అత్తాకోడళ్ల లుక్ అదిరింది..
తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రారాజు గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' షూటింగ్ ఊపందుకుంది. దర్శకుడు క్రిష్ వివాహం సందర్భంగా నెల రోజులపాటు షూటింగ్కు బ్రేక్ తీసుకున్న చిత్ర యూనిట్.. తిరిగి చిత్రీకరణను మొదలుపెట్టింది.
మధ్యప్రదేశ్లో ఉన్న కోటల్లో శాతకర్ణి షూటింగ్ జరుగుతోంది. ఇందులో బాలకృష్ణ తల్లిగా ప్రముఖ నటి హేమామాలిని, భార్యగా శ్రీయ నటిస్తున్నారు. వారిద్దరూ ప్రస్తుతం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. కాగా హేమామాలిని, శ్రీయలకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో అత్తాకోడళ్ల లుక్ అదిరిందంటూ అభిమానులు కితాబునిస్తున్నారు.
ఇంతకుముందు జార్జియాలో శాతవాహన పైనికులకు, గ్రీకు సైనికులకు మధ్య జరిగే సన్నివేశాలను, క్లైమాక్స్ను భారీగా చిత్రీకరించారు. అంతకుముందు మొరాకోలో మొదటి షెడ్యూల్ను పూర్తిచేశారు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్న కోటల్లో రాజకుటుంబానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.