శిరోముండనం కేసును సీబీఐకి అప్పగించండి | Hand over the tonsure head case to CBI | Sakshi
Sakshi News home page

శిరోముండనం కేసును సీబీఐకి అప్పగించండి

Published Wed, Mar 3 2021 4:06 AM | Last Updated on Wed, Mar 3 2021 4:06 AM

Hand over the tonsure head case to CBI - Sakshi

సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం పోలీసులు తనకు శిరోముండనం చేసిన కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బాధితుడు ఐ.ప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌ విచారణ జరిపారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ, రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినా కూడా పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అందువల్ల ఈ కేసులో దర్యాప్తును సీబీఐ వంటి స్వతంత్ర సంస్థకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, సీబీఐని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement