దినకరన్‌కు మరో షాక్‌! | Charges framed against TTV Dhinakaran in FERA case | Sakshi
Sakshi News home page

దినకరన్‌కు మరో షాక్‌!

Published Thu, Jun 8 2017 2:19 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

దినకరన్‌కు మరో షాక్‌!

దినకరన్‌కు మరో షాక్‌!

  • ఫెరా కేసులో అభియోగాలు ఖరారు
  • చెన్నై: అన్నాడీఎంకే అధికారిక గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపినట్టు ఇప్పటికే కేసు ఎదుర్కొంటున్న ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు మరో షాక్‌ తగిలింది. 2001లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదుచేసిన కేసులో ఆయనపై ఎగ్మూరు అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు అభియోగాలు ఖరారు చేసింది. విదేశీ మారక ద్రవ నియంత్రణ చట్టం (ఫెరా)లోని పలు నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ కేసు నమోదు చేసింది.

    ఈ కేసు విచారణకు గురువారం వ్యక్తిగతంగా హాజరైన దినకరన్‌ న్యాయమూర్తి అభియోగాలు చదివి వినిపించగా.. వాటిని తిరస్కరించారు. ఆర్బీఐ అనుమతి లేకుండా కోటి నాలుగు లక్షల 93వేల 313 డాలర్ల అక్రమ లావాదేవీలను దినకరన్‌ నిర్వహించి.. బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్‌లోని డిప్పర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌లోకి తరలించినట్టు ఈడీ కేసు నమోదుచేసింది. 36 లక్షల 36వేల డాలర్లు, లక్ష పౌండ్ల అక్రమ లావాదేవీలు విదేశాల్లో నిర్వహించినట్టు ఈడీ మరో కేసు కూడా దినకరన్‌పై పెట్టింది. ఈ రెండు కేసులలోనూ విచారణను న్యాయస్థానం జూన్‌ 22కు వాయిదా వేసింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement