జూన్‌ 30వరకు సుప్రీంకోర్టుకు సెలవులు | Vacation Bench of SC to hear urgent matters from today | Sakshi
Sakshi News home page

జూన్‌ 30వరకు సుప్రీంకోర్టుకు సెలవులు

Published Mon, May 13 2019 10:37 AM | Last Updated on Mon, May 13 2019 10:37 AM

Vacation Bench of SC to hear urgent matters from today - Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు నేటి నుంచి వేసవి సెలవులు కావడంతో అత్యవసర వ్యాజ్యాల విచారణను ప్రత్యేక ధర్మాసనాలు చేపట్టనున్నాయి. నేటి(సోమవారం) నుంచి జూన్‌ 30వరకు సెలవులు ఉండటంతో.. సెలవు దినాల్లో అత్యవసర వ్యాజ్యాల విచారణకు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేశారు. మే 13 నుంచి 20వరకు జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం పిటిషన్లను విచారించనుంది. మే 21 నుంచి 24 వరకు జస్టిస్‌ అరుణ్‌మిశ్రా, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం, మే 25 నుంచి మే 30వరకు సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం, మే 31 నుంచి జూన్‌ 2వరకు జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం, జూన్‌ 3నుంచి జూన్‌ 5వరకు జస్టిస్‌ ఇందు మల్హోత్రా, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం, జూన్‌ 6 నుంచి జూన్‌ 13 వరకు జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ అజయ్‌ రస్తోగి ధర్మాసనం విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే జూన్‌ 14 నుంచి జూన్‌ 30 వరకు ధర్మాసనాల వివరాలను తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు వర్గాలు తెలియజేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement