కృష్ణాజిల్లా: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడటంపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వివేక హత్య జరిగిన కాలంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారనే విషయం తెలుసుకోవాన్నారు. వివేక కుమార్తై విజ్జప్తి మేరకు దీన్ని సీబీఐ విచారణ జరుపుతుందని అన్నారు. వివేక హత్యకేసు విషయంలో విజయమ్మ ఇప్పటికే బహిరంగ లేఖను రాసిన విషయాన్ని కొడాలి నాని గుర్తుచేశారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు.
అదే విధంగా, ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిలో కూడా టీడీపీ వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీన్ని ఎన్‌ఐఏ దర్యాప్తు చేయడం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఈ రెండు కేసులను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలే చూస్తున్నాయన్నారు. అయినా ప్రతిపక్షాలు కోడిగుడ్డుపై ఈకలు పీకే మాదిరి వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డి ఏనుగు లాంటివారని ప్రతిపక్షాలు కుక్కల మాదిరిగా మొరిగితే పట్టించుకోరని అన్నారు. కాగా, దోషులను పట్టుకోవడంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని నాని స్పష్టం చేశారు,.
Comments
Please login to add a commentAdd a comment