
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. భువనేశ్వరి కోరినట్లుగా తన ఆస్తులపై సీబీఐతో విచారణకు సిద్ధంగా ఉన్నానని, మరి మీరు కూడా సిద్ధమేనా భువనేశ్వరీ అంటూ సవాల్ విసిరారు. గురువారం ఆమె రాజమహేంద్రవరంలోని శ్రీ ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయాన్ని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌తో కలిసి సందర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 1991లో చిత్ర పరిశ్రమకు వచ్చిన నాటి నుంచి తన సంపాదన ప్రారంభమైందని, దానిపై సీబీఐతో విచారణకు తాను సిద్ధమేనని చెప్పారు. మరి అదే సమయంలో భువనేశ్వరి కూడా ఆమె ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఆర్థిక నేరగాడికి సంకెళ్లు వేస్తే మొత్తం రాష్ట్రానికే సంకెళ్లు వేసినట్టు భువనేశ్వరి వ్యాఖ్యానించడాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment