
‘‘గ్లామర్, పర్ఫార్మెన్స్.. రెంటికీ ప్రాధాన్యం ఇస్తా. మంచి పాత్రలు, మంచి కథలే ముఖ్యం. నాకు గుర్తింపు తెచ్చే ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధమే’’ అన్నారు ఆరాధ్య. ఈ ఆరాధ్య ఎవరో కాదు.. హీరోయిన్ అంజలి సోదరి. ‘జర్నీ’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గీతాంజలి’ వంటి చిత్రాల ద్వారా అంజలి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అక్కలా తానూ మంచి హీరోయిన్ అనిపించుకోవాలనుకుంటున్నారు ఆరాధ్య. ‘‘చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం.
అందుకే డ్యాన్స్ కూడా నేర్చుకున్నాను. అక్క అంజలి సినిమాల్లో రాణించింది. అదృష్టం అనేదాని కంటే అక్క పడిన కష్టమే తన సక్సెస్‌కు కారణం’’ అన్నారామె. ఇంకా ఆరాధ్య మాట్లాడుతూ – ‘‘మా అమ్మగారు మాకు అండగా ఉంటారు. అక్కను స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను. సినిమాకు అవసరమయ్యే వాటిపై శిక్షణ తీసుకున్నాను. నేను ప్రభాస్ అభిమానిని. నా ఆల్‌టైమ్ ఫేవరెట్ నటి జయసుధగారే. ప్రజెంట్ సముద్ర దర్శకత్వంలో తమిళంలో ఓ సినిమా చేస్తున్నా. ఓ తెలుగు సినిమా చేస్తున్నా’’ అన్నారు.