
ఎదురు చూపులు ఎవరి కోసం?
ఆ కళ్లు ఏదో కథ చెబుతున్నట్లు ఉన్నాయి కదూ! అఖండ భారతాన్ని జయించి.. ఏకఛత్రాధిపత్యంగా పాలించాలనే విజయకాంక్షతో యుద్ధభూమిలో
మనిషిక్కడ...
మనసెక్కడో...
కళ్లల్లో తడి...
మనసులో వేదన...
ఆ కళ్లు ఏదో కథ చెబుతున్నట్లు ఉన్నాయి కదూ! అఖండ భారతాన్ని జయించి.. ఏకఛత్రాధిపత్యంగా పాలించాలనే విజయకాంక్షతో యుద్ధభూమిలో అడుగుపెట్టిన భర్త శాతకర్ణి రాకకై ఎదురు చూస్తున్నట్టు లేదూ! నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఇందులో శాతకర్ణి భార్య వశిష్ఠిదేవిగా శ్రీయ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం శ్రీయ పుట్టినరోజు సందర్భంగా వశిష్ఠిదేవి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, హేమమాలిని, శ్రీయ తదితరులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్నారు.