సాక్షి, హైదరాబాద్: ఇరవైరెండేళ్ల క్రితం తనపై జరిగిన హత్యాయత్నంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రజాగాయకుడు గద్దర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 1997లో తనపై జరిగిన హత్యాయత్నంపై అప్పటి పాలకులు సిట్ వేసి హంతకులను పట్టుకోకుండానే కేసు మూసేశారని పేర్కొన్నారు. దీనిపై 2016లో సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. స్పందించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయం అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విచారణ జరిపించాలని లేఖ రాసిందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment