
సుధీర్‌బాబు
పాత్రల ఎంపికలో ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు సుధీర్‌బాబు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. ఆర్. ఇంద్రసేన్ దర్శకత్వంలో శ్రియా శరణ్, నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ మూవీ ఇది. ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ అనేది ట్యాగ్‌లైన్. అప్పారావు బెల్లన నిర్మించారు.
ఇటీవల శ్రియ, నారా రోహిత్, శ్రీవిష్ణు ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం ఇప్పుడు సుధీర్ బాబు లుక్‌ను విడుదల చేశారు. ‘‘రిలీజ్ చేసిన అందరి లుక్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందరి పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాశ్, నవీన్ నేని తదితరులు నటించిన ఈ సినిమాకు మార్క్ కే. రాబిన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment