
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ సంతోషం పట్టలేక తన భార్య, నటి ఐశ్వర్యరాయ్‌ని హగ్ చేసుకున్ను వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. కాగా రీసెంట్‌గా జరిగిన ప్రో కబడ్డి ఫినాలే మ్యాచ్ చూసేందుకు భార్య ఐశ్వర్య, కూతురు ఆరాధ్యతో కలిసి పాల్గొన్నాడు అభిషేక్. ఈ 9వ సీజన్‌లో అభిషేక్ టీం జైపూర్ పింక్ పాంథర్ గెలిచి టైటిల్ గెలుచుకుంది. తన టీం గెలవడంతో అభిషేక్ ఆనందంలో మునిగిపోయాడు. పట్టలేని సంతోషంలో ఉన్న అభిషేక్ పక్కనే ఉన్న భార్య ఐశ్వర్యను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
చదవండి: రామ్ చరణ్‌పై ‘కింగ్ ఖాన్’ ఆసక్తికర వ్యాఖ్యలు
కాగా అభిషేక్, ఐశ్వర్యలు విడాకులు తీసుకోబోతున్నారని, వారి వైవాహిక జీవితంలో కలతలు వచ్చాయంటూ కొద్ది రోజులుగా తరచూ వీరి విడాకుల రూమర్స్ బి-టౌన్‌లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సంతోషాన్ని అభిషేక్ భార్యతో షేర్ చేసుకోవడం.. ఐశ్వర్య కూడా భర్తను చీర్ చేసిన ఈ వీడియో వారి ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటుంది. అంతేకాదు విడాకుల గురించి వస్తున్న పుకార్లకు ఈ వీడియోతో చెక్ పడిందంటూ ఈ జంట ఫ్యాన్స్, ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఐశ్వర్య రాయ్, అభిషేక్‌లు 2007లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2011లో కూతురు ఆరాధ్య జన్మించింది.
Comments
Please login to add a commentAdd a comment