వసంతరాయలు వస్తున్నాడహో... | Nara Rohit Look from Veera Bhoga Vasantha Rayalu goes viral | Sakshi
Sakshi News home page

వసంతరాయలు వస్తున్నాడహో...

Published Mon, Sep 17 2018 2:32 AM | Last Updated on Mon, Sep 17 2018 2:32 AM

Nara Rohit Look from Veera Bhoga Vasantha Rayalu goes viral - Sakshi

నారా రోహిత్, సుధీర్‌ బాబు, శ్రియ, శ్రీవిష్ణు ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వీరభోగ వసంత రాయలు’. ఇంద్రసేన ఆర్‌. దర్శకత్వంలో బాబా క్రియేషన్స్‌ పతాకంపై అప్పారావ్‌ బెల్లాన నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 5న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా అప్పారావ్‌ బెల్లాన మాట్లాడుతూ– ‘‘క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతోంది.

షూటింగ్‌ చివరి దశకు వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మా చిత్రం టైటిల్‌ ఆసక్తిగా ఉందని అంటున్నారు. సినిమాలో కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. ‘కొత్త మతం పుట్టుకొస్తుంది’ అనే ట్యాగ్‌ లైన్‌తో ఈ చిత్రం వస్తుంది. త్వరలోనే ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్‌ కె. రాబిన్, కెమెరా: ఎస్‌. వెంకట్, నవీన్‌ యాదవ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement