Beauty of stars
-
హీరోయిన్ త్రిష అందం వెనకున్న సీక్రెట్స్ తెలుసా?
ప్రముఖ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు అయినా ఇప్పటికీ స్టార్ హీరోయన్‌గా తన ఛరిష్మాను కంటిన్యూ చేస్తోంది. కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ త్రిషకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది.16 సంవత్సరాల వయస్సులో మిస్ మద్రాస్ టైటిల్ ను గెలుచుకున్న త్రిష తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. వర్షం సినిమాతో స్టార్‌డమ్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘అతడు’ ‘స్టాలిన్’ వంటి చిత్రాలతో వరుస హిట్స్‌ని ఖాతాలో వేసుకుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన త్రిష కెరీర్ మధ్యలో కాస్త డల్ అయిన త్రిష మళ్లీ ఈ మధ్యనే ‘పొన్నియన్ సెల్వన్' చిత్రంతో యువరాణి కుందవై పాత్రలో నటించి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ కంటే త్రిషకే ఎక్కువ పేరు వచ్చింది. నాలుగు పదుల వయసులోనూ ఇరవైఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుందంటూ త్రిష అందానికి సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యపోయారు. మరి ఇంత అందంగా కనిపించడానికి త్రిష ఏం చేస్తుంది అని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే.. ''గ్రీన్ టీ.. లేదా గ్లాసుడు గోరు వెచ్చని నీటిలో కాసిన్ని నిమ్మ చుక్కలతో నా ‘డే’ మొదలవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మిస్ అవను. నా మెన్యూలో జంక్ ఫుడ్‌కి చోటు లేదు. కంటి నిండా నిద్ర కరువయ్యే చాన్స్ లేదు. మొత్తమ్మీద డిసిప్లిన్ లైఫ్ స్టయిలే నా బ్యూటీ సీక్రెట్''! అంటూ పేర్కొంది. -
అవి భయంకరమైన అనుభవాలు!
అందాల తారలు ఆమడ దూరంలో కనిపిస్తే చాలు.. ఆమెతో మాట్లాడడానికి, కలిసి ఫొటోలు దిగడానికి జనాలు గుమిగూడి పోతారు. జనంలో తమ పట్ల ఉన్న ఆ అభిమానానికి తారలు పొంగిపోతారు. కానీ, అదే సమయంలో కొంతమంది వెకిలి చేష్టలు చేసి వాళ్లను ఇబ్బందుల పాలు చేసేస్తారు. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయం గురించి శ్రీయ చెబుతూ - ‘‘నేను పబ్లిక్ ఈవెంట్స్‌కి వెళ్లే ముందు వాటి గురించి ట్విట్టర్లో పోస్ట్ చేసేదాన్ని. అది తప్పని ఆ తర్వాత తెలిసింది. ట్వీట్స్ చదివేసి ఆ కార్యక్రమం దగ్గరకు వచ్చేస్తున్నారు. నాకు కూడా అభిమానులను చూడాలనే ఉంటుంది. అయితే, అభిమానం పేరుతో వెకిలిగా ప్రవర్తించినప్పుడు మాత్రం బాధ కలుగుతుంది. సందట్లో సడేమియా అన్న చందంగా ఆకతాయిలు తాకడానికి ట్రై చేస్తారు. ఒక్కోసారి గిచ్చేస్తారు కూడా. ఏం జరుగుతోందో ఊహించేలోపు వాళ్ల చేతులు మమ్మల్ని తడిమేస్తుం టాయ్. అలాంటి భయంకరమైన అనుభవాలు చాలా ఎదుర్కొన్నా. అందుకే నేను పాల్గొనే కార్యక్ర మాల గురించి ట్వీట్ చేయడం లేదు’’ అని పేర్కొన్నారు.