‘దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ’ అనేది ప్రతీ యుగంలోనూ జరుగుతూవస్తోంది. ఈ మహోన్నత కార్యాన్ని నెరవేర్చేందుకు అవతారపురుషులు, మహనీయులు జన్మిస్తూనే ఉన్నారు. ఇదే కోవలో దుష్ట శిక్షణకు ఉద్భవించినవాడే సుబ్రహ్మణ్యుడు. లోకసంరక్షణార్ధం పరమశివుని మహాతేజస్సు నుంచి షష్టి తిథి రోజున సుబ్రహ్మణ్యస్వామి అవతరించాడు. అందుకే ఆ రోజును సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు.
సుబ్రహ్మణ్య షష్ఠి దీపావళి పండుగ తర్వాత వస్తుంది. దీనిని స్కందషష్ఠి అని, సుబ్బారాయషష్ఠి అని కూడా అంటారు. ఈ సారి సుబ్రహ్మణ్య షష్టి 2024, డిసెంబరు 7న అంటే ఈరోజు వచ్చింది. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య షష్టిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యుడిని కార్తికేయుడు అని కూడా అంటారు.
తమిళనాడులో సుబ్రహ్మణ్య షష్ఠిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కుక్కే సుబ్రమణ్య షష్ఠి లేదా కార్తికేయ సుబ్రహ్మణ్య షష్ఠి పేరుతో వివిధ ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున కార్తికేయుడు ఆరు రోజుల సుదీర్ఘ యుద్ధం తర్వాత తారకాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. తమిళనాడులో ఎంతో ప్రాచుర్యం పొందిన సుబ్రమణ్యస్వామి దేవాలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాల్లో సుబ్రహ్మణ్య షష్టి రోజున ఘనంగా పూజలు నిర్వహిస్తారు.
1. తిరుపరంకుండ్రం.. ట్రెక్కింగ్ చేస్తూ..
తమిళనాడులోని తిరుపరంకుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. కొండపై ఉన్న ఈ దేవాలయంలోని శిల్పకళ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. అందమైన పరిసర ప్రాంతాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. భక్తులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని తరచూ దర్శిస్తుంటారు. ఇక్కడ జరిగే ‘పంగుని ఉతిరమ్’ ఉత్సవానికి లక్షలాదిమంది భక్తులు హాజరవుతుంటారు. ట్రెక్కింగ్ చేసేవారు తమ అభిరుచిని నెరవేర్చుకుంటూ, ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు.
2. తిరుచెందూర్.. బంగాళాఖాతం ఒడ్డున..
తిరుచెందూర్‌లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తమిళనాడులోని సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలలో ఒకటి. ఇది బంగాళాఖాతం ఒడ్డున ఉంది. ఈ ఆలయం వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది. స్కంద షష్టినాడు ఇక్కడ జరిగే పూజలను తిలకించేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఆలయం పక్కనే కనిపించే సుందరమైన బీచ్ భక్తులకు అద్భుత అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ కనిపించే సూర్యోదయం, సూర్యాస్తమయం ఎంతో అద్భుతంగా ఉంటాయని చెబుతారు. ఈ ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది.
3. దండాయుతపాణి ఆలయం.. ప్రత్యేక ప్రవేశ ద్వారం..
దండయుతపాణి స్వామి ఆలయం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని పళనిలో ఉంది. ఎత్తైన కొండపై ఉన్న ఈ దేవాలయానికి అద్భుతమైన ప్రవేశ ద్వారం ఉంది. నాటి శిల్పకళకు తార్కాణంగా ఈ ఆలయం నిలుస్తుంది. ఈ ఆలయానికి భక్తులే కాకుండా సహసయాత్ర చేయాలనుకునేవారు కూడా తరలి వస్తుంటారు.
4. స్వామినాథ స్వామి ఆలయం.. 60 మెట్లతో
తమిళనాడులోని స్వామిమలైలో ఉన్న స్వామినాథ స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొండపై ఉన్న ఈ ఆలయం సందర్శకులకు దివ్యమైన అనుభూతిని అందిస్తుంది. జీవితంలోని ఆరు దశలకు ప్రతీకగా ఇక్కడ 60 మెట్లు కనిపిస్తాయి. వీటి అధిరోహణ యాత్రికులకు అద్భుత అనుభూతిని అందిస్తుంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.
5. తిరుత్తణి.. 365 మెట్లను అధిరోహిస్తూ..
తిరుత్తణిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే కాకుండా అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేందుకు అవకాశం కల్పిస్తుంది. భక్తులు ఈ ఆలయాన్ని దర్శించేందుకు 365 మెట్లను అధిరోహించాల్సి ఉంటుంది. ఈ ఆచారాన్ని ఇక్కడకు వచ్చే భక్తులు తప్పనిసరగా పాటిస్తుంటారు. పండుగల సమయంలో ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు. అద్భుతమైన శిల్ప సంపద ఈ ఆలయంలో అడుగడుగునా కనిపిస్తుంది.
6. పజముదిర్చోలై.. కార్తికేయుని ఆరు నివాసాలలో..
తమిళనాడులోని పురాతన సుబ్రమణ్య స్వామి ఆలయాలలో పజముదిర్చోలైలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఒకటి. ఇది కార్తికేయుని ఆరు నివాసాలలో ఒకటిగా పేరొందింది. ఈ ఆలయాన్ని అరుపడై వీడు అని పిలుస్తారు. ముఖ్యంగా కార్తిక మాసంలో ఈ ఆలయానికి లెక్కకు మించిన సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయంలో ప్రతిరోజూ వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.
7. కల్యాణ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం
కల్యాణ సుబ్రమణ్య స్వామి దేవాలయం తమిళనాడులో కల్యాణ పులియంకుళం పట్టణంలో ఉంది. ఈ మురుగన్ ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేష పూజలు జరుగుతుంటాయి. అలాగే సుబ్రహ్మణ్యుని కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్మాణం సాంప్రదాయ, ఆధునిక శైలులకు ప్రతీకగా నిలుస్తుంది.
8. అరుపడై వీడు మురుగన్ ఆలయం
కొడైకెనాల్ శివారులో ఉన్న అరుపడై వీడు మురుగన్ ఆలయం కొండలు, అందమైన లోయల నడుమ ఉంది. ఈ ఆలయ నిర్మాణశైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. తమిళనాడులో మురుగన్‌కు ఉన్న ఆరు నివాసాలలో ఇది ఒకటని చెబుతుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించేవారు ఇక్కడ ట్రెక్కింగ్ చేయడాన్ని అమితంగా ఇష్టపడతారు.
9. పచ్చైమలై మురుగన్ ఆలయం.. ప్రశాంతతకు నిలయం
పచ్చైమలై మురుగన్ ఆలయం తమిళనాడులోని గోబిచెట్టిపాళయంలో ఉంది. కొండలపై నెలకొని ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రశాంతతను అందిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెతుక్కునే వారికి ఇది మైలురాయిలా నిలుస్తుంది. ఆలయ నిర్మాణం దక్షిణ భారతీయ శైలిలో ఉంటుంది.
10. సెంగుంథర్ శివ సుబ్రమణ్య స్వామి ఆలయం
తమిళనాడులోని సెంగుంథర్‌పేట పట్టణంలో ఉంది. ఈ ఆలయం సెంగుంథర్ సంప్రదాయాలకు నిలయంగా ఉంది. ఈ ఆలయ విశిష్టత మురుగన్ పురాణ గాథలలో కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య షష్టి రోజున ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.
ఇది కూడా చదవండి: ఏ పెట్రోల్ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.. రోజూ వెళ్లేవారికీ తెలియని విషయాలు
Comments
Please login to add a commentAdd a comment