సాక్షి, గుంటూరు: వివేకా కేసులో తమ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, తన తల్లికి సీరియస్‌గా ఉంది గనుకే ఇవాళ విచారణకు హాజరు కాలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అయితే.. అవినాష్‌రెడ్డి గైర్హాజరు విషయంలో కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో కథనాలు ప్రసారం చేస్తుండడంపై అసహనం వ్యక్తం చేశారాయన.
శుక్రవారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు హాజరయ్యే ఉద్దేశంతోనే అవినాష్ హైదరాబాద్‌కు వచ్చారు. తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి సమాచారం ఇచ్చే ఉంటారు. అయినా ఏదో జరిగిపోతోందంటూ కొందరు హడావిడితో కూడిన ప్రచారం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో దుష్ఫ్రచారం చేస్తున్నాయి.. వార్తలు ఇస్తున్నాయి. గతంలో ఆయన సీబీఐ పిలిచిన ప్రతీసారి హాజరయ్యారు. ఆయన సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు.
అవినాష్‌రెడ్డి ఎక్కడికీ పోవడం లేదు.. తప్పించుకోవాల్సిన అవసరం అవినాష్‌రెడ్డికి లేదు అని సజ్జల స్పష్టం చేశారు. అవినాష్‌పై బుదర చల్లాలనే కొంత మంది అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, వైఎస్ సునీత, పచ్చమీడియా.. అంతా కలిసి అవినాష్‌పై అసత్య ప్రచారం చేయిస్తున్నారు అని సజ్జల ఆరోపించారు.
అసలు హంతకుడు రోడ్డు మీద తిరుగుతున్నాడు
సీబీఐ పిలిచినప్పుడల్లా అవినాష్ విచారణకు హాజరయ్యారు. తల్లికి అనారోగ్యం అని క్రియేట్ చేసుకుని.. విచారణకు ఎగ్గొట్టాల్సిన అవసరం లేదు. కానీ, నిందితుడు, గూగుల్ టేకౌట్ అని రకరకాల పేర్లతో సీబీఐ హడావిడి చేస్తోంది. అయిదు సార్లు విచారణకు హాజరైన అవినాష్ ఇప్పుడెందుకు వెళ్లడు?. ఒకవేళ తీవ్రపరిణామాలు ఎదురైనా.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
తల్లికి బాగలేదని సీబీఐకి చెప్పి మరీ వెళ్లాడు. సీబీఐ ఎదుటకు రేపు అయినా వెళ్లాల్సిందేగా?. అసలు హత్య చేశానన్నవాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. నేరుగా సెటిల్‌మెంట్ చేస్తున్నాడు. కానీ, ఒక ఎంపీని మాత్రం వెంటాడుతున్నారు అని సజ్జల ఆక్షేపించారు.
ఆ ఫ్యామిలీ అలాంటిది కాదు
అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని కూడా వివేకా కేసులో సీబీఐ పిలవగానే విచారణకు వెళ్లారు. అన్యాయం ఎందుకు చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తారు. ఒక ఎంపీపై బురద జల్లడం సబబు కాదు. వివేకా హత్యలో నిజంగా అవినాష్ పాత్ర ఉంటే.. అప్పట్లో చంద్రబాబు ఊరుకునేవారా?. వాస్తవాలు బయటకు రావాలనే సీబీఐ విచారణ చేస్తున్నా మేం అభ్యంతరం పెట్టలేదు. కానీ, వ్యక్తిత్వ హననం చేయడం కరెక్ట్ కాదు అని సజ్జల అన్నారు.
ఇదీ చదవండి: అవినాష్‌రెడ్డి తల్లికి సీరియస్
Comments
Please login to add a commentAdd a comment