వేసవి భోజనం తింటున్నది 27 శాతం లోపే
విద్యాశాఖ అంచనా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థుల సంఖ్య 27 శాతంలోపే ఉందని విద్యాశాఖ అంచనాకు వచ్చింది. ఈనెల 21న ప్రారంభించిన వేసవి మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యాశాఖ పరిశీలన చేపట్టగా, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులే ఎక్కువ మంది ఈ భోజనం తింటున్నట్లు వెల్లడైంది. ఉన్నత పాఠశాలల విద్యార్థులు కొద్ది మంది మాత్రమే మధ్యాహ్న భోజనం తినేందుకు వస్తున్నట్లు గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21వ తేదీన 5,77,503 మంది (23.92 శాతం), 22వ తేదీన 6,15,314 మంది (25.49 శాతం), 23వ తేదీన 6,28,383 మంది (26.03 శాతం), 24వ తేదీన 5,64,186 మంది (23.37 శాతం) మధ్యాహ్న భోజనం తిన్నట్లు లెక్కలు తేల్చింది.
పక డ్బందీగా టెట్ జంబ్లింగ్
వచ్చే నెల 1వ తేదీన నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడేందుకు కొందరు పన్నిన కుట్రను గుర్తించిన విద్యాశాఖ, పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపటి ్టంది. ఇదే అంశంపై సోమవారం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులతో చర్చించింది. ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా సంబంధిత పరీక్ష కేంద్రంలోనే ఫీజులు చెల్లించి, వరుసగా హాల్‌టికెట్లు పొందిన వారిని ఆయా పరీక్ష కేంద్రంల్లోనే వేర్వేరు గదుల్లో, వరుస క్రమంలో కాకుండా, సీటింగ్ వేర్వేరుగా ఉండేలా చర్యలు చేపట్టింది.