అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏపీ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేతపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కాని పరిస్థితుల్లో డిపాజిటర్ల సంక్షేమం కోసం, వారి డిపాజిట్లు వారికి దక్కేలా చేసేందుకు ఏం చర్యలు తీసుకునే వారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అగ్రిగోల్డ్‌కు చెందిన ఆస్తుల జప్తు, వాటి వేలం, డిపాజిటర్లకు తిరిగి సొమ్ము చెల్లించే విషయంలో ప్రభుత్వానికున్న అధికారాలేమిటో తెలియజేయాలని సూచించింది.
వివరాలతో ఓ అఫిడవిట్‌ను వేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి రూ.కోట్లు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై పలుమార్లు విచారణ చేపట్టిన జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది.
ఈ వ్యాజ్యాలు దాఖలు కాకుంటే ఏం చేసేవారు..?
Published Tue, Oct 25 2016 1:22 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement