేఫ్, బిర్యానీ లాంటి సినిమాల్లో నటించిన లీనా మేరీ పాల్‌ను చంద్రశేఖర్ పెళ్లి చేసుకున్నాడు. కానీ, వీళ్లిద్దరినీ 2015 సంవత్సరంలో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు కూడా కారణం మోసం చేయడమే. తనకు కేంద్రంలో చాలా మందితో సంబంధాలు ఉన్నాయని, తాను తలచుకుంటే బెంగళూరు జైలు నుంచి శశికళను కూడా బయటకు రప్పించగలనని చెప్పుకొనేవాడట. -
శశికళ వర్గానికి ఎన్నికల కమిషన్ ఝలక్
-
శశికళ వర్గానికి ఎన్నికల కమిషన్ ఝలక్
జయలలిత మరణంతో ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలు బాగా వేడెక్కాయి. శశికళ వర్గం నుంచి టీటీవీ దినకరన్, పన్నీర్ సెల్వం వైపు నుంచి కురువృద్ధుడు మధుసూదనన్, ఇంకా దీపా జయకుమార్, బీజేపీ, డీఎండీకే.. ఇలా బహుముఖ పోటీతో అక్కడ రాజకీయాలు మంచి రంజుగా ఉన్నాయి. రెండాకుల గుర్తు కోసం అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు విపరీతంగా పోరాడాయి. దాంతో దాన్ని ఎవరికీ ఇవ్వకుండా ఒకరికి టోపీ, మరొకరికి కరెంటు స్తంభం ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, శశికళ వర్గం మాత్రం సోషల్ మీడియా ప్రచారంలో రెండాకుల గుర్తును విచ్చలవిడిగా వాడేస్తోందట. ఈ విషయం తెలిసి ఎన్నికల కమిషన్ తీవ్రంగా మండిపడింది. పార్టీ వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా అకౌంట్లు అన్నింటి నుంచి వెంటనే రెండాకుల గుర్తును తీసేయాలని ఆదేశించింది. అలాగే, అన్నాడీఎంకే పేరు, గుర్తును ఉపయోగించకూడదని తామిచ్చిన ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారో వివరించాలంటూ అందుకు గురువారం ఉదయం వరకు సమయం ఇచ్చింది. ఇలా అన్నా డీఎంకే గుర్తును ఇష్టం వచ్చినట్లు ఉపయోగించడం ఐపీసీ 171జి సెక్షన్ ప్రకారం ఎన్నికల నేరమే అవుతుందని స్పష్టం చేసింది. రెండాకుల గుర్తును ప్రింట్, ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ మీడియాలలోను, పార్టీ వెబ్సైట్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి చోట్ల వాడటాన్ని వెంటనే ఆపేయాలని తెలిపింది. ఈనెల 9వ తేదీన ఆర్కేనగర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో శశికళ వర్గానికి టోపీ, పన్నీర్ సెల్వం వర్గానికి విద్యుత్ స్తంభం గుర్తులు వచ్చాయి.