సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు మే 2వ తేదీ నుంచి జూన్ 3వరకు వేసవి సెలవులని రిజిస్ట్రార్ జనరల్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమయంలో అత్యవసర కేసులను విచారించేందుకు వెకేషన్ కోర్టులు పనిచేస్తాయన్నారు. లంచ్ మోషన్, అత్యవసర కేసులు, ముందస్తు బెయిల్, బెయిల్ అప్లికేషన్లు, బెయిల్ అప్పీళ్లు, హెబియస్ కార్పస్ తదితర అత్యవసర కేసులను వెకేషన్ కోర్టులు విచారిస్తాయి.
మే 2, 8, 16, 23, 30తేదీల్లో అత్యవసర కేసులను దాఖలు చేసుకోవాలి. వాటిని వరుసగా 5వ తేదీన న్యాయమూర్తులు జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ నాగార్జునల ధర్మాసనం, మే 12న జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం, 19న జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ ఎం.సుధీర్ కుమార్ ధర్మాసనం, 26న జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం, జూన్ 2న జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ ఎం.లక్ష్మణ్‌ల ధర్మాసనం విచారణ జరుపుతాయి. ఆ తేదీల్లో సింగిల్ జడ్జి ధర్మాసనాలు వరుసగా న్యాయమూర్తులు జస్టిస్ ఎ.సంతోష్‌రెడ్డి, జస్టిస్ జి.అనుపమా చక్రవర్తి, జస్టిస్ జువ్వాడ శ్రీదేవి, జస్టిస్ ఎస్.నంద, జస్టిస్ ఎన్.తుకారాంజీల ఏకసభ్య ధర్మాసనాలు అత్యవసర కేసుల్ని విచారిస్తాయని నోటిఫికేషన్‌లో హైకోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment