హీరో బాలకృష్ణకు నోటీసులు
హైదరాబాద్: సినీ హీరో బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు గౌతమీపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమా నిర్మాతలకు కూడా నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గౌతమీ పుత్ర శాతకర్ణి, రుద్రమదేవి సినిమాలకు వినోద పన్ను మినహాయింపుపై దాఖలైన పిల్‌ను న్యాయస్థానం మంగళవారం విచారించింది. గతంలో ఈ విషయంలో తమిళనాడు తీర్పును పిటిషనర్ ఉదహరించారు.