అవి భయంకరమైన అనుభవాలు!
అందాల తారలు ఆమడ దూరంలో కనిపిస్తే చాలు.. ఆమెతో మాట్లాడడానికి, కలిసి ఫొటోలు దిగడానికి జనాలు గుమిగూడి పోతారు. జనంలో తమ పట్ల ఉన్న ఆ అభిమానానికి తారలు పొంగిపోతారు. కానీ, అదే సమయంలో కొంతమంది వెకిలి చేష్టలు చేసి వాళ్లను ఇబ్బందుల పాలు చేసేస్తారు. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయం గురించి శ్రీయ చెబుతూ - ‘‘నేను పబ్లిక్ ఈవెంట్స్‌కి వెళ్లే ముందు వాటి గురించి ట్విట్టర్లో పోస్ట్ చేసేదాన్ని. అది తప్పని ఆ తర్వాత తెలిసింది. ట్వీట్స్ చదివేసి ఆ కార్యక్రమం దగ్గరకు వచ్చేస్తున్నారు.
నాకు కూడా అభిమానులను చూడాలనే ఉంటుంది. అయితే, అభిమానం పేరుతో వెకిలిగా ప్రవర్తించినప్పుడు మాత్రం బాధ కలుగుతుంది. సందట్లో సడేమియా అన్న చందంగా ఆకతాయిలు తాకడానికి ట్రై చేస్తారు. ఒక్కోసారి గిచ్చేస్తారు కూడా. ఏం జరుగుతోందో ఊహించేలోపు వాళ్ల చేతులు మమ్మల్ని తడిమేస్తుం టాయ్. అలాంటి భయంకరమైన అనుభవాలు చాలా ఎదుర్కొన్నా. అందుకే నేను పాల్గొనే కార్యక్ర మాల గురించి ట్వీట్ చేయడం లేదు’’ అని పేర్కొన్నారు.