హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ విచారణలో భాగంగా ఈరోజు(శుక్రవారం) హైదరాబాద్‌కు వచ్చిన అవినాష్‌రెడ్డి.. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సరైన దిశలో విచారణ జరగాలనే తాను చెబుతున్నానని, వాస్తవాన్ని టార్గెట్ చేయకుండా వ్యక్తిని టార్గెట్ చేసి విచారణ జరుగుతోందని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.
‘సీబీఐ ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పా. సీబీఐ కౌంటర్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు..అన్నింటికీ సమాధానాలు చెప్పా. విచారణపై ఎవరికైనా సందేహాలు వస్తాయి. వివేకా చనిపోయిన రోజున మార్చురీ దగ్గర ఏం మాట్లాడానో ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. అదే వాస్తవం. నేను వెళ్లే సమయానికి లెటర్‌ను దాచిపెట్టారు. ఆ లెటర్‌లో అనేక విషయాలు ఉన్నాయి.
విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు. విజయమ్మ దగ్గరకు వెళ్లి వస్తే బెదిరించడానికి వెళ్లానని ప్రచారం చేశారు. తెల్లవారజామున మూడు గంటలకు ఫోన్లు చేశానంటూ డిబేట్లు పెట్టారు. తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను నిజాలుగా వేయండి. మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
టీడీపీ చేసిన విమర్శలే సీబీఐ కౌంటర్‌లో వస్తున్నాయంటే.. గూగుల్ టేకౌటా లేక టీడీపీ టేకౌటా అనేది భవిష్యత్‌లో తేలుతుంది.విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని కోరాం. ఎక్కడ ఆడియో, వీడియో రికార్డు చేసినట్లు కనిపించలేదు. నేను సీబీఐకి లేఖ ఇచ్చాను. నేను సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన అంశాలపై పూర్తి విచారణ చేయాలని కోరాను. మరోసారి విచారణకు రావాలని సీబీఐ నాకు చెప్పలేదు’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment