gowthami putra satakarni
-
హీరో బాలకృష్ణకు నోటీసులు
హైదరాబాద్: సినీ హీరో బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమా నిర్మాతలకు కూడా నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గౌతమీ పుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు వినోద పన్ను మినహాయింపుపై దాఖలైన పిల్‌ను న్యాయస్థానం మంగళవారం విచారించింది. గతంలో ఈ విషయంలో తమిళనాడు తీర్పును పిటిషనర్ ఉదహరించారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ గౌతమీ పుత్ర శాతకర్ణి
-
‘శాతకర్ణి ల్యాండ్ మార్క్ మూవీ’
నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అద్భుతంగా ఉందని అభిమానులు అంటున్నారు. ప్రీమియర్ షోలు చూసినవారంతా సినిమా చాలా బాగుందని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ప్రేక్షకుల నుంచి పాజిటవ్ టాక్ వస్తోందని చెబుతున్నారు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బ్లస్టర్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ దీమాగా ఉన్నారు. సీన్స్, డైలాగులు, బాలయ్య నటన సినిమాకు హైలెట్ అని విశ్లేషిస్తున్నారు. దర్శకుడు క్రిష్ పడిన శ్రమ తెరపై కనబడుతోందని, అద్భుతంగా తీశాడని మెచ్చుకున్నారు. మరోవైపు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఈరోజు విడుదల కావడంతో ధియేటర్ల దగ్గర అభిమానుల సందడి నెలకొంది. అమెరికాలోని డల్లాస్ లో నందమూరి ఫ్యాన్స్ కార్ల ర్యాలీ చేశారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా విజయవంతం కావాలని పలువురు తారలు ఆకాంక్షించారు. బాలయ్య కెరీర్ లో ఈ చిత్రం ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. బాబాయ్ సినిమా హిట్ కావాలని జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పాడు. బాలయ్య సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు మంచు విష్ణు, మంచు మనోజ్, నాని కూడా ట్వీట్లు పెట్టారు. పెద్ద సినిమాలో తాను నటించినందుకు గర్వపడుతున్నానని సీనియర్ నటి హేమమాలిని ట్వీట్ చేశారు. ఈ చిత్రం విజయవంతం కావాలని ఆమె కోరుకున్నారు. A landmark film for the Legend. Wishing Balayya Babai and the whole team of #GPSK the very best. #NBK100 will make us proud — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) 11 January 2017 Wishing Babai and the whole team of #GPSK and @DirKrish all the best.#NBK100 — tarakaram n (@tarak9999) 11 January 2017 All the best 2 my dearest sweetest daring dashing NataSimha Balayya anna for #GPSK -
చిరు-బాలయ్య సినిమాలకు హై అలర్ట్
-
‘అగ్ర’ సినిమాలకు హై అలర్ట్
సినిమాల రిలీజ్‌లపై డీజీపీ స్థాయిలో పోలీస్‌శాఖ అప్రమత్తం అభిమానులపై డేగకన్ను నేడు చిరు ‘ఖైదీ నంబర్ 150’ రిలీజ్ రేపు బాలయ్య ‘శాతకర్ణి’ విడుదల భారీ అంచనాలు, జోరుగా బెట్టింగ్‌లు సాక్షి, అమరావతి: ఈ సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలు ఒకేసారి విడుదల కానుండటంతో రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొంది. ఖైదీ నంబర్ 150 సినిమా బుధవారం విడుదల కాగా, గౌతమీపుత్ర శాతకర్ణి గురువారం రిలీజ్ కాబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో కోడి పందేలపై నెలకొన్న ఉత్కంఠత కంటే ఇద్దరు అగ్రహీరోల సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తొమ్మిదేళ్ల తరువాత చిరంజీవి నటించిన సినిమాపై ఆయన అభిమానులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా బాలకృష్ణ వందో చిత్రం శాతకర్ణి ప్రతిష్టాత్మకం కావడంతో ఆయన అభిమానుల్లోనూ అదే స్థాయిలో ఆసక్తి కన్పిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం టీజర్‌ను జనవరి 14న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుండటం గమనార్హం. పోలీసుల హై అలర్ట్... చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ కేవలం సినిమా హీరోలే కాకుండా రాజకీయాలతో ముడిపడిన వారు కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమైనట్టు సమాచారం. ఈ సినిమాల రిలీజ్ సమయంలో ఏ చిన్న ఘటన జరిగినా రాజకీయాలపై ప్రభావం పడే ప్రమాదం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సినిమాల రిలీజ్ నేపథ్యంలో తొలిసారిగా డీజీపీ స్థాయి అధికారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎస్పీలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించిన డీజీపీ నండూరి సాంబశివరావు థియేటర్ల వద్ద పోలీస్ బందోబస్తుతోపాటు అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. హద్దుమీరొద్దంటూ అభిమానులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. భారీగా బెట్టింగ్‌లు.. సంక్రాంతికి కోడి పందేల కంటే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలపైనే ప్రధానంగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్టు సమాచారం. ఖైదీ నంబర్ 150 సినిమా వంద కోట్లు వసూళ్లు చేస్తుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. బాలకృష్ణ సినిమా కూడా వంద కోట్లు వసూలుపై దృష్టి పెట్టారని చెబుతున్నారు. దీంతో తొలి షో బ్లాక్ టిక్కెట్ రేటు ఎంతకు అమ్ముడుపోతుంది. ఎన్ని థియేటర్లలో ఎన్ని షోలు ప్రదర్శిస్తారు. వారం రోజుల్లో ఏ సినిమాకు ఎంత కలెక్షన్ వస్తుంది. ఇలా అనేక కోణాల్లో బెట్టింగ్‌లు ఊపందుకోవడం గమనార్హం. -
'గౌతమిపుత్ర శాతకర్ణి' ఆడియో ఫంక్షన్
-
బాలయ్యతో పోటీకి మెగాస్టార్ రెడీ!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న `ఖైదీ నంబర్ 150` సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజవుతోంది. ఈ చిత్రంలో అందాల కాజల్ కథానాయికగా నటిస్తోంది. వి.వి.వినాయక్ ఈ కమర్షియల్ ఎంటర్టైనర్కి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజైన మెగాస్టార్ స్టిల్స్‌కి, మోషన్ పోస్టర్‌కి చక్కని స్పందన వచ్చినందుకు చిత్రయూనిట్ ఎంతో హ్యాపీగా ఉంది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. 2017 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. నిర్మాత రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ``70 శాతం పైగా చిత్రీకరణ పూర్తయింది. నాన్నగారు డబ్బింగ్ కూడా ప్రారంభించారు. ఇప్పటివరకూ చక్కని ఔట్పుట్ వచ్చిందన్న సంతృప్తి ఉంది. అన్ని పనులు పూర్తి చేసి, జనవరిలో సంక్రాంతి కానుకగా `ఖైదీ నంబర్ 150` చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు. రత్నవేలు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో నటిస్తున్నారు. కాగా, నందమూరి నట సింహం బాలయ్య ఇప్పటికే సంక్రాంతి రేసులో నిలిచాడు. నందమూరి బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 12న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది. చాలా కాలం తర్వాత ఇద్దరు సీనియర్ అగ్ర కథానాయకుల సినిమాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతుండడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. -
అత్తాకోడళ్ల లుక్ అదిరింది..
తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రారాజు గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' షూటింగ్ ఊపందుకుంది. దర్శకుడు క్రిష్ వివాహం సందర్భంగా నెల రోజులపాటు షూటింగ్‌కు బ్రేక్ తీసుకున్న చిత్ర యూనిట్.. తిరిగి చిత్రీకరణను మొదలుపెట్టింది. మధ్యప్రదేశ్‌లో ఉన్న కోటల్లో శాతకర్ణి షూటింగ్ జరుగుతోంది. ఇందులో బాలకృష్ణ తల్లిగా ప్రముఖ నటి హేమామాలిని, భార్యగా శ్రీయ నటిస్తున్నారు. వారిద్దరూ ప్రస్తుతం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. కాగా హేమామాలిని, శ్రీయలకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో అత్తాకోడళ్ల లుక్ అదిరిందంటూ అభిమానులు కితాబునిస్తున్నారు. ఇంతకుముందు జార్జియాలో శాతవాహన పైనికులకు, గ్రీకు సైనికులకు మధ్య జరిగే సన్నివేశాలను, క్లైమాక్స్‌ను భారీగా చిత్రీకరించారు. అంతకుముందు మొరాకోలో మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేశారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ఉన్న కోటల్లో రాజకుటుంబానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. -
నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్
హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర' శాతకర్ణి సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. శుక్రవారం(జూన్ 10) బాలయ్య పుట్టినరోజు సందర్భంగా గురువారం ఈ పోస్టర్ విడుదల చేశారు. యుద్ధం నేపథ్యంలో రూపొందించిన ఈ పోస్టర్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఉంది. శాతకర్ణిగా బాలకృష్ణ వైవిధ్యమైన గెటప్ లో కనిపించాడు. పోస్టర్ చిత్రయూనిట్ అందరి పేర్లకు 'పుత్ర' జోడించారు. బాలకృష్ణను 'బసవరామతారకపుత్ర'గా వర్ణించారు. దర్శకుడి పేరును అంజనా పుత్ర క్రిష్, నిర్మాతల పేర్లను కమలాపుత్ర రాజీవ్ రెడ్డి, సీతారామపుత్ర సాయిబాబా అని వేశారు. టెక్నియన్ల పేర్లకు కూడా 'పుత్ర' తగిలించారు. 'గౌతమిపుత్ర' శాతకర్ణి సినిమా మొదటి షెడ్యూల్ మొరాకోలో ఇటీవలే పూర్తయింది. హైదరాబాద్‌లో వేసిన భారీ యుద్ధ నౌక సెట్లో మలి షెడ్యూల్ చేయనున్నారు. ఈ నెలలోనే ఈ షెడ్యూల్ ఆరంభమవుతుంది. బాలకృష్ణ సరసన శ్రీయ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, పాటలు: 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి, కెమేరా: జ్ఞానశేఖర్, మాటలు: బుర్రా సాయి మాధవ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు. -
సంక్రాంతికి శాతకర్ణి
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీ పుత్ర శాతక ర్ణి’ ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో వై. రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ మే మొదటి వారంలో మొరాకోలో ఆరంభం కానుంది. శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించి తనకంటూ ఓ చరిత్రను లిఖించుకున్న గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలనుకుంటున్నారు.