డాన్ లుక్లో బాలయ్య..!
గౌతమిపుత్ర శాతకర్ణితో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్లో జరుగుతోంది. బాలయ్య సరసన శ్రియ హీరోయిన్గా నటిస్తుండగా మరికొంత మంది ముద్దుగుమ్మలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బాలకృష్ణ లుక్ లీక్ అయ్యింది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ను రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ చెప్పిన కొద్ది గంటల్లోనే బాలకృష్ణ వర్కింగ్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య రెండు డిఫరెంట్ లుక్స్లో అలరించనున్నాడు. మాఫియా డాన్గా పవర్ ఫుల్ రోల్ చేస్తుండగా టాక్సీ డ్రైవర్గా మరో లుక్లో కనిపించనున్నాడు. టాక్సీ డ్రైవర్ లుక్కు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ వీడియోస్ ఇదివరకే రిలీజ్ కాగా తాజాగా బాలయ్య డాన్ లుక్ కూడా లీక్ అయ్యింది. పూరి మార్క్ స్టైలింగ్తో డిజైన్ చేసిన ఈ లుక్ నందమూరి అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేస్తోంది. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.