aradhya
-
సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న వర్మ హీరోయిన్
సంచలన డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏం చేసినా సరే అందులో ఓ ప్రత్యేకత ఉంటుంది.వర్మ ట్వీట్ చేసినా.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా సరే కచ్చితంగా సెన్షెషనల్ అవ్వాల్సిందే. అలా కొద్ది రోజుల క్రితం చీరకట్టులో ఉన్న ఓ అమ్మాయి వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తానెవరో తెలిస్తే చెప్పండి అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ ఆ అమ్మాయి ఎవరా? నెటిజన్స్ తెగ వెతకడం ప్రారంభించారు. ఫైనల్‌గా ఆ అమ్మాయిది కేరళ అని ఆ యువతి పేరు శ్రీలక్ష్మి సతీశ్ అని వర్మ తెలిపారు. ఆమెతో 'శారీ' అనే సినిమాను తీస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. సినిమా కోసం ఆమె పేరును ఆరాధ్య దేవిగా మార్చడం జరిగింది. ఎవరిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయే రామ్‌గోపాల్ వర్మ టాలెంట్‌ని వెతికి పట్టుకోవటంలో దిట్ట అనే సంగతి అందరికి తెలిసిందే. అందుకు ఉదాహరణ ఆయన ఎంతోమంది టాలెంట్ ఉన్న నటీనటులను ఇండస్ట్రీకి అందించారు. ప్రస్తుతం ఆరాధ్య దేవితో తీస్తున్న ‘శారీ’ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మొన్నటి దాకా చీరలో పద్దతిగా కనిపించిన ఆరాధ్య ఇప్పుడు తన గ్లామర్‌తో కేకపుట్టించింది. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు చీరలో యూత్‌ను మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు తన గ్లామర్‌తో అదిరిపోయే ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోలను వర్మ కూడా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు.ఆరాధ్య ఫోటోలు చూసిన వారందరూ కూడా నోరెళ్లబెడుతున్నారు. అంతలా అవి వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వర్త్ వర్మ.. వర్త్ అంటూ షాక్ అవుతున్నారు. పద్ధతిగా చీరకట్టులో ఉన్న అమ్మాయిని ఎలా మార్చేశావ్ వర్మ అంటూ సరదాగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by AaradhyaDevi (@iamaaradhyadevi) Hey @yeshclicks I am shocked with the transformation u made of the SAAREE girl Aaradhya Devi through ur photography .. See the pics of https://t.co/tANxbmOjAD to believe in this link https://t.co/qILXQadtVW pic.twitter.com/fuXBE5U7lA — Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2024 -
చిన్నారిని కుదిపేసిన కాలం!
సాక్షి, ఆదిలాబాద్: మండల కేంద్రానికి చెందిన నరంశెట్టి ప్రకాష్, పల్లవి దంపతుల కూతరు ఆరాధ్య(ఎనిమిది నెలలు) ఫిట్స్‌తో మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... చిన్నారి ఆరాధ్య మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం రాత్రి ఫిట్స్ రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించారు. కొంచెం నయం కావడంతో ఇంటికి తీసుకొచ్చారు. నిర్మల్‌లోని చిన్నపిల్లల వైద్యులకు చూపించేందుకు బుధవారం తీసుకువెళ్లారు. నిర్మల్ చేరుకోగానే మళ్లీ ఫిట్స్ వచ్చింది. వైద్యులకు చూపించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. -
ఆనందంలో ఐశ్వర్యను హగ్ చేసుకున్న అభిషేక్, ఆకట్టుకుంటున్న వీడియో
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సంతోషం పట్టలేక తన భార్య, నటి ఐశ్వర్యరాయ్‌ని హగ్ చేసుకున్ను వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా రీసెంట్గా జరిగిన ప్రో కబడ్డి ఫినాలే మ్యాచ్ చూసేందుకు భార్య ఐశ్వర్య, కూతురు ఆరాధ్యతో కలిసి పాల్గొన్నాడు అభిషేక్. ఈ 9వ సీజన్లో అభిషేక్ టీం జైపూర్ పింక్ పాంథర్ గెలిచి టైటిల్ గెలుచుకుంది. తన టీం గెలవడంతో అభిషేక్ ఆనందంలో మునిగిపోయాడు. పట్టలేని సంతోషంలో ఉన్న అభిషేక్ పక్కనే ఉన్న భార్య ఐశ్వర్యను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. చదవండి: రామ్ చరణ్‌పై ‘కింగ్ ఖాన్’ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా అభిషేక్, ఐశ్వర్యలు విడాకులు తీసుకోబోతున్నారని, వారి వైవాహిక జీవితంలో కలతలు వచ్చాయంటూ కొద్ది రోజులుగా తరచూ వీరి విడాకుల రూమర్స్ బి-టౌన్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సంతోషాన్ని అభిషేక్ భార్యతో షేర్ చేసుకోవడం.. ఐశ్వర్య కూడా భర్తను చీర్ చేసిన ఈ వీడియో వారి ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. అంతేకాదు విడాకుల గురించి వస్తున్న పుకార్లకు ఈ వీడియోతో చెక్ పడిందంటూ ఈ జంట ఫ్యాన్స్, ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఐశ్వర్య రాయ్, అభిషేక్‌లు 2007లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
‘ఫన్’టాస్టిక్ సితార .. ‘తగ్గేదే లే’అంటున్న అర్హ.. ‘స్టార్’లా ఎదిగిన కిడ్స్ వీరే
ఇవ్వాళ్టి పిల్లలు పెద్దల నీడన దాగుండిపోవడం లేదు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల పిల్లలు.. తల్లిదండ్రుల పాపులారిటీతో పరిచయం అవడానికి ఇష్టపడట్లేదు. ఆ పేరుప్రఖ్యాతులను ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుని సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటున్నారు. తమ టాలెంట్‌ను చాటుకుంటున్నారు. ఆ లిస్ట్‌లో ఉన్న కొంతమంది లిటిల్ స్టార్స్ గురించి.. ‘ఫన్’టాస్టిక్ సితార చిన్న వయసు నుంచే తనలోని బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకుంటోంది మహేశ్ బాబు–నమ్రతా శిరోడ్కర్ వారసురాలు సితార! ‘ఫన్’టాస్టిక్ తార అనే వెబ్ సిరీస్‌కు సితార బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తోంది. ‘జన్యాస్ క్లోజట్’ బ్రాండ్ కోసం మోడలింగ్ కూడా చేసింది. దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలసి ఓ యూట్యూబ్ చానెల్‌నూ నిర్వహిస్తోంది. తగ్గేదే లే... ఈ మాట అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హకి సరిగ్గా సరిపోతుంది. సూపర్ యాక్టివ్నెస్తో తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ని క్రియేట్ చేసుకుంది. ముద్దు ముద్దు మాటలు.. ముద్దొచ్చే రూపంతో తన తండ్రి సినిమాల్లోని కొన్ని సీన్స్‌కి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, డైలాగ్స్ చెప్తూ, పాటలు..డ్యాన్స్‌లతో డిజిటల్ మీడియా వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోంది అర్హ. ఇలా చిన్న వయసులోనే స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకున్న అర్హ మంచి చెస్ ప్లేయర్ కూడా! ‘మంచు’ సింగర్స్... మంచు విష్ణు కూతుళ్లు అరియానా–వివియానా.. ఇన్‌స్టా స్టార్స్. ఈ ట్విన్ సిస్టర్స్ ఫొటోలు, వీడియోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందం, అభినయమే కాదు.. మధురమైన గాత్రం కూడా వీరి సొంతం. వాళ్ల నాన్న విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా కోసం ‘ఇదే స్నేహం.. యే హై దోస్తీ’ అనే గీతాన్ని ఆలపించారీ అక్కాచెల్లెళ్లు. ఈ పాట విడుదలైన ఒక్క రోజులోనే 40 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించి ట్రెండింగ్‌లో ఉంది. ఇంకోవైపు మంచు లక్ష్మి కూతురు విద్య నిర్వాణ కూడా మై కిసీ సే కమ్ నహీ అంటోంది. పేరుకు తగ్గట్టే చదువులో దిట్ట ఈ బిడ్డ. కరోనా సమయంలో తల్లితో కలసి యూట్యూబ్ వీడియోలు చేసి తన టాలెంట్‌ను ప్రదర్శించింది. అన్నట్టు విద్య కూడా మంచి చెస్ ప్లేయర్. ఇంటి చిరు కొమ్మ.. అమ్మ, నాన్న, తాతకు తగ్గకుండా తన పేరునూ పాపులర్ చేసుకుంటోంది ఐశ్యర్య, అభిషేక్ కూతురు ఆరాధ్య బచ్చన్. శ్రావ్యమైన స్వరంతో క్రిస్మస్ జింగిల్స్.. ఇతర పాటలు పాడుతూ తన ఐడెంటిటీ చాటుకుంటోంది. ‘పవర్’ ఫుల్ డాటర్ పవన్ కల్యాణ్–రేణూ దేశాయ్ కూతురు ఆద్యకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ అమ్మాయి మొన్నామధ్య గిటార్ వాయిస్తూ పాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే! ఆమె గాన మాధుర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. తండ్రిలాగే ఆద్యకు పుస్తకాలు చదవడమన్నా ఎంతో ఇష్టం. -
వాళ్లిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు : అభిషేక్
సాక్షి,ముంబై: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఎట్టకేలకు ఒక శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కరోనా వైరస్ సోకిన తన భార్య, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య ఇంటికి చేరారని ప్రకటించారు. తాజాగా వారిద్దరికీ నిర్వహించిన కోవిడ్-19 నిర్దారిత పరీక్షల్లొ నెగిటివ్ అని తేలడంతో వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారంటూ ట్వీట్ చేశారు. అయితే తన తండ్రి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తాను మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అందరికీ అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు. (ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యరాయ్, ఆరాధ్య) కాగా అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె ఆరాధ్యకు ఇటీవల కరోనా సోకడంతో హాస్పిటల్లో చేరారు. కరోనా పాజిటివ్ వచ్చి హోంక్వారంటైన్లో ఉన్నప్పటికీ, అనారోగ్య కారణాల రీత్యా హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. దీనికిముందే సీనియర్ బచ్చన్, అభిషేక్‌కు కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం నానావతి హాస్పిటల్లో చేరారు. అయితే అమితాబ్ భార్య, నటి జయాబచ్చన్, మిగతా కుటుంబ సభ్యులకు నెగటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. (అది నకిలీ వార్త) Thank you all for your continued prayers and good wishes. Indebted forever. 🙏🏽 Aishwarya and Aaradhya have thankfully tested negative and have been discharged from the hospital. They will now be at home. My father and I remain in hospital under the care of the medical staff. — Abhishek Bachchan (@juniorbachchan) July 27, 2020 -
పోజు ప్లీజ్!
బాలీవుడ్లో వన్నాఫ్ ది బెస్ట్ కపుల్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ మాల్దీవుల్లో మస్త్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ వెకేషన్‌తో పాటు పెళ్లి రోజు సంబరాల్ని కూడా అక్కడే జరుపుకున్నారీ దంపతులు. అప్పుడు ఆరాధ్య పోజు ప్లీజ్ అంటే, కూతురి కెమెరాకి ఇద్దరూ పోజు ఇచ్చినట్లున్నారు. ‘‘ఈ ఫొటోను మా జీవితాల వెలుగు దివ్వె అయిన ఆరాధ్య తీసింది’’ అంటూ పైన ఉన్న ఫొటోను షేర్ చేశారు ఐశ్వర్యారాయ్. ఇది అభిషేక్ అండ్ ఐశ్వర్యాల 12వ వివాహ వార్షికోత్సవం కావడం విశేషం. న్యూయార్క్‌లో జరిగిన ‘గురు’ ప్రీమియర్ షో సమయంలో ఐశ్వర్యకు ప్రపోజ్ చేశారు అభిషేక్. ఆ తర్వాత 2007 ఏప్రిల్ 20న వీరిద్దరి వివాహం జరిగింది. 2011 నవంబరులో ఆరాధ్యకు జన్మనిచ్చారు ఐశ్వర్య. ‘గురు’ సినిమాకు ముందు ‘టాయి అక్షర్ ప్రేమ్ కే’ (2000), ‘కుచ్ నా కహో’ (2003) చిత్రాల్లో కలిసి నటించారు ఐశ్వర్య అండ్ అభిషేక్. ఇప్పుడు ‘గులాబ్ జామ్’ అనే చిత్రంలో జంటగా నటించనున్నారు. -
ముద్దుల తనయకు తియ్యని ముద్దు
కాన్స్ చలన చిత్రోత్సవాలకు వెళ్లేటప్పుడు ముద్దుల తనయ ఆరాధ్యను తీసుకెళతారు ఐశ్వర్యా రాయ్. తల్లితో పాటు కూతురు కూడా అక్కడి ఉత్సవాలకు సెంటరాఫ్ ఎట్రాక్షన్. తల్లీకూతుళ్లను కెమెరాలో బంధించడానికి అక్కడి ఫొటో జర్నలిస్ట్‌లు చాలా ఉత్సాహం చూపిస్తారు. వాళ్ల కెమెరాకు కావల్సిన ‘క్లిక్’ దొరికింది. ముద్దుల కూతురుకు ఐష్ తియ్యని ముద్దు ఇస్తున్న వేళ పలు కెమెరాలు క్లిక్‌మన్నాయి. -
నేను ప్రభాస్ అభిమానిని
‘‘గ్లామర్, పర్ఫార్మెన్స్.. రెంటికీ ప్రాధాన్యం ఇస్తా. మంచి పాత్రలు, మంచి కథలే ముఖ్యం. నాకు గుర్తింపు తెచ్చే ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధమే’’ అన్నారు ఆరాధ్య. ఈ ఆరాధ్య ఎవరో కాదు.. హీరోయిన్ అంజలి సోదరి. ‘జర్నీ’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గీతాంజలి’ వంటి చిత్రాల ద్వారా అంజలి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అక్కలా తానూ మంచి హీరోయిన్ అనిపించుకోవాలనుకుంటున్నారు ఆరాధ్య. ‘‘చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అందుకే డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. అక్క అంజలి సినిమాల్లో రాణించింది. అదృష్టం అనేదాని కంటే అక్క పడిన కష్టమే తన సక్సెస్‌కు కారణం’’ అన్నారామె. ఇంకా ఆరాధ్య మాట్లాడుతూ – ‘‘మా అమ్మగారు మాకు అండగా ఉంటారు. అక్కను స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను. సినిమాకు అవసరమయ్యే వాటిపై శిక్షణ తీసుకున్నాను. నేను ప్రభాస్ అభిమానిని. నా ఆల్‌టైమ్ ఫేవరెట్ నటి జయసుధగారే. ప్రజెంట్ సముద్ర దర్శకత్వంలో తమిళంలో ఓ సినిమా చేస్తున్నా. ఓ తెలుగు సినిమా చేస్తున్నా’’ అన్నారు. -
ఆరాధ్య.. ఉదయ్ కిరణ్.. లక్ష్మీప్రియ.. మోక్షజ్ఞ..
హైదరాబాద్: అభంశుభం తెలియని చిన్నారులను అయినవారే హతమారుస్తున్న ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఆస్తులు, అక్రమ సంబంధాలు, తగవులతో పసివాళ్ల ప్రాణాలు తీస్తున్నారు. పెద్దోళ్ల ఆవేశకావేశాలకు చిన్నారులు సమిధలు మారుతున్నారు. తెలుగు గడ్డపై ఇటీవల చోటు చేసుకున్న మూడు ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా రెండేళ్ల వయసున్న మోక్షజ్ఞను సొంత చిన్నాన్నే కడతేర్చిన దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. తెనాలికి చెందిన మోక్షజ్క్ష అనే బాలుడ్ని సొంత చిన్నాన్నే కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ఆస్తి కోసమే అతడీ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. మోక్షజ్ఞ తండ్రి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. భార్యతో ఏకాంతానికి అడ్డుగా మారిందన్న అక్కసుతో ఆరాధ్య అనే 19 నెలల చిన్నారిని సొంత బాబాయ్ పొట్టన పెట్టుకున్న అమానవీయ ఘటన ఒంగోలులో నవంబర్ లో చోటుచేసుకుంది. పసిపాపపై పెట్రోల్ పోసి నిప్పటించి పాశవికంగా చంపేశాడు. డబ్బుకోసం ఏడో తరగతి విద్యార్థి ఉదయ్ కిరణ్‌ను స్వయానా పెదనాన్న కొడుకే కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన వనస్థలిపురంలో జరిగింది. కిడ్నాప్ వ్యవహారం బయటపడుతుందన్న భయంతో ఉదయ్ కిరణ్ గొంతు నులిమి హత్య చేశారు. స్నేహితులతో కలిసి నిందితుడు ఈ కిరాతానికి ఒడిగట్టాడు. చిత్తూరు జల్లా తిరుచానూరులో లక్ష్మీప్రియ అనే ఐదేళ్ల చిన్నారిని వరుసకు మేనమామ అయ్యే వ్యక్తే మూడు రోజుల క్రితం హత్య చేశాడు. అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులను అయినవారే అంతమొందించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.