‘శాతకర్ణి ల్యాండ్ మార్క్ మూవీ’ | social media comments on gowthami putra satakarni | Sakshi
Sakshi News home page

‘శాతకర్ణి ల్యాండ్ మార్క్ మూవీ’

Jan 12 2017 8:35 AM | Updated on Oct 22 2018 6:05 PM

‘శాతకర్ణి ల్యాండ్ మార్క్ మూవీ’ - Sakshi

‘శాతకర్ణి ల్యాండ్ మార్క్ మూవీ’

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అద్భుతంగా ఉందని అభిమానులు అంటున్నారు.

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’  అద్భుతంగా ఉందని అభిమానులు అంటున్నారు. ప్రీమియర్‌ షోలు చూసినవారంతా సినిమా చాలా బాగుందని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ప్రేక్షకుల నుంచి పాజిటవ్ టాక్ వస్తోందని చెబుతున్నారు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బ్లస్టర్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ దీమాగా ఉన్నారు. సీన్స్, డైలాగులు, బాలయ్య నటన సినిమాకు హైలెట్ అని విశ్లేషిస్తున్నారు. దర్శకుడు క్రిష్‌ పడిన శ్రమ తెరపై కనబడుతోందని, అద్భుతంగా తీశాడని మెచ్చుకున్నారు. మరోవైపు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’  ఈరోజు విడుదల కావడంతో ధియేటర్ల దగ్గర అభిమానుల సందడి నెలకొంది. అమెరికాలోని డల్లాస్ లో నందమూరి ఫ్యాన్స్ కార్ల ర్యాలీ చేశారు.

‘గౌతమిపుత్ర శాతకర్ణి’  సినిమా విజయవంతం కావాలని పలువురు తారలు ఆకాంక్షించారు. బాలయ్య కెరీర్ లో ఈ చిత్రం ల్యాండ్ మార్క్ సినిమా అవుతుందని నందమూరి కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. బాబాయ్ సినిమా హిట్ కావాలని జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పాడు. బాలయ్య సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు మంచు విష్ణు, మంచు మనోజ్‌, నాని కూడా ట్వీట్లు పెట్టారు. పెద్ద సినిమాలో తాను నటించినందుకు గర్వపడుతున్నానని సీనియర్ నటి హేమమాలిని ట్వీట్‌ చేశారు. ఈ చిత్రం విజయవంతం కావాలని ఆమె కోరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement