ఆ రెండింటికి స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్న‌ రియా | Rhea Chakraborty Fails to Clearly Answer These 2 Questions | Sakshi
Sakshi News home page

ఆ రెండు ప్ర‌శ్న‌లకు రియా స‌మాధానం?

Published Sun, Aug 30 2020 12:06 PM | Last Updated on Sun, Aug 30 2020 12:35 PM

Rhea Chakraborty Fails to Clearly Answer These 2 Questions - Sakshi

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించింద‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ న‌టి రియా చ‌క్ర‌వ‌ర్తి శుక్ర‌, శ‌నివారాలు వ‌రుస‌గా రెండు సార్లు సీబీఐ ఎదుట హాజ‌రయ్యారు. ఆదివారం కూడా ఆమెను విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని అధికారులు ఆదేశించారు. ఈ క్ర‌మంలో సీబీఐ విచార‌ణ‌లో రియా రెండు ముఖ్య‌మైన‌ ప్ర‌శ్న‌ల‌కు దాట‌వేసే స‌మాధానాలిస్తున్న‌ట్లు స‌మాచారం. సుమారు 50 ప్ర‌శ్న‌లు అడిగితే అందులో రెండింటికి మాత్రం స‌రైన స‌మాధానాలు ఇవ్వలేద‌ని తెలిసింది. దీంతో ఆ రెండు ప్ర‌శ్న‌ల‌కు ఆమె ఇచ్చిన స‌మాధానాల‌తో సంతృప్తి చెంద‌ని సీబీఐ దీనిపై మ‌రింత‌ క్లారిటీ కోసం మ‌రోసారి వీటిని ప్ర‌శ్నించ‌నుంది.(చ‌ద‌వండి: ‘బ్రేకప్‌ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’)

ఇంత‌కీ ఆ రెండు ప్ర‌శ్న‌లేంటంటే.. "జూన్ 8న సుశాంత్‌తో బ్రేక‌ప్ చేసుకున్నాకే అత‌ని ఇంటి నుంచి వెళ్లిపోయారా? స‌మాధానం అవును అయితే ఏ కార‌ణంతో విడిపోయారు?" రెండోది.. "మీరు అత‌ని ఇంటి నుంచి వెళ్లిపోయాక కూడా సుశాంత్.. మీ సోద‌రుడికి ఫోన్ చేస్తూ మీ క్షేమ స‌మాచారాలు అడిగి తెలుసుకున్నారు. మ‌రి జూన్ 8 నుంచి 14 తేదీల మ‌ధ్య అతని కోసం మీరేమైనా ప‌ట్టించుకున్నారా? లేదా?" ఆదివారం నాటి విచార‌ణ‌లోనైనా రియా ద‌గ్గ‌ర నుంచి ఈ రెండింటికి స‌రైన స‌మాధానాలు రాబ‌ట్టాల‌ని సీబీఐ ఆలోచిస్తోంది. ఇదిలా వుండ‌గా ఈ కేసులో సీబీఐ ఇప్ప‌టికే సుశాంత్ ఫ్లాట్‌మేట్ సిద్ధార్థ్ పితానీ, సామ్యూల్ మిరండ‌, సుశాంత్ వంట‌మ‌నిషి నీర‌జ్‌, వాచ్‌మెన్, మేనేజ‌ర్‌, రియా తండ్రి ఇంద్ర‌జిత్ చ‌క్ర‌వ‌ర్తి, రియా సోద‌రుడు షోవిక్ చ‌క్ర‌వ‌ర్తిని ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. (చ‌ద‌వండి: సుశాంత్‌ గంజాయి తాగేవాడు, నేనేం చేయగలను: రియా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement