ది బాస్‌ | shriya tamil remake on sandakkaari | Sakshi
Sakshi News home page

ది బాస్‌

Jul 16 2019 5:44 AM | Updated on Sep 18 2019 2:52 PM

shriya tamil remake on sandakkaari - Sakshi

నటిగా తనను తాను ప్రూవ్‌ చేసుకున్నారు శ్రియ. కథానాయికగా వైవిధ్యమైన పాత్రలతో పాటుగా కమర్షియల్‌ గెటప్‌లు వేశారు. ఆండ్రీ కొచ్చివ్‌తో గత ఏడాది శ్రియ వివాహం జరిగింది. చిన్న బ్రేక్‌ తర్వాత ఓ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేయడానికి శ్రియ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఆర్‌. మాదేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సండక్కారి: ది బాస్‌’ సినిమాలో శ్రియ నటిస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌. 2012లో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో వచ్చిన మలయాళ మూవీ ‘మై బాస్‌’ చిత్రానికి ఇది తమిళ రీమేక్‌ . యాక్షన్‌ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. లండన్, న్యూయార్క్‌తో పాటుగా కొచ్చి, గోవాలో షూట్‌ ప్లాన్‌ చేశారట. శ్రియ నటించిన తమిళ చిత్రం ‘నరగాసురన్‌’, హిందీ చిత్రం ‘తడ్కా’ విడుదల కావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement