
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీకి చెందిన ‘రెండాకుల’ గుర్తును ఎవరికీ కేటాయించకుండా శాశ్వతంగా నిలిపేయాలని శశికళ–దినకరన్ వర్గం కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ)ను కోరింది. సోమవారం ఈసీ రెండో విచారణలో భాగంగా శశికళ–దినకరన్ తరఫున మాజీ మంత్రి అశ్విని కుమార్ వాదిస్తూ.. తమిళనాడు సీఎం పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు దాఖలు చేసిన పత్రాలకు చట్టబద్ధత ఏముందని ప్రశ్నించారు. అన్నాడీఎంకే రాజ్యాంగం ప్రకారం పార్టీలో ప్రాథమిక సభ్యుల మద్దతునే పరిగణనలోకి తీసుకుంటామనీ, దీనిప్రకారం తమకే పార్టీలో పూర్తి మద్దతు ఉందన్నారు. అనంతరం ఈసీ విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment