Experiences
-
మలి సంధ్యా... మరో వసంతమే!
‘‘పండుటాకులము మిగిలితిమి.. ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి’’ అని భర్త పదవీ విరమణ రోజు భార్య పాడుతున్నట్లుగా ఓ సినీ గీతిక సాగుతుంది. పాటలోని భావమూ మనకు భారంగా అనిపిస్తుంది, కానీ ప్రస్తుత ప్రపంచ ధోరణికి ఆ వాక్యాలు సరిపోవని అనిపిస్తుంది. వృద్ధులు పండుటాకులు కాదు. అనుభవంతో మన ముందు నిలిచే నిండైన అమృత భాండాలు.ప్రతి మనిషి జీవిత దశని రెండు ప్రధాన అంగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ భార్యాబిడ్డలతో కాలాన్ని గడపడం. రెండోది.. బాధ్యతలను పూర్తిచేసి, ఉద్యోగవిరమణ తర్వాత లేదా ఆరు పదులు నిండాక గడిపే కాలం. వీటిలో మొదటి దశకే ప్రాధాన్యం ఉందని, రెండో దశ పనికిరానిదని భావించడం ఏమాత్రం సమంజసం కాదు.ప్రతి జీవన దశలోనూ మనిషికి ప్రత్యేకమైన విషయాలపై శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. అదే విధంగా వృద్ధాప్యంలోనూ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే, మలిసంజెలో వెల్లివిరిసే కాంతులు వారికి మనోహరంగానే అగుపిస్తాయి.యవ్వనంలో పటుత్వం, బిగువు జీవులకు సహజ గుణం. వయసు పెరుగుతున్న కొద్దీ బిగువు సడలుతూ ఉంటుంది. అది శరీరానికుండే సహజ లక్షణం. గడచిపోయిన కాలం ఒక అనుభవాల సుమహారంలా పరిమళిస్తూ ఉంటుంది. ఎంతో విలువైన అనుభవాలు, అవి నేర్పిన పాఠాలను యువతరానికి నేర్పడాన్ని మించిన ఆనందం ఏముంటుంది? ప్రతి అనుభవం ఎంతో విలువైనది. ఎన్నో కష్టాలను, దుఃఖాలను దాటుకుని తెచ్చుకున్న విజయాలను పంచుకుని భావితరాలను తీర్చిదిద్దగలిగింది విశ్రాంత జీవనం గడిపి మలి సంజలో కాలం గడిపే అనుభవ సంపన్నులే. వారి అనుభవాల చేవను ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథాలూ అందించలేవు. అనుభవైక వేద్యమైన వారి జీవనగమనాన్ని కొడుకులతో, మనవళ్ళతో పంచుకుంటూ గడపడం ఆహ్లాదకరమైన విషయం.దేశంలోని, ప్రపంచంలోని రకరకాల ప్రదేశాలు చూసే అవకాశం కేవలం విశ్రాంత జీవనంలోనే ఎవరికైనా సాధ్యమవుతుంది. ఉద్యోగంలో లేదా వేరే వ్యాపకంలో ఉండే పని ఒత్తిడివల్ల కొత్త ప్రదేశాలు చూసే సౌలభ్యం తక్కువగానే ఉంటుంది. ఆ విధంగా కొత్త కొత్తవిహారాల్లో సందర్శించే ప్రదేశాలు, అక్కడి వారి ఆహారపు అలవాట్లు, ప్రత్యేకమైన అభిరుచులు తిలకించి ఆనందం పొందడం ద్వారా వృద్ధుల మనసు మరింతగా ఉత్తేజితమవుతుంది. మరింతగా వాళ్ళను చిన్నవాళ్ళను చేసి ఆనంద సంభరితుల్ని చేస్తుందనడం అతిశయోక్తి కాదు.వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. మదిలో మెదిలే భావాలకు అనుగుణంగా మన జీవన నావ సాగుతూ ఉంటుంది. నేను ఎన్నటికీ నవ యువకుడినే అన్న భావం మదిలో నింపుకుంటే ఆనందం సముద్ర తరంగాల్లా ఉరకలు వేస్తూనే ఉంటుంది. మనం సాధించిన విజయాలూ మన జ్ఞాపకాల పందిరిలోంచి పరిమళించే మల్లికల్లా తొంగి చూస్తూ ఉత్సాహానికి ఊపిరులూదుతూనే ఉంటాయి.వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటివృద్ధాప్యం శాపం కాదు... ఆస్వాదిస్తే అణువణువూ ఆనందమే! ప్రతి జీవీ తమ జీవితంలో వృద్ధాప్యాన్ని ఎదుర్కొనక తప్పదు. అయితే ఈ వృద్ధాప్యాన్ని శాపంగా కాకుండా వరంగా భావించి ఆస్వాదిస్తే వృద్ధాప్యంలో కూడా హాయిగా సమయాన్ని అనుభవించవచ్చు. వృద్ధాప్యాన్ని బాధామయమని భావించకుండా, మన కోసం మనం జీవించే అద్భుత అవకాశంగా భావించిన నాడు వృద్ధాప్యం ఏమాత్రం బాధించదు. పెద్దవయసులో గుర్తుపెట్టుకోవలసింది మన వయసును కాదు.. గడిపే ప్రతి క్షణం తీసుకువచ్చే ఆనందాన్ని మాత్రమే..!! యవ్వనం కొంగ్రొత్త భోగాల సారం.. వృద్ధాప్యం అనుభవాల మణిహారం..!! -
భక్తుడికి ఆహారం భక్తే
యోగరతోవా భోగ రతోవా/ సంగ రతోవా సంగ విహీనః/ యస్య బ్రహ్మణి రమతే చిత్తం/ నందతి నందతి నందత్యేవ... చెరుకు గడను తీసుకొచ్చి కత్తితో నరికినా, మరలోవేసి తిప్పినా, నోటితో కొరికినా... ఎంత హింసించినా తియ్యటి రసాన్ని ఒలికించడం తప్ప అది మరో విధంగా స్పందించదు. కారణం – త్యాగం దాని లక్షణం. ఏ వాగ్గేయకారుడి జీవితం చూసినా ప్రతివారి జీవితంలో ఈ ప్రశాంతత, ఈ కారుణ్యం, ఈ ద్వంద్వాతీత స్థితి, అందరినీ ప్రేమించగల, అనుగ్రహించగల శక్తి కనపడుతుంటాయి. వాళ్ళు కూడా అంత గొప్పగా ఆ సంగీతంతోనే ఎదిగారు. ఆ సంగీతంతోనే మనల్ని ఉద్ధరించారు. త్యాగరాజ స్వామి జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు. మహారాజుగారు అన్ని కానుకలు పంపితే ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగబల్కు మనసా..’’ అంటూ వాటిని తీసుకెళ్ళి చెత్తదిబ్బలో పారేస్తాడా ... అని తోడబుట్టిన అన్నగారికే నచ్చలేదు తమ్ముడి పద్ధతి. ‘ఎప్పుడూ ఆ విగ్రహాలు పట్టుకుని కూర్చుంటాడు. తమ్ముడు కనుక రాజుగారి కొలువులో పాడితే ఎంత హాయిగా జీవించవచ్చు...’ అనే భావన అన్నగారిది. కాదు... సంగీతం మోక్ష సామ్రాజ్యాన్ని ఇవ్వగలదు. ఇది ఇవ్వగలిగిన ఆనందం వేరొకటి ఇవ్వలేదు. వాగ్గేయకారులకు ఉన్నది సంగీతసాహిత్యాలు మాత్రమే కాదు. నేను పాట రాస్తాను, బాణీ కడతాను, అంటే ఎవడూ వాగ్గేయకారుడై పోడు. సంగీతసాహిత్యాల్లో అంతర్లీనంగా భక్తి ప్రవహించాలి. అది ఎటువంటి భక్తి ...అంటే నువ్వు ఏమయిపోతున్నా... నమ్ముకున్న వాడి చరణాలు వదలలేనిది అది.. అచంచలమైనది... అదే భర్తృహరి మాటల్లో చెప్పాలంటే... నిను సేవింపగ ఆపదల్ పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,/జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు పై/కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ/చ్చిన రానీ... అంటాడు. ఏది ఏమయిపోయినా ఆ భక్తిలో పరమానందాన్ని పొంది ఎప్పటికప్పుడు లోపల ఈశ్వర గుణానుభవాలు పెరిగి అవి కీర్తనలుగా వెలువడుతుంటే ఆయన వాగ్గేయకారుడు. అంటే భక్తి ప్రధానం. భక్తుడికి భక్తి అమ్మలాంటిది. పసిబిడ్డకు పాలు ఎలాగో, భక్తుడికి భక్తి అలా ఆహారం. భగవంతుడి పాటలు వింటూ, తాను పాడుకుంటూ, రచన చేస్తూ, స్వరపరుస్తూ, శిష్యులకు చెబుతూ, ఏదీ ఆశించకుండా, ఏది లభిస్తే అది తింటూ, పరమ పవిత్రమైన జీవనాన్ని గడుపుతూ ఆఖరికి తన అవసరం లేదనుకున్నప్పుడు గహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకారం చేసి... భగవంతుడిలో ఐక్యమవుతాడు. భక్తుడిని వేరొకరు రక్షింపనక్కర లేదు..‘‘వాడిని నా కొరకు రక్షింపవలయు..’’ అంటాడు శ్రీమన్నారాయణుడు భాగవతంలో. వాడిని నేను రక్షించేది వాడి కోసం కాదు, నా కోసం..అంటున్నాడు. నన్ను నమ్ముకున్న వాడినే రక్షించకపోతే ఇక నేను ఉన్నానని లోకం ఎందుకు నమ్ముతుంది? అందుకని నేనున్నానని జనులు నమ్మడం కోసం.. నాకోసం వాడిని రక్షిస్తున్నా... అంటున్నాడు. భక్తుని స్థితి అలా ఉంటుంది. వాగ్గేయకారుల అనుభవాలు కూడా ఇవే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
సికింద్రాబాద్ ఓ మంచి జ్ఞాపకం..
సాక్షి, హైదరాబాద్: తనకు జంటనగరాలతో మరచిపోలేని అనుబంధం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, సంస్కరణల రూపశిల్పుల్లో ఒకరైన మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గుర్తు చేసుకున్నారు. వర్చువల్‌గా కొనసాగుతున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 3వ రోజు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌లో తాను చాలా ఏళ్లపాటు గడిపానన్నారు. సైన్యంలో పనిచేసిన తన తండ్రి ఉద్యోగ రీత్యా.. 1950 నుంచి 1987 మధ్య సికింద్రాబాద్‌లోనే తన బాల్యం గడిచిందన్నారు. కార్ఖానాలోని సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్లో చదువుకున్నానని, తాము నివసించే చోట మసీదులు, ఆలయాలు పక్కపక్కనే ఉన్నట్లే హిందువులు, ముస్లింలు అంతా కలిసి మెలిసి ఉండేవారన్నారు. సికింద్రాబాద్ ఎంతో ఆహ్లాదంగా కాలుష్య రహితంగా ఉండే ప్లెజెంట్ సిటీ అంటూ ఆయన కొనియాడారు. ఆ తర్వాత చాలాసార్లు సికింద్రాబాద్‌కు రావాలనుకున్నానన్నారు. ఏదేమైనా.. ఇలాగైనా ఈ కార్యక్రమానికి హాజరవడం ఆనందంగా ఉందన్నారు. సగటు వ్యక్తికీ అర్థమయ్యేలా బ్యాక్‌స్టేజ్.. గతేడాది చనిపోయిన తన భార్య.. ప్రతి సాధారణ వ్యక్తి అర్థం చేసుకునేలా ఆర్థికాంశాలతో పుస్తకం రాయమని చెప్పిందన్నారు. ఆమె కోరిక మేరకే కేవలం ఆర్థిక నిపుణులు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా బ్యాక్ స్టేజ్ పుస్తకం రాశానని ఆయన చెప్పారు. అనంతరం దేశ ఆర్థిక సంస్కరణల రూపకల్పనలో ముఖ్యుడిగా పేరొందిన ఆర్థిక నిపుణుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, మాజీ రాజకీయ నేత పాలసీ అనలిస్ట్ పరకాల ప్రభాకర్‌తో హెచ్ఎల్ఎఫ్లో సంభాషిస్తూ తన బ్యాక్ స్టేజ్ పుస్తకం విశేషాలను సందర్శకులతో పంచుకున్నారు. ‘న్యాయం’ చెప్పిన ఐరన్‌మ్యాన్.. బ్యాంక్ ఉద్యోగిని, ‘వై ఈజ్ మై హెయిర్ కర్లీ’ అనే పుస్తకం రాసిన లక్ష్మీ అయ్యర్ ఫిలడెల్ఫియా నుంచి స్టోరీ టెల్లింగ్ సెషన్లో పాల్గొన్నారు. తన పుస్తకం విశేషాలను ఇదే కార్యక్రమంలో పంచుకున్నారు. రాజకీయ అంశాలు, శాసనాలు, న్యాయవ్యవస్థపై రచనలు సాగించే ఐరన్ మ్యాన్ ట్రైథ్లైట్గా పేరున్న ఆకాష్ సింగ్ రాథోడ్ ఈ కార్యక్రమంలో కాంబోడియా నుంచి పాల్గొన్నారు. తాను రాసిన తాజా పుస్తకం ‘బీఆర్ అంబేడ్కర్ ద క్వెస్ట్ ఫర్ జస్టిస్’ విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సహజ న్యాయ సూత్రాలు, న్యాయ వ్యవస్థలో మార్పు చేర్పులు, రాజకీయ, సామాజిక ప్రభావాలు.. వంటివి ఆయన ప్రస్తావించారు. అలరించిన సిటీ సంగీతం.. సీరియస్‌గా సాగుతున్న ఈ కార్యక్రమంలో 3వ రోజు నగరానికి చెందిన పలు సంగీత బృందాలు పాల్గొని అలరించాయి. సిటీకి చెందిన హైదరాబాద్ హార్పర్స్ బృంద సభ్యులు తమ మౌత్ ఆర్గాన్ సంగీతంతో ఆహ్లాదం పంచగా.. నగరానికి చెందిన తొలి ఉర్దూ ర్యాప్–హిప్ హాప్ గ్రూప్ థగ్స్ యూనిట్ ఉర్రూతలూగించారు. ఈ గ్రూప్‌నకు చెందిన మ్యుజిషియన్స్ ముదాస్సిర్ అహ్మద్, సయ్యద్ ఇర్షాద్ ద్వయంలో ముదాస్సిర్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందర్శకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా థగ్స్ యూనిట్ రూపొందించిన ఆల్బమ్స్ ప్రదర్శించారు. గతేడాది మరణించిన సినీనటుడు, రచయిత సౌమిత్రా ఛటర్జీకి నివాళిగా.. సెలబ్రేటింగ్ సౌమిత్ర పేరిట సాగిన కార్యక్రమంలో బెంగాల్ సినీ ప్రముఖుడు అనిక్ దత్తా, నగరానికి చెందిన సినీ విమర్శకురాలు సంఘమిత్ర మాలిక్ పాల్గొన్నారు. నా జీవితానికి అద్దం.. బ్రాస్ నోట్ బుక్ ఆర్థికాంశాలకు సంబంధించి నిపుణురాలు, మహిళాభ్యుదయ వాది, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మైసూర్‌కి చెందిన దేవకి జైన్.. కిన్నెర మూర్తితో తన ఆటోబయోగ్రఫీగా విడుదల చేసిన ‘ది బ్రాస్ నోట్ బుక్’ విశేషాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన జీవితంలోని పలు కోణాలను స్పర్శించారు. బయోగ్రఫీ అంటే తాను ఈ స్కూల్‌కి వెళ్లా, ఆ కాలేజ్‌కి వెళ్లా, ఆ ఉద్యోగం చేశా వంటి విషయాలు కాకుండా అనేక వ్యక్తిగత అంశాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించానని స్పష్టం చేశారు. తాను చదివిన కొన్ని ప్రముఖుల బయోగ్రఫీల్లా ఉండకూడదని రెండేళ్లు ఆలోచించానన్నారు. ఒక సంప్రదాయ అయ్యంగార్ కుటుంబం నుంచి వచ్చిన తాను తన ప్రేమను, అభిరుచులను నెరవేర్చుకుంటూ సాగిన ప్రయాణాన్ని పొందుపర్చాన్నారు. -
అమ్మా.. నీకు నచ్చినట్లే ఉండు
‘‘ఇక్కడ ఇంగ్లిష్‌లో మాట్లాడడానికి ప్రయత్నించకు. అయినా మా స్కూలుకొచ్చేటప్పుడు మంచి దుస్తులు వేసుకుని రావచ్చు కదా, మరీ ఇలా వచ్చావేంటి? నా ఫ్రెండ్స్ ముందు నాకు ఎంబరాసింగ్‌గా ఉంటుంది’’... ఇలా పిల్లలు నిర్దయగా, కర్కశంగా మాట్లాడినా సరే... గాయపడకుండా ఎవరైనా ఉన్నారంటే అది తల్లి మాత్రమే. గాయపడినా క్షమించగలిగింది తల్లి మాత్రమే. ఆధునిక, నాగరిక పొరలన్నీ తల్లి మనసు ముందు దిగదుడుపే. అమ్మ ఎలా ఉంటే అలాగే ఉండాలి. ఆమెను అలాగే ఉండనివ్వాలి. ఆమె ఎలా ఉండాలనుకుంటే అలా ఉండనివ్వాలి. ఆమెకు ఎందులో సంతోషం ఉంటే ఆ సంతోషంలో ఆమెను జీవించనివ్వాలి. ఆమె నాగరకంగా ఉన్నా అనాగరకంగా ఉన్నా అమ్మే. మనకు ప్రపంచాన్ని తెలియచెప్పింది ఆమే. ఆమె నుంచి నేర్చుకున్న జ్ఞానంతోనే మన బాల్యం ఎదిగింది. ఇప్పుడు మనలో రెక్కలు విచ్చుకున్న విజ్ఞానం ఆమెలో తప్పులు వెతకడానికి కాదు. ఆమె తన పిల్లల తప్పుల్ని కూడా ఆనందంగా స్వీకరించింది, క్షమించింది. ఆమె ఆమెగా జీవించే క్రమంలో ఆమెలో కనిపిస్తున్న తప్పులను పిల్లలు స్వీకరించాల్సిందే. అమ్మకు అండగా ఆమె పక్కన నిలవాల్సిందే... అలా నిలబడే విజ్ఞతను మనలో నింపింది కూడా ఆమె పెంపకమే..’’ అంటూ ఆశువుగా ఓ కవిత రాశారు అనామిక.అనామికది జైపూర్. మదర్స్‌డే రోజున (మే నెల 12వ తేదీ) ఆమె స్నేహితులు నిర్వహించిన సాహిత్య సదస్సుకు హాజరయ్యారు. తల్లి గురించి చిన్న కవితలు, కథలు చదివి వినిపించవలసిందిగా ఆ కార్యక్రమానికి వచ్చిన తల్లులందరినీ... కోరారు నిర్వహకులు. పది నిమిషాల్లో అందరూ కవితలు రాశారు. చదివారు.అనామిక రాసిన కవిత అక్కడికి వచ్చినవారందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో సంచలనాన్ని సృష్టించింది. యూ బ్యూబ్లో ఎనిమిది లక్షల మంది వీక్షించారు. ఫేస్బుక్లో వ్యూస్ నంబర్ అయితే ఏకంగా ఎనిమిది మిలియన్లను దాటి పోయింది. ఈ కవితను విన్న తల్లులు, తండ్రులు వాళ్ల పిల్లలకు షేర్ చేస్తున్నారు. పిల్లలు వాళ్ల పేరెంట్స్‌కు చూపిస్తున్నారు. ఓ యువతి అయితే నేరుగా అనామిక దగ్గరకు వచ్చి ‘అమ్మను అమ్మలా ఉంచడానికి మీ కవిత నాకు ఎంతగానో ప్రోత్సాహం కలిగించింది’ అని చెప్పింది. అనామిక ఇలాంటి సంతోషకరమైన అనుభవాలను పంచుకుంటూ ‘‘నా గుండెల్లోంచి నేరుగా అక్షరాల రూపంలో బయటకు వచ్చిన భావం అది. విన్న వాళ్లందరినీ అంతే హృద్యంగా గుండెలోతుల్ని తాకుతుంది. ఎందుకంటే అమ్మ గురించిన భావన ఎవరినైనా కదిలించి తీరుతుంది’’ అన్నారు. పిల్లలకు దుఃఖం వస్తే భుజమిచ్చే ఆసరా అమ్మ. అలాంటి అమ్మ పట్ల పిల్లలు చూపించాల్సిన ప్రేమకు కూడా కొలతలు , కొలమానాలు ఉండకూడదు. తల్లి మీద ఓవర్ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, ఆమె ట్రెండ్‌కు తగ్గట్టుగా మారాలని ఆశించి, ఎలా ఉండాలో నిర్దేశిస్తూ ఆమె మీద ఒత్తిడి తీసుకురాకూడదు’’ అన్నారు అనామిక. – మంజీర అనామిక కవిత ఆమె తల్లి, ఆమెలో తప్పు ఎందుకుంటుంది?ఆమె నిన్ను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి శ్రమించింది.నీ బాక్సులో ఎప్పుడూ రుచికరమైన మంచి ఆహారాన్ని పెట్టింది. నీ దుస్తుల్ని శుభ్రంగా ఉతికి పెట్టింది. నిన్ను మరకలు లేకుండా సమాజానికి చూపించింది.ఆమె తల్లి, ఆమెలో తప్పు ఎందుకుంటుంది?ఆమె పని చేయడానికి బయటికెళ్తే వద్దని ఆపేస్తారు పిల్లలు.ఆమె ఇంట్లోనే ఉండి అందరికీ అన్నీఅమరుస్తుంటే ఆమెని వెక్కిరిస్తారు. నేనూ ఓ తల్లినే. తల్లిగా నేనూ తప్పు కాకూడదు.అమ్మా నిన్ను బాధించి ఉంటే నన్ను క్షమించు. ఒట్టు... ఇక ఎప్పుడూ నీ వెంటే ఉంటాను.అమ్మా! నువ్వెప్పుడూ తప్పు కాదు. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి.ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు.మా అనుమతి నీకు అక్కర్లేదు. -
అనుభవాల యాత్ర!
విభిన్న అనుభవాల కోసం ఒంటరిగా ఇండోనేసియా చుట్టేశాడు ఆకాశ్ మల్హోత్రా. సాహసాల చుట్టూ తిరిగే సరదాలు.. అతడిని కొమాడో డ్రాగన్ల ముందుకు తీసుకెళ్లాయి. మంటా రేస్ (భారీ ఆకారంలో వుండే సముద్ర జంతువులు) మధ్య ఈత కొట్టించాయి. మౌంట్ బటుర్ అగ్నిపర్వత శిఖరారోహణం చేయించాయి. శిఖరంపై నిలబడి సుందర సూర్యోదయ దృశ్యాలను వీక్షించాడు ఆకాశ్. జీవితంలో థ్రిల్లింగ్ క్షణాలను ఇష్టపడతాడు 26 ఏళ్ల ఆ కుర్రాడు. నాలుగేళ్లలో 34 దేశాల్ని చుట్టొచ్చాడు. సంపాదనలో అధిక భాగాన్ని ప్రయాణాలకే వెచ్చిస్తున్న ఈ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ యజమాని.. తన వెతుకులాట ఆనందం కోసమేనంటాడు. అమెరికన్ పారిశ్రామికవేత్త టిమ్ ఫెర్రిస్ రచించిన ‘ది ఫోర్ అవర్ వర్క్ వీక్’ పుస్తకం చదివి స్ఫూర్తి పొందాడు ఆకాశ్. రుణాలు తీసుకుని మరీ..! ఆకాశ్ మాదిరిగా మన దేశ యువతీయువకులు అధిక సమయాన్ని ప్రయాణానికి కేటాయించలేకపోవచ్చు. కానీ ప్రపంచాన్ని వీక్షించాలనే కోరిక మాత్రం వారిలో బలంగా ఉంది. వస్తువుల కంటే అనుభవాలకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. స్కై స్కానర్ ఇండియా నిర్వహించిన మిలీనియల్ ట్రావెల్ సర్వే ప్రకారం 66 శాతం మంది భారత యువతీ యువకులు (18–35 వయోశ్రేణి) ఏడాదికి రెండు నుంచి ఐదు సార్లు ప్రయాణాలు చేస్తున్నారు. మరో 10 శాతం మంది ఏడాదికి 6 నుంచి 10 సార్లు ప్రయాణాలు చేస్తున్నారు. అవసరమైతే ప్రయాణ ఖర్చుల కోసం లోన్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. క్యుబెరా, ఫింజీ, ఫెయిర్‌సెంట్, రెబిక్యూ వంటి కంపెనీలు గత రెండేళ్లలో ఇచ్చిన రుణాల్లో 12 నుంచి 20 శాతం ఇలాంటివే. - ఉద్యోగులకు వ్యక్తిగత రుణాలిచ్చే క్యుబెరా టెక్నాలజీ కంపెనీ వెలువరించిన గణాంకాల ప్రకారం గతేడాది ట్రావెల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న 1,700 మందిలో 728 మంది 28 ఏళ్లలోపు వారే. తమ వద్ద రుణం కోసం చూపే మొదటి ఐదు కారణాల్లో.. ‘ట్రావెల్’ ఒకటని చెబుతున్నారు రిస్క్ అట్ క్యుబెరా అధిపతి అనుభవ్ జైన్. గత ఆర్థిక సంవత్సరం రూ.6 కోట్ల ప్రయాణ రుణాలు ఇవ్వగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15 కోట్ల రుణాలు మంజూరు చేయాలనుకుంటోంది. - కో– ఫౌండర్ అభినందన్ సంగం అందించిన వివరాల ప్రకారం ఫింజీ కంపెనీ రుణ మంజూరు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయడం, ప్రీ పేమెంట్ చార్జీలను మినహాయించడం వంటి వెసులుబాట్ల ద్వారా యువతను బాగా ఆకర్షిస్తోంది. ఫెయిర్‌సెంట్ ప్రయాణాలు, పెళ్లిళ్లు, హనీమూన్ ట్రిప్పులకు 6 శాతం మేరకు రుణాలు ఇచ్చింది. రెండేళ్లలో రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిందని ఈ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజత్ గాంధీ చెబుతున్నారు. రుబిక్ అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ది కూడా ఇదే అనుభవం. - ఎక్స్‌పెడియా మిలీనియల్ సర్వే 2017 ప్రకారం 56 శాతం యువతీయువకులు డిస్కౌంట్ల తాలూకూ సమాచారం, ప్యాకేజీల కోసం ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 85 శాతం మంది చెల్లింపుల్లో సౌలభ్యాన్ని కోరుకుంటున్నారు. ఇలాంటి వారి ఆకాంక్షలకు అనుగుణంగా థామస్ కుక్ ఇండియా వంటి ట్రావెల్ కంపెనీలు తమ లావాదేవీల్లో మార్పులు చేసుకుంటున్నాయి. ఈ కంపెనీ – మిలీనియల్స్ కోసం 2016లో హాలిడే సేవింగ్స్ అకౌంట్ స్కీమ్ ఆరంభించడం ఇందులో భాగమే. నెలనెలా నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా హాలిడే టూర్ వెళ్లేందుకు, పనిలో పనిగా 6.65శాతం వార్షిక వడ్డీ పొందేందుకు వీలు కల్పిస్తోంది ఈ పథకం. -
కరెంటు పోయిందని..!
కాసేపటికి కరెంటు వచ్చింది. వెలుగుని తెచ్చింది. చూస్తే నిజంగానే అతనికి మెడకింద భాగం నుంచి ఛాతీభాగం వరకూ చొక్కామీద దుమ్ము. అతను దులుపుకుంటూ గొణుక్కుంటున్నాడు – ‘ఎవడ్రా పోసింది! ఏమిటీ కోతిపని’. ప్రతిమనిషి జీవితంలో ఎన్నో అనుభవాలు. ఎన్నో జ్ఞాపకాలు. సంతోషపెట్టేవి కొన్ని, బాధపెట్టేవి కొన్ని, నవ్వుకునేవి కొన్ని, ఆలోచిస్తే కాని అర్థం కానివి కొన్ని, అర్థమయ్యేవి కొన్ని, అర్థం వెతకాల్సినవి కొన్ని.. ఇలా ఎన్నో...ఇక నా విషయానికొస్తేస్కూల్లో ఉండగా పరీక్షలు దగ్గర పడుతున్నపుడు ఒక్కోసారి, ఇప్పుడు తలుచుకుంటే అంత వెర్రితనం ఏమిటా అనుకునే పని చేసేవాడిని. మూడురాళ్లు తీసుకొని ఒక స్థంభానికి కొంచెం దూరంగా నిలబడి దానికి గురి చూసి కొట్టేవాడిని. వాటిలో ఒక్కటి తగిలినా నేను పరీక్షలు పాసవుతాను అనుకొని. ఒకటి తగలడంతోనే ఆనందించేవాడిని. అది నాకు తెలియకుండానే నాకు నేను ఇచ్చుకునే బలమేమో తెలియదు మరి! అయితే ఇందులో మరో మతలబు ఉంది. ఒకవేళ మూడూ తగలకపోయినా నిరుత్సాహపడేవాడిని కాదు. మళ్లీ మూడు తీసుకుని ‘ఇప్పుడు అసలు మొదలు’ అనుకునేవాడిని. ఈ ‘అసలు మొదలు’ ఒక రాయి తగిలేవరకూ కొనసాగేది.ఒక విషయం ఒకరికి మామూలుగా, ఇంకొకరికి కిందపడి నవ్వేలా ఎందుకు చేస్తుందో నాకెప్పటికీ ఆశ్చర్యమే. కాలేజీలో చదివే రోజుల్లోదీ జ్ఞాపకం. ముళ్లపూడి వెంకటరమణ గారి కథ ‘ఆకలి ఆనందరావు’ చదివాను. బాగుందనిపించింది. చాలా బాగుందనిపించింది. బాధనిపించింది కూడా ఆనందరావు స్థితికి. అలా అనేం చెప్పలేదు కాని ఈ కథ బాగుంది చదవమని నా రూమ్మేట్ ఒకతనికిచ్చాను. కథ చదువుతూ మధ్యలో ఆపి కిందపడి నవ్వడం మొదలెట్టాడు. ఇంతకీ ఆ సందర్భం ఏమిటంటే, ఆ కథలో ఆనందరావు ఒక చెట్టుకింద నిలబడి ఉంటాడు. అతని భుజం మీద ఒక కాకి రెట్టేస్తుంది. దాని పక్కనున్న కాకికి ఈ విషయం చెప్పి సంబరపడుతుంది. ఆనందరావు ఏం మాట్లాడకుండా వెళ్లి కడుక్కొచ్చుకొని అదే చెట్టుకింద నిలబడతాడు. అదే కాకి మళ్లీ రెట్టేస్తుంది. అప్పుడు కూడా అతను పైకి చూడకుండా అలా కడుక్కోవడానికి వెళుతుంటాడు. అప్పుడు ఆ కాకి, పక్కనున్న కాకితో, ‘ఎంత టెక్కో చూడతనికి. పైకి చూడనేలేదసలు’ అంటుంది. ఈ కథలోని ఈ సన్నివేశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా అతని నవ్వుని ఆపడం కష్టమయ్యేది. ఇంతకీ ఈ విషయాలన్నీ నేను చెప్పదలుచుకున్న ఒక జ్ఞాపకానికి స్టార్టర్లు. అదేమిటంటే... మా ఊళ్లో లైబ్రరీ కమ్ పంచాయతీ ఆఫీసులో ఒక రేడియో ఉండేది. స్పీకర్లు బయటికి ఉండేవి. కొన్ని నియమిత సమయాల్లో రేడియో పెట్టేవాడు ఉద్యోగి. ముఖ్యంగా సాయంత్రాలు. వ్యవసాయదారులకు ప్రత్యేకంగా వార్తలు కూడా ఉండేవి. ఇంకా పాటలు వగైరా. ఆ స్పీకరు కింద పెద్ద అరుగు. ఆ అరుగుమీద కొంతమంది కూర్చునీ, కొందరు నిలబడీ పిచ్చాపాటీ మాటలు సాగుతుండేవి. రేడియో ప్రసారాలు అయ్యాక కూడా మా మధ్య ఒకసారి అలాగే మాటలు సాగుతుండగా కరెంటు పోయింది. అమావాస్య అనుకుంటాను. కటిక చీకటి. నిలబడి ఉన్న వాళ్లలో ఒక మిత్రుడు ‘రేయ్! నా మీద దుమ్ము పోసాడ్రా ఎవడో’ అన్నాడు ఆ చీకటి నిశ్శబ్దంలోంచి.కాసేపటికి కరెంటు వచ్చింది. వెలుగుని తెచ్చింది. చూస్తే నిజంగానే అతనికి మెడకింద భాగం నుంచి ఛాతీభాగం వరకూ చొక్కామీద దుమ్ము. అతను దులుపుకుంటూ గొణుక్కుంటున్నాడు – ‘ఎవడ్రా పోసింది! ఏమిటీ కోతిపని’ అంటూ కోపంగా, చిరాగ్గా. ఎవరూ మాట్లాడలేదు. అతను దుమ్ము దులుపుకున్నాడు. మళ్లీ మామూలుగా మాటల్లో పడ్డాం. కాసేపటికి మళ్లీ కరెంటు పోయింది. అదే వ్యక్తి ఇందాక అరిచినట్టే మళ్లీ అరిచాడు – ‘రేయ్! నా మీద దుమ్ము పోసాడ్రా ఎవడో’. మళ్లీ తిట్టుకుంటూ దులుపుకున్నాడతను. ఎవరిలా చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. ఆలోచిస్తూనే ఉన్నాం. ఉన్నట్టుండి ఒక మిత్రుడు ‘అది నేనే పోశా’ అన్నాడు. అందరం ఆశ్చర్యంగా చూశాం అతనివంక. మరో మిత్రుడు అడిగాడు – ‘మీ మధ్య గొడవలు కూడా ఏం లేవు కదరా! ఎందుకు పోశావు?’ అని.ఆ మిత్రుడు చాలా సాదాసీదాగా, ‘కరెంటు పోయిందిగా!’ అన్నాడు నవ్వేస్తూ. – వేమూరి సత్యనారాయణ, హైదరాబాద్. -
మా సోదరిపై పట్టపగలే లైంగికదాడి: నటి
లాస్ ఎంజెల్స్: తనతో సహా తన కుటుంబంలోని సభ్యులు కూడా ఏదో ఒక రూపంలో లైంగిక దాడులకు గురైన వాళ్లమేనని ప్రముఖ హాలీవుడ్ నటి గోల్డెన్ గ్లోబ్, బీఏఎఫ్ టీఏ, అకాడమీ అవార్డును పొందిన విజేత వయోలా డేవిస్ అన్నారు. అందుకే తాను నటిగా ఉండటంతోపాటు లైంగిక దాడులకు గురయ్యే బాధితుల ఫౌండేషన్ కు ఒక న్యాయవాదిగా కూడా మారినట్లు చెప్పారు. పలు హాలీవుడ్ చిత్రాలు, టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ గొప్పపేరును తెచ్చుకున్న లయోలా తొలిసారి ధైర్యంగా తనకు జరిగిన అనుభవాన్ని బయటపెట్టారు. 'నేను, నా తల్లి, నా సోదరీమణులు, నా స్నేహితురాలు రెబెక్కా చిన్నతనం నుంచే ఏదో ఒక రూపంలో లైంగిక దాడులు ఎదుర్కొన్నాం. మా అందరిదీ ఒకే సమస్య. లైంగిక వేధింపులు ఎదుర్కొని చనిపోకుండా బతికి బయటపడిన వాళ్లం. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా చుట్టుపరిస్థితులు దారుణంగా ఉండేవి. ఆ సమయంలో నీకు ఎవ్వరు డబ్బులిస్తే వారు నిన్ను స్పృషించవచ్చు. నా ఏడేళ్లప్పుడు ఒకసారి స్నేహితురాలి ఇంటికి పుట్టిన రోజుకు వెళితే అక్కడ ఎవరో ఒకరు అంతకుముందు తప్పుగా ప్రవర్తించినవారు ఉండేది. నా సోదరి డానియెల్‌పై ఎనిమిదేళ్లప్పుడే ఒక దుకాణదారుడు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో లైంగికదాడి చేశాడు. మా అమ్మకు చెబితే అతడిని బజారుకు ఈడ్చింది. అతడు ప్రతినెల జరిమానా కట్టేలా దండించారు. దారుణం ఏమిటంటే అతడి దుకాణానికి వెళ్లిన చిన్నారులందరిపై ఇలాగే చేసేవాడు' అంటూ ఆమె తన బాల్యం, యుక్తవయసులోనే అనుభవాలు పంచుకుంది. -
అట్టహాసంగా సిమ్లా వింటర్ కార్నివాల్
-
వేధింపులపై మొదటి అనుభవాలు!
తెలిసీ తెలియని వయసునుంచే అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఆరు లేదా ఏడు సంవత్సరాల వయసులోనే తమపై వేధింపులు ప్రారంభమౌతున్నట్లు అమ్మాయిలు ప్రత్యక్షంగా చెప్తున్నారు. యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న కొన్ని వీడియోలు అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అతిచిన్న వయసులోనే ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి కొందరు చెప్పిన వివరాలు ఓల్డ్ ఢిల్లీ ఫిల్మ్స్ 'తెర'కెక్కించింది. భారతదేశంలో అమ్మాయిలు చిన్నతనంలోనూ, యుక్తవయసులోనూ కూడ లైంగిక వేధింపులకు గురికావడం సర్వ సాధారణమైపోయింది. జీవితంలో ఎదురయ్యే సంఘటనల గురించి, స్వభావాలగురించి పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వకపోవడంతోనే పిల్లలు ఇలా గందరగోళంలో పడటం, భయానకంగా మారడం జరుగుతోందని కొందరి అభిప్రాయం. అయితే 14 ఏళ్ళ అమ్మాయి తనకు ఎదురైన జిగుప్సాకరమైన అనుభవం ప్రత్యక్షంగా చెప్పడం చూస్తే... తల్లిదండ్రులు, పెద్దల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అంతేకాదు అంతా సిగ్గుపడాల్సిన అంశంగా కూడ మారింది. ముఖ్యంగా భారత దేశంలో అమ్మాయిలు యుక్తవయసు వచ్చేసరికి పురుషులనుంచి అవాంఛిత లైంగిక సంబంధాలను ఏర్పరచుకొంటున్నట్లు తెలుస్తోంది. అయితే పిల్లలు.. ముఖ్యంగా కొడుకుల పెపంపకం విషయంలో తల్లులు సరైన జాగ్రత్తలను తీసుకోవడం లేదని అమ్మాయిలు చెప్తున్నారు. విషయాలను అర్థమయ్యేట్లు బోధించడం మహిళల ప్రత్యేక విధి అంటున్నారు. అంతేకాదు తండ్రి కూడ బాధ్యత తీసుకోవాలంటున్నారు. అయితే చెప్పేది ఎవరైనా సరిగా చెప్పడం అన్నది మాత్రం ఇక్కడ అవసరం అంటున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు వారి స్వేచ్ఛను సైతం హరిస్తున్నాయి. దీంతోనే ఆడపిల్లలు బయటకు వెళ్ళద్దు వంటి అభ్యంతరాలు వెల్లడవుతున్నాయి. ప్రస్తుత వీడియోల్లోని మహిళల అనుభవాలను చూస్తే వయోజనులే కాక యువకులు సైతం మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. భారత దేశంలో 2007 లెక్కల ప్రకారం చూస్తే... ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు పెద్దలవల్ల లైంగిక వేధింపులకు గురౌతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు.. ప్రస్తుతం యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న వీడియోల్లోని ప్రసంగాలు ప్రారంభవాచకాలు కావాలి. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఇవే నాంది పలకాలి. -
అవి భయంకరమైన అనుభవాలు!
అందాల తారలు ఆమడ దూరంలో కనిపిస్తే చాలు.. ఆమెతో మాట్లాడడానికి, కలిసి ఫొటోలు దిగడానికి జనాలు గుమిగూడి పోతారు. జనంలో తమ పట్ల ఉన్న ఆ అభిమానానికి తారలు పొంగిపోతారు. కానీ, అదే సమయంలో కొంతమంది వెకిలి చేష్టలు చేసి వాళ్లను ఇబ్బందుల పాలు చేసేస్తారు. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయం గురించి శ్రీయ చెబుతూ - ‘‘నేను పబ్లిక్ ఈవెంట్స్‌కి వెళ్లే ముందు వాటి గురించి ట్విట్టర్లో పోస్ట్ చేసేదాన్ని. అది తప్పని ఆ తర్వాత తెలిసింది. ట్వీట్స్ చదివేసి ఆ కార్యక్రమం దగ్గరకు వచ్చేస్తున్నారు. నాకు కూడా అభిమానులను చూడాలనే ఉంటుంది. అయితే, అభిమానం పేరుతో వెకిలిగా ప్రవర్తించినప్పుడు మాత్రం బాధ కలుగుతుంది. సందట్లో సడేమియా అన్న చందంగా ఆకతాయిలు తాకడానికి ట్రై చేస్తారు. ఒక్కోసారి గిచ్చేస్తారు కూడా. ఏం జరుగుతోందో ఊహించేలోపు వాళ్ల చేతులు మమ్మల్ని తడిమేస్తుం టాయ్. అలాంటి భయంకరమైన అనుభవాలు చాలా ఎదుర్కొన్నా. అందుకే నేను పాల్గొనే కార్యక్ర మాల గురించి ట్వీట్ చేయడం లేదు’’ అని పేర్కొన్నారు. -
నేను మళ్లీ నటిస్తానని అనుకోలేదు
నటి జ్యోతిక నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవరసాలే మెచ్చే విధంగా నటించగల దిట్ట ఆమె. మచ్చుకు ఒక చంద్రముఖి చిత్రం చాలు నటిగా జ్యోతిక ఏమిటన్న దానికి సహజంగా వయో భేదం అనేది హీరోల కంటే హీరోయిన్లపైనే అధిక ప్రభావం చూపుతుంది. పెళ్లి, పిల్లలు, సంసార జీవితం ఇందుకు ఒక కారణం కావచ్చు. అయితే నటుడు సూర్యతో ప్రేమ, పెళ్లి, ఇద్దరు పిల్లలు ఆ జీవిత మాధుర్యాన్ని అనుభవిస్తూ సుమారు ఎనిమిదేళ్ల తరువాత... మళ్లీ నటనను ఆహ్వానించి ముఖానికి రంగేసుకుని 36 వయదినిలే అంటూ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన భామ అనుభవాలను తెలుసుకుందాం. పశ్న: సుమారు ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ కెమెరాముందు నిలబడినప్పుడు ఎలా అనిపించింది? జ: నిజం చెప్పాలంటే తొలిరోజు షూటింగ్‌కు భయం భయంగానే వెళ్లాను. నా పరిస్థితిని గమనించిన దర్శకుడు రోషన్ ఆండ్య్రూస్ చాలా సహకరించారు. ప్రశ్న: ఇంతకుముందు ఒకటి రెండు చిత్రాలు మినహా మీరు చేసినవన్ని చలాకీ పాత్రలే. అలాం టిది ఈ 36 వయదినిలేలో చాలా పరిణితి చెందిన పాత్ర. ఈ విషయంపై మీ స్పందన? జ: 17-18 ఏళ్లకే నేను సినిమా రంగ ప్రవేశం చేశాను. అప్పట్లో తమిళ భాష తెలియదు. ఐదేళ్లు కష్టపడి భాష నేర్చుకున్నాను. కొన్ని చిత్రాల్లో ఓవ ర్ యాక్టింగ్ అని సందర్భాలు ఉన్నాయి. నేను చివరిగా నటించిన మొళి చిత్రం అప్పుడు నా వయసు 27. సన్నివేశం ఏమిటి? సంభాషణలు అర్థం ఏమిటి? అన్నవి తెలుసుకుని నటిస్తే ఓవర్ యాక్షన్ తగ్గుతుంది. ప్రస్తు తం నా వయసు 36. వయసుకు తగ్గ పాత్రను 36 వయదినిలే చిత్రంలో చేయగలగడం గొప్పగా భావిస్తున్నాను. ప్రశ్న: మీ నిత్య దిన చర్య గురించి? జ: ఉదయం ఆరు గంటలకు నిద్ర లేస్తాను. ఏడు గంటల కల్లా పిల్లలు పాఠశాలకు వెళతారు. వారు లేకపోతే నాకు ఇంటిలో ఉండలేను. ఎనిమిదిన్నరకు జిమ్‌కు వెళతాను. తిరిగి 12 గంటలకు ఇంటికి వెళతాను. ఆ సమయానికి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు. 12 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పిల్లలతో సరిపోతుంది. ఇక సూర్య ఇంటిలో ఉంటే ఆయనతో మాట్లాడుతూ భోజనం చేయడం అంటే చాలా ఇష్టం. సూర్య లేకపోతే రాత్రి 10.30 గంటల సినిమా చూడటానికి థియేటర్‌కు వెళతా. మధ్యమధ్యలో ఇంటికి ఫోన్ చేసి పిల్లలు నిద్రపోతున్నారా? లేక అల్లరి చేస్తున్నారా? అని తెలుసుకుంటాను. ఇదే నా దినచర్య. ప్రశ్న: మీ నటనకు విమర్శకులు ఎవరు? జ: స్నేహితురాళ్లే. సూర్య నా నటనను విమర్శించరు. చాలా ఓవర్‌గా నటించినా సూపర్ అంటారు. సుమారుగా నటించిన చాలా పరిణితి చెందిన నటన అంటారు. ప్రశ్న: పిల్లల స్వభావం గురించి? జ: మా అమ్మాయి రియాది కొంచెం మొహమాటం ఎక్కువ. సూర్య మాది రిగానే చాలా తక్కువగా మాట్లాడుతుంది. మా అబ్బాయి దేవ్ అచ్చం నాలాగే. గలగలా మాట్లాడుతాడు. అమ్మాయి వెజిటేరియన్. అబ్బాయి నాన్ వెజ్. ఇద్దరు స్విమ్మింగ్, జిమ్, క్రీడలు, కరాటే అంటే యమ బిజీ. ప్రశ్న: మీకు నచ్చని విషయాలంటూ ఏమైనా ఉన్నాయా? జ: సమయాన్ని వృథా చేయడం అసలు నచ్చదు. సూర్య ఇంటిలో ఉంటే రోజంతా స్నేహితులతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. అలాంటప్పుడే నాకు కోపం వస్తుంది. అందుకే ఇంటికి వచ్చి కాలింగ్‌బెల్ కొట్టినపుపడు నేను వచ్చి తలుపు తీసినప్పుడు తను ఫోన్లో మాట్లాడుతూ ఇంటిలోకి రాకూడదని చట్టం వేశాను. ప్రశ్న: ఇకపై వరుసగా నటిస్తారా? జ: నేను మళ్లీ నటిస్తానని అనుకోలేదు. 36 వయదునిలే చిత్రంలో నటించడమే అనూహ్యంగా జరిగిపోయింది. మంచి కథా పాత్ర లభిస్తే ఇకపై కూడా నటిస్తా. -
అక్షరాలతో కట్టిన గుడి...
సుప్రసిద్ధ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశర్మ కథలు ఎంత ప్రసిద్ధమో ఆయన ఆత్మకథ ‘అనుభవాలూ జ్ఞాపకాలూనూ’ అంతే ప్రసిద్ధం. శ్రీపాద జీవితం తెలుసుకోవడం కోసం మాత్రమే గాకుండా ఒకనాటి తెలుగు సమాజపు పోబడికీ, పలుకుబడికీ దర్పణంగా కూడా ఈ ఆత్మకథను చూస్తారు. దీనిని చదివి ఎందరెందరో గొప్పవాళ్లు ప్రశంసలు కురిపించారు. మహా పండితులు వేలూరి శివరామశాస్త్రి ఏమన్నారో చూడండి.... మీ ‘అనుభవాలూ జ్ఞాపకాలూనూ’ చదివాను. చదివించాను. ఆ చదివినవారూ నేనూ కూడా ఒక్క గుక్కలో చదివాం. ఇంకా ఇది (చదవాలని కుతూహలపడి తీసుకువెళుతున్నవారి వల్ల) వేయిళ్ల పూజారిగానే ఉంది. తెలుగు గుడి కట్టాలి కట్టాలి అని పరితపించిన శ్రీరామచంద్రశాస్త్రిగారు గనక బతికి ఉంటే అక్షరాలతో కట్టిన ఈ తెలుగు గుడికి ఎన్ని గోపురాలు ఎన్ని సోపానాలు కట్టి ఉండేవారో కదా. తెలుగువారిలో తెలుగుదనం చచ్చిపోయి ఎన్నో ఏండ్లయిపోయింది. ‘అది ఎప్పుడో ఉండేది’ అని కూడా మన తెలుగు పిల్లలెరగరు. ‘నీ తెలుగెవ్వరి పాలు చేసి తిరిగెద వాండ్రా’ అని నేను సుమారు నలుబది ఏండ్ల క్రితం ప్రశ్నించాను. మీ పుస్తకమున్నూ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి ఆంధ్ర పురాణమున్నూ వచ్చినవి. చాలు-కాలో హ్యయం నిరవధి ద్విపులా చ పృధ్వీ. ఈ సంపుటంలో అంతరంగా ఉన్న తెలుగుదనమూ దానికి చాలకమైన స్వయంకృషీ వీనికి దేవతలు కూడా సంతోషిస్తారు. తెలుగువారిలో తెలుగుదనం ఉన్నదని ఈ పుస్తకం కళ్లు తెరిపిస్తుంది. ప్రతి హైస్కూలులోనూ ప్రతి కాలేజీని ప్రతి తెలుగు వ్యక్తినీ ఈ పుస్తకం చదవమని అనురోధిస్తాను. ‘తెలుగుభాష’ ఆడవాళ్లలో ఉన్నదని రాశారు. ‘కాంతా సమ్మితతయా ఉపదేశయుజే’ అని చెప్పినవాడు తెలియకుండా మీ నోట్లో నుంచి ఊడి పడ్డాడు. దానికీ కొంత తేడా లేకపోలేదుగాని తరచి చూస్తే ఈ రెండూ ఒకదాని అవతారాలే. భేష్. -
55 రోజులు 17 వేల కిలోమీటర్లు
విశాఖపట్నం... లాసన్స్‌బే కాలనీలోని ‘బేక్ మై విష్’ కాఫీ షాప్. ముగ్గురు మిత్రులు కాఫీ సిప్ చేస్తున్నారు. ‘బైక్‌పై లాంగ్ రైడ్ చేస్తా... మీరొస్తారా?’ తాగేసిన కాఫీ కప్పును టేబుల్‌పై పెడుతూ అన్నాడు కిషోర్... ‘వావ్... సూపర్బ్ ఐడియా.. వియార్ రెడీ... ఎన్నాళ్లు... ఎక్కడికెళ్దాం?... ఎప్పుడొద్దాం?’... బుల్లెట్ స్పీడ్‌తో ప్రశ్నించారు కర్ణ రాజ్, సుధీర్. ‘ఫ్రం హోం.. టు హోం... వయా ఇండియా. ఇంటి నుంచి బయల్దేరాలి. భారతదేశాన్ని క్లోజప్‌లో చూడాలి. రెండు నెలల్లో ఇంటికి రావాలి’... ప్లాన్ వివరించాడు కిషోర్. ‘ఓకే డన్..’ అన్నారు కర్ణ రాజ్, సుధీర్. ముగ్గురూ బైక్‌లపై దూసుకుపోయారు. కన్యాకుమారిలో అందమైన సాయం త్రం. హిమాలయాల్లో రక్తం గడ్డ కట్టే చలితో సహవాసం. లేహ్‌లో మంచువానలో స్నానం. కొండచరియలు విరిగిపడుతున్నా చెదరని ఆత్మవిశ్వా సం. సైనికుల బంకర్లలో ఆతిథ్యం. ఇన్ని అనుభవాలు మిగిల్చిన ఆ దూరం అక్షరాలా 17 వేల కిలోమీటర్లు... 55 రోజులు. విశాఖపట్నం నుంచి సుదూర యాత్ర... బైక్‌పై సుదూర యాత్ర చేయాలన్నది కిషోర్ చిరకాల వాంఛ. దీనికి కర్ణ, సుధీర్ తోడయ్యారు. రెండు నెలల సెలవుకు కర్ణ, కిషోర్ దరఖాస్తు చేశారు. వాళ్ల బాస్‌లు కుదరదన్నారు. అంతే... ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. జూన్ తొమ్మి దిన.. కిషోర్, కర్ణ, సుధీర్ బైకుల్ని సిద్ధం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి బైక్ యాత్ర మొదలైంది. మూడోరోజు ఉదయానికి ముగ్గురూ చెన్నై చేరుకున్నారు. అక్కడ చెన్నై బుల్స్ (బుల్లెట్ రైడర్స్) అసోసియేషన్ సభ్యులు వీరికి ఘన స్వాగతం పలికారు. ముగ్గురూ మర్నాడు బయల్దేరి కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ ఒకరోజు ఉండి మర్నాడు కొచ్చిన్ మీదుగా వయనాడ్ జిల్లా కల్పెట్టా చేరుకున్నారు. అప్పుడే కేరళలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఆహ్లాదకర వాతావ రణంలో కల్పెట్టాలో రెండ్రోజులు హాయిగా గడిపారు. ఒకప్పటి వీరప్పన్ సామ్రాజ్యం మీదుగా... అప్పుడే కర్ణ రాజ్ ఓ ఐడియా చెప్పాడు. హైవేపై జర్నీ బోర్ కొడుతోంది.... ఘాట్ రోడ్ అయితే మజా ఉంటుందన్నాడు. వెంటనే ముగ్గురూ కర్ణాటక వైపు బయల్దేరారు. బండిపురా చందనపు అడవుల్లోంచి సాగిపోయారు. ఒకప్పుటి చందనం స్మగ్లర్ వీరప్పన్ సామ్రాజ్యమది. అడవి అందాలను తిలకిస్తూనే మైసూరు మీదు గా బెంగళూరు చేరారు. అక్కడ మూడు రోజులుండి హైదరాబాద్, అటు నుంచి మహారాష్ట్రకు వెళుతూ సాగర్‌కు సమీపంలో ఓ దాబా దగ్గర టీ తాగారు. బాగా అలసిపోవడంతో ఆ దాబాలోనే ఆ రాత్రి నిద్రపోయారు. ‘ఓ రాత్రంతా ఉన్నా మని అద్దె డబ్బులివ్వబోతే దాబా యజమాని పండిట్జీ తీసుకోలేదు. ఆయన చూపిన అభిమానాన్ని మరిచిపోలేం’ అన్నాడు కర్ణ రాజ్. జీరో మైల్స్టోన్ నాగపూర్ పట్టణంలో నుంచి వెళ్తున్నప్పుడు ఓ స్థూపం కనిపించింది. దాన్ని జీరో మైల్స్టోన్ అంటారు. ఇది ఇండియాకు సెంటర్ పాయింట్. నాగపూర్ దాటాక షజాపూర్‌లో ఆగారు. ఆ ఊరి మీదుగా కర్కాటక రేఖ (ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్) వెళ్తోంది. ఈ విషయం అక్కడ ఎవరికీ తెలియదు. ముగ్గురు బైకర్లూ ఆగ్రా, ఢిల్లీ, కర్నాల్ మీదుగా చండీగఢ్ చేరుకున్నారు. చండీగఢ్ పట్టణంలో బైకులకు క్లచ్ వైరును టైట్ చేయించుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరి హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో చల్లని వాతావరణంలో సేదదీరారు. అడుగడుగునా తనిఖీలు మనాలీ నుంచి శ్రీనగర్ వైపు బైకులు బయల్దేరాయి. అక్కడి నుంచే అసలైన ప్రయాణం మొదలు. హిమాలయాల్లో ఎత్తయిన కచ్చా రోడ్లపై ప్రయాణం అతి కష్టం. సాయంత్రానికి తండి అనే ప్రాంతం చేరుకుని, అక్కడి పెట్రోల్ బంకులో బైకుల ట్యాంకుల్ని నింపుకొన్నారు. తండి తర్వాత 360 కిలోమీటర్ల వరకూ పెట్రోల్ బంకు లేదు. ముప్ఫయ్, నలభై కిలోమీటర్లకు ఒక ఆర్మీ పోస్టు ఎదురయ్యేది. వివరాలన్నీ సరిపోతేనే ముందుకు పంపేవారు. దారి పొడవునా కొండచరియలు విరిగిపడేవి. ఆర్మీకి చెందిన బీఆర్వో (బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్) సిబ్బంది ప్రొక్లయినర్లతో రాళ్లను తొలగించాక ముందుకు కదిలేవారు. ఇంచుమించు రోజూ వర్షం. దానికితోడు చలి గాలి. రక్తం గడ్డ కట్టుకుపోయేది. ‘ఆ సమయంలో ఆర్మీ అధికారులు, జవాన్ల ఆతిథ్యం అద్భుతం. ఏమైనా సాయం కావాలా? అని స్నేహపూర్వకంగా అడిగేవార’ని కిషోర్ చెప్పాడు. ఆర్మీ బంకర్లో ఓ రాత్రి కిల్లార్ నుంచి కిష్ట్వార్ మార్గంలో ప్రయాణం నరకాన్ని తలపించింది. ఒకరోజు రాత్రిపూట ఓ ఆర్మీ చెక్‌పోస్టు వద్ద ఆగారు. అక్కడి అధికారి బైకర్ల వివరాలు తెలుసుకున్నారు. ముందు రోడ్డు బాగా లేదనీ, అంతకుముందే ఓ వాహనం లోయలో పడిపోయి 18 మంది చనిపోయారనీ చెప్పారు. తర్వాత వచ్చే ఆర్మీ పోస్టు బంకర్లో ఆ రాత్రి విశ్రాంతి తీసుకోమని చెప్పి... వెంటనే అక్కడి అధికారితో వైర్లెస్ సెట్లో మాట్లాడాడు. ‘ముగ్గురం అష్టకష్టాలు పడుతూ గంట తర్వాత సింతన్ మైదాన్ చెక్‌పోస్టుకు చేరుకున్నాం. మా కోసం అప్పటికే రోడ్డుపై నిరీక్షిస్తున్న ఓ ఆర్మీ అధికారిని చూసి ఆశ్చర్యపోయాం. అతను వేడిగా చపాతీలు, బంగాళదుంప కూరతో భోజనం పెట్టారు. బంకర్లో వెచ్చగా నిద్రపోయాం. ఆ ఆతిథ్యాన్ని మరిచిపోలేం’ అన్నారు సుధీర్. జై జవాన్ నాలుగు రోజుల ప్రయాణం తర్వాత శ్రీనగర్, ద్రాస్ మీదుగా కార్గిల్ వార్ మెమోరియల్‌ను చేరుకున్నారు. ‘అమర జవాన్ల త్యాగాలు గుర్తొచ్చి, మా మనసంతా బరువెక్కిపోయింది. నివాళులర్పించి వెనక్కి వచ్చామ‘ని కర్ణరాజ్ చెప్పాడు. లేహ్ నుంచి 48 కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రవాణా మార్గం కర్దూంగ్లా పాస్, అటు నుంచి భారత్-పాక్ సరిహద్దుల్లోని త్యాక్షి చేరుకుని టెంట్లలో బస చేశారు. కిరోసిన్ ఇచ్చి ఆదుకున్న ఆర్మీ అధికారి త్యాక్షి నుంచి ముగ్గురూ సియాచిన్‌కు ముందున్న ససోమా ఆర్మీ పోస్టుకు చేరుకున్నారు. ఇది భారత్-చైనా సరిహద్దులకు సమీపంలో ఉంది. ‘అప్పటికి మా బైకుల్లో పెట్రోల్ తక్కువగా ఉంది. వెంటనే ఆర్మీపోస్టు అధికారి ప్రతాప్‌సింగ్ లీటర్ పెట్రోల్, ఏడు లీటర్ల కిరోసిన్ ఇచ్చారు. మేం దాన్నే జాగ్రత్తగా వాడుకుంటూ హుండర్, లేహ్ మీదుగా సాగిపోయాం’ అన్నాడు కర్ణరాజ్. లేహ్ నుంచి మనాలీ వైపు 80 కిలోమీటర్లు ప్రయాణించి ప్యాంగాంగ్ లేక్ చేరుకున్నారు. ఇది భారత్‌లో 48 కిలోమీటర్లు, టిబెట్‌లో 58 కిలోమీటర్లు, చైనాలో 50 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ‘ఈ లేక్ శీతకాలంలో పూర్తిగా గడ్డ కడుతుంది. ఆ సమయంలో జీపులో సరస్సుపై నుంచి వెళ్లొచ్చు. ఇక్కడి నుంచి చైనా పోస్టులు కనిపిస్తాయి’ అని కిషోర్ చెప్పాడు. త్సోమొరారీ, హన్లే లేక్‌లను కూడా చూశాక ముగ్గురూ మనాలీ మీదుగా ఢిల్లీ చేరుకున్నారు. రెండు మార్గాల్లో యాత్ర ముగింపు ఢిల్లీ చేరాక యాత్రలో స్వల్ప మార్పులు చేశారు. కర్ణ రాజ్ లక్నో, పాట్నా, కోల్‌కతా మీదుగా, కిషోర్, సుధీర్‌లు హైదరాబాద్ మీదుగా విశాఖ రావాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం బయల్దేరారు. ఎప్పటికప్పుడు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఆగస్టు 3న ముగ్గురూ ఒకేసారి విశాఖపట్నం చేరుకున్నారు. - ఎ.సుబ్రహ్మణ్య శాస్త్రి (బాలు) సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం ఏం పోగొట్టుకున్నామో తెలిసింది! ‘‘యాత్ర పూర్తయ్యేసరికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఖర్చయింది. కానీ మేం పొందిన ఆనందం ముందు అదెంత? ఎన్నో జీవితాలను దగ్గర నుంచి చూశాం. ప్రకృతి అందాన్నీ... ఆగ్రహాన్నీ కూడా చవిచూశాం. ఎందరో మంచి స్నేహితులయ్యారు. మా సుదీర్ఘయాత్రలో మేమెక్కడా పర్యావరణానికి హాని కలిగించలేదు. బిస్కెట్లు, చాక్లెట్ల రేపర్లను ఎక్కడపడితే అక్కడ పారేయలేదు. ప్రకృతి లేకుండా మనుగడ లేదని అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాం. ఇన్నాళ్లూ జీవితంలో ఏం పోగొట్టుకున్నామో తెలుసుకున్నాం. మా జీవితాల్లో ఇంతకన్నా మించిన ఆనందం లేదని మనసారా నమ్ముతున్నాం. మా యాత్ర గురించి చదివిన కుర్రాళ్లు ఉత్సాహంతో దుస్సాహసాలు చేయొద్దని మనవి. మేమెంతో ప్రణాళికాబద్ధంగా... అంతకు మించిన అనుభవంతో సాగిపోవడం వల్లే యాత్ర విజయవంతమైంది. బహుశా ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు.’’ - సాహస బైకర్లు కిషోర్, కర్ణ, సుధీర్ -
సాక్షి పుణ్యమా అని...
శుక్రవారం... సెప్టెంబర్ 5... టీచర్స్‌డే... ఉదయం ఎనిమిదన్నరకు బ్రహ్మానందం నుంచి ఫోన్ కాల్. ‘‘ఈ రోజు ‘సాక్షి’లో వచ్చిన ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ ఎక్స్లెంట్... నాకు చెప్పకుండా నా శిష్యుల ఇంటర్వ్యూలు చేసి నన్ను భలే సర్ప్రైజ్ చేశారే’’ అని ఆనందం వెలిబుచ్చారు బ్రహ్మానందం. మళ్లీ వెంటనే ఆయన ‘‘ఉదయం నుంచి ఫోన్ల మీద ఫోన్లు. నా శిష్యులు చాలా మంది మాట్లాడారు. మీ ‘సాక్షి’ పుణ్యమా అని 35 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయాను’’ అన్నారు. పత్రికల్లో వచ్చే తన ఇంటర్వ్యూలకు ఎప్పుడూ పెద్దగా స్పందించనట్టు కనపడే బ్రహ్మానందం ఈ ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ విషయంలో ఉద్వేగానికి గురయ్యారని అర్థమైంది. కట్ చేస్తే... ఆయన దగ్గర వాలిపోయాం. మళ్లీ ఆ ఆర్టికల్‌ను చూస్తూ ‘‘నేను పనిచేసిన డిగ్రీ కాలేజ్ ఫొటో, స్టాఫ్‌తో నేను దిగిన స్టిల్స్ చూస్తుంటే... నా మనసు ఆ రోజుల్లోకి వెళ్లిపోయింది’’ అన్నారు బ్రహ్మానందం. ఈలోగా ఆయన ఫోన్ మోగింది. మళ్లీ మరో అభినందన కాల్. మధ్య మధ్య అలా ఫోన్లు మాట్లాడుతూనే ‘సాక్షి’తో లెక్చరర్‌గా తన అనుభవాలను నెమరు వేసుకుంటూ... అనేక విషయాలు ముచ్చటించారు. కాలేజ్‌లో స్టూడెంట్స్‌ని మీరు బాగా డీల్ చేసేవారని మీ శిష్యులే చెప్పారు. ఆ టెక్నిక్ మీకు ఎలా అలవడింది? అది టెక్నిక్ అని నేననుకోవడం లేదు. మొదటి నుంచీ మనుషుల్ని బాగా డీల్ చేసే వరమేదో దేవుడు నాకిచ్చినట్టున్నాడు. అంతకుమించి నా వైపు ప్రిపరేషనేమీ లేదు. మామూలుగా హైస్కూలు స్టూడెంట్స్ అంటే చిన్నవాళ్లు కాబట్టి, దండించి అయినా దారిలోకి తీసుకురావచ్చు. ఇక్కడేమో డిగ్రీ స్టూడెంట్స్. టీనేజ్ దాటిపోయి ఉంటారు కాబట్టి, చెప్పిన మాట అస్సలు వినరు. కానీ మనదైన శైలిలో దారిలోకి తెచ్చుకోవాల్సిందే. మీ దగ్గర అలా తోక జాడించిన విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? ఎందుకుండరండీ... ఉంటారు. ఇట్స్ నేచురల్. ఒకసారి నేను క్లాస్ చెబుతుంటే, ఓ తుంటరి ‘‘సార్... టైమైపోయింది’’ అని అరిచాడు. నేను వెంటనే ‘‘అప్పుడే నీకు టైమ్ అయిపోవడమేంటి? నీకు చాలా భవిష్యత్తు ఉందే’’ అన్నాను. దాంతో అమ్మాయిలంతా ఘొల్లుమని నవ్వారు. అతనికి అవమానమనిపించి ‘‘నాకు కాదు సార్... బెల్ కొట్టడానికి టైమైపోయింది’’ అన్నాడు. నేను వెంటనే దానికి కౌంటర్ ఇస్తూ, ‘‘బెల్ కొట్టడానికి ఓ మనిషి ఉన్నాడుగా... నీకెందుకు కంగారు’’ అన్నాను. అంతే! ఇక మళ్లీ అతను నోరెత్తితే ఒట్టు. ఇలా సీరియస్ వేలో కాకుండా, నవ్వుతూనే చురకలంటించేవాణ్ణన్నమాట. అందుకే నా దగ్గర వాళ్లు జాగ్రత్తగా ఉండేవారు. అదే పద్ధతి సినిమా ఇండస్ట్రీలో కూడా అనుసరిస్తున్నాట్టున్నారు? తప్పదు మరి. వెంకటేశ్వరస్వామి గుడికెళ్లి ‘ఓం నమఃశివాయ’ అంటే దేవుడికి కోపం వస్తుంది కదా! ఎక్కడ చదవాల్సిన మంత్రాలు అక్కడే చదవాలి. అయినా నేనెప్పుడూ నా హద్దుల్లో నేనుంటాను. మిగతావాళ్లను కూడా హద్దులు దాటనివ్వను. ఆ సూత్రం తెలిస్తే అందరికీ హాయి. సార్! మళ్లీ మీ లెక్చరర్ రోజుల్లోకి వెళ్దాం. మీరు లేడీస్ హాస్టల్ వార్డెన్‌గా కూడా చేశారట? అవును. మా డిగ్రీ కాలేజ్‌లోనే లేడీస్ హాస్టల్ ఉంది. వాళ్ల స్కాలర్‌షిప్‌ల వ్యవహారాలతో పాటు ఎలాంటి భోజనం పెట్టాలి లాంటి అంశాలన్నీ వార్డెన్ చూసుకోవాలి. ఈ బాధ్యతలను ఒక్కోసారి ఒక్కో లెక్చరర్ చూసుకోవాలి. అలా నేను కొన్నాళ్లు వార్డెన్‌గా చేశా. అలాగే ఎన్ఎస్ఎస్ ఆఫీసర్‌గా కూడా చేశా. అప్పట్లో మీ బెస్ట్ స్టూడెంట్ ఎవరు? అలా జడ్జ్ చేయడం కష్టం. బాగా చదివేవాడికి బిహేవియర్ కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. బిహేవియర్ బాగున్నవాడు చదువులో రాణించకపోవచ్చు. మీరు మిమిక్రీ బాగా చేసేవారట కదా? అప్పట్లో ప్రముఖుల ముందు ఎప్పుడైనా చేశారా? పేర్లు గుర్తుకు రావడం లేదు. సాహితీవేత్త పురిపండా అప్పలస్వామి... ఇలా చాలామంది ఉన్నారు. జంధ్యాల గారు నా మిమిక్రీ టాలెంట్ చూసే కదా, నాకు సినిమా చాన్స్ ఇచ్చారు. రాత్రి ఎనిమిది గంటలకు మొదలుపెడితే, తెల్లవారుజామున నాలుగు గంటల వరకూ ఆయన ముందు మిమిక్రీ చేశా. మీ స్కూల్ వైస్ ప్రెసిడెంట్‌ను కూడా అనుకరించేవారట! అదంతా సరదా కోసమే. ఆ మాత్రం సరదా లేకపోతే ఊరు కాని ఊళ్లో మనల్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి! మీ శిష్యులంతా మీకన్నా పెద్దవాళ్లలా కనిపిస్తున్నారు. మీరేమో ఇంకా...? అర్థమైంది మీ ప్రశ్న. ఇంత వయసు వచ్చినా నా ముఖంపై ముడతలు రాలేదేంటని ఈ మధ్యనే ఒకరడిగారు. దానికి నా సమాధానం ఒకటే. మనసులో మడతలు లేకపోతే, ముఖాన ముడతలు రావు. మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు మన ముఖం ఎలా ఉంటుందో, చెడ్డ ఆలోచనలతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి చూసుకుంటే మనకే ఆ రహస్యం తెలిసిపోతుంది. ఓ మహానుభావుడు ఏం చెప్పాడంటే... "God is always ready with the camera. That's your responsibility to give him a good pose". మీరు రామాయణ, భారత, భాగవతాలు బాగా చదువుకున్నట్టున్నారు? చదువుకోవాలి కదండీ! వాటిపై నాకెంత పట్టు ఉందో, నాకు నేనుగా చెప్పుకోకూడదు. భాగవతం మీద కొన్ని గంటలు మాట్లాడగలను. అసలు మన దగ్గరున్న సాహితీ సంపద ఇంకెవరి దగ్గర ఉంది చెప్పండి! పోతన భాగవతంలోని ‘ఎవ్వనిచే జనియించు’ పద్యం ఒకసారి చదవండి. దీనిముందు ఓషో ఫిలాసఫీ లాంటివి ఎక్కడ నిలుస్తాయి! గురువుగా మీ ప్రత్యేక ముద్ర ఏంటి? నేను చాలా యాక్టివ్‌గా, జోవియల్‌గా ఉంటాను. నా చుట్టుపక్కల వాతావరణం డల్‌గా ఉంటే నాకస్సలు నచ్చదు. మనం యాక్టివ్‌గా ఉంటే, మన లైఫ్ కూడా యాక్టివ్గానే ఉంటుంది. ఇందిరాగాంధీ వాకింగ్ స్టయిల్ ఎప్పుడైనా చూశారా? అంత ఎనర్జీ ఉండాలి. సినిమా ఇండస్ట్రీలో కూడా మిమ్మల్ని గురువుగా భావించేవాళ్లు ఉన్నారు. వాళ్లను మీరెలా గైడ్ చేస్తుంటారు? ఇక్కడ గైడ్లు, క్లాస్‌లూ అంటూ ఏమీ ఉండవు. మనసు విప్పి మాట్లాడుకుంటే అన్నీ తెలుస్తుంటాయ్. అన్ని సమస్యలూ పరిష్కారం అవుతుంటాయ్. అప్పుడప్పుడూ సరదాగా పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ లాంటివాళ్లు నా దగ్గరకు వస్తుంటారు. నేనేమీ వాళ్లకు గురువును కాదే! ఇది సత్సంగం లాంటిది. ఒక అంశం మీద గంటలు గంటలు మాట్లాడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఒకసారి వాళ్లిద్దరూ ఉదయం 9 గంటలకు మా ఇంటికొచ్చి, సాయంత్రం 5 గంటల వరకు ఉన్నారు. ముగ్గురం అంతసేపూ మాట్లాడుకుంటూనే ఉన్నాం. రకరకాల టాపిక్స్ మా మధ్య నడిచాయి. అన్నట్లు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మళ్లీ పాఠం చెబుదామనిపించిందా? ఒకవేళ అనిపించినా, చెప్పలేని పరిస్థితి నాది. ఎందుకంటే బ్రహ్మానందం కామెడీ మానేసి పద్యాలూ పాఠాలూ చెబుతున్నాడని రకరకాలుగా అనుకుంటారు. ఎందుకంత బాధ! నన్ను ఇలా ఉండనివ్వండి బాబూ..! - పులగం చిన్నారాయణ సడన్‌గా శంకర్ ఫోన్... ఓ పక్క ‘సాక్షి’తో సంభాషిస్తూనే, మరోపక్క వరుసగా వస్తున్న ఫోన్లు మాట్లాడుతున్నారు బ్రహ్మానందం. దాదాపుగా అన్నీ ‘గురు బ్రహ్మి’ ఆర్టికల్ గురించే. ఒకతనైతే ఫుల్స్టాప్, కామాలు లేకుండా ఆయనను పొగుడుతూనే ఉన్నాడు. అప్పుడు చూడాలి బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్స్. ఈ హడావిడిలో ఇంకో ఫోన్ వచ్చింది. ‘‘నేను సార్... డెరైక్టర్ శంకర్‌ని’’ అనగానే, బ్రహ్మానందానికి మొదట ఏమీ అర్థం కాలేదు. ‘ ‘ఎవరు?’’ అని మళ్లీ రెట్టించి అడిగారు. ‘‘డెరైక్టర్ శంకర్‌ని సార్... చెన్నై నుంచి మాట్లాడుతున్నా’’ అనగానే, బ్రహ్మానందానికి అర్థమైపోయింది. ‘‘శంకర్గారూ... ఎలా ఉన్నారు?’’ అని ఆప్యాయంగా అడిగారు బ్రహ్మానందం. ‘‘బావున్నాను సార్... మొన్న ‘ఆగడు’ ఆడియో ఫంక్షన్‌కి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవలేకపోయాను. దూకుడు, రేసుగుర్రం సినిమాల్లో మీ కామెడీ అదిరిపోయింది. నా వైఫ్, పిల్లలకు తెలుగు తెలియదు కానీ, మీ కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఫ్యామిలీ మొత్తం మీ ఫ్యాన్స్. ‘ఆగడు’లో కూడా చేశారుగా. అది కూడా చూస్తా. మీ గురించి నిర్మాత ఏఎమ్ రత్నంగారు అప్పట్లో చాలాసార్లు చెప్పారు. త్వరలో మీతో నా సినిమాలో ఫుల్ లెంగ్త్ కేరెక్టర్ చేయించుకుంటా’’ అన్నారు శంకర్. ఇలా ఇద్దరూ చాలాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. -
రంగురాళ్లకు ఇంకా పరుగులు
అమూల్యమైన రాళ్లతో కోట్లలో వ్యాపారం తవ్వకాలకు అనుమతులకై కొందరి యత్నం గత ప్రమాదాలు విస్మరించి డబ్బు కోసం ఆరాటం నర్సీపట్నం రూరల్: వేలాది మంది గిరిజనుల బతుకుకు, మెతుకుకు పూచీ పడే సుదీర్ఘ గిరులు తూర్పు కనుమలు. ఎంతో విలువైన అటవీ సం పదకు ఆలవాలమైన ఈ పర్వత పంక్తులు వెలకట్టలేని సంపదకు నెలవుగా వన్నెకెక్కాయి. జిల్లాలోని తూర్పు కనుమల పరిధిలో లభించే అమూల్యమైన రంగురాళ్లు ఇప్పటికే ఎందరికో కోట్లు ఆర్జించిపెట్టాయి. అదే సమయంలో ఎందరో అమాయకుల ప్రాణాలను తవ్వకాలు బలి తీసుకున్నాయి. ఎన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నా రంగురాళ్లపై ఆశ కొందరిని పరుగులు తీయిస్తోంది. అందుకే లీజ్ కోసం కొందరి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరోవైపున నిఘా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తూ ఉండడంతో అతి కీలకమైన గొలుగొండ మండలంలోని అనధికారిక క్వారీల్లో వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది. కరక మెరుపు తునక : గొలుగొండ మండలంలోని కరక రిజర్వు ఫారెస్టులో దొరికే రంగురాళ్లు ఎంతో విలువైనవిగా వన్నెకెక్కాయి. రెండు దశాబ్దాల క్రితం గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెంలో తొలిసారిగా రంగు రాళ్లు బయిటపడ్డాయి. ఇక్కడ కేట్స్ ఐ, అలెక్స్ రకం రంగురాళ్లు దొరికేవి. కాలక్రమేణా కరక రిజర్వు ఫారెస్టులో అత్యుత్తమమైన అలెక్స్ రంగురాళ్లు లభ్యం కావడంతో, వీటికి లక్షల్లో ధర పలకడంతో తవ్వకాలు ఊపందుకున్నాయి. కొద్ది ఏళ్లలో ఇక్కడ వందల కోట్ల లావాదేవీలు సాగి ఉంటాయంటున్నారు. ఎడాపెడా ప్రమాదాలు : రంగురాళ్ల ద్వారా కోట్లు లభిస్తూ ఉండడంతో ఎందరో ఎగబడ్డారు. దాంతో ప్రమాదాలు భారీ ఎత్తున జరిగాయి. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, అధికారులు ప్రేక్షక పాత్ర వహించడంతో తవ్వకాలు విస్తృతంగా సాగుతున్నాయన్నది విస్పష్టం. ప్రస్తుతం కరక చుట్టుపక్కల ప్రాంతాల్లో క్వారీలు నిర్వహించేందుకు వ్యాపారులు ప్రణాళికలు చేశారు. లీజుకు దరఖాస్తు చేసిన కొంతమంది అనుమతులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు భోగట్టా. -
తపాలా: గార్డెన్లో ‘కాళింగ మర్దనం’
మా పండుకు అప్పుడు మూడేళ్లు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని హడావుడిగా చేస్తూ, ఇల్లంతా తిరుగుతూ ఉండేది. అలాంటిది ఒకరోజు చాలాసేపటినుంచీ కనిపించ లేదు. ఎటువంటి శబ్దాలూ లేవు. ‘‘ఎక్కడున్నావురా పండూ?’’ అని పిలిచాను. అది చెప్పిన సమాధానం విని తూలిపడబోయి నిలదొక్కుకున్నాను. ‘‘అమ్మా! నేనిప్పుడు కాళింగుడు పాముని చంపేస్తున్నాను.’’ ఏ పాముని పట్టుకుందో ఏమో అనుకుంటూ గార్డెన్‌లోకి పరుగుతీశాను. చూస్తే అక్కడ పాము ఏమీ లేదు. పామెక్కడ అని అడిగితే, తన పాదం పక్కకు జరిపి చూపించింది. అక్కడ ఒక చిన్న మిల్లీపొడ్ (రోకలిబండ అనే పురుగు) ఉంది. అది పాములాగా కనిపించేసరికి ఈమె అంతకుముందురోజే వాళ్ల అమ్మమ్మ చెప్పిన కాళింగుడు - కృష్ణుడు కథలోని కృష్ణ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసిందన్నమాట! మా పిల్లల తీపిగుర్తులు మళ్లీ ఇలా రీవైండ్ చేసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. - డా॥సి.ఎం.అనూరాధ, అనంతపురం ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
రాజ్యాంగానికి లోబడే రాజకీయాలుండాలి
వనరుల సమన్వయంతోనే తెలంగాణ పునర్నిర్మాణం కేయూ సదస్సులో ప్రజాగాయకుడు గద్దర్ కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : మానవ, ప్రకృతి వనరుల సమన్వయంతోనే తెలంగాణ పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని ప్రజాగాయకుడు గద్దర్ అభిప్రాయపడ్డారు. కేయూ సెనేట్హాల్లో ‘తెలంగాణ పు నర్నిర్మాణంలో యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర’అంశంపై గురువారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని రాజకీయపార్టీలు భ్రష్టుపట్టిస్తున్నాయని, రాజ్యాంగానికి లోబడే రాజకీయాలుండాలని, రాజకీయాలకు లోబడి రాజ్యాంగం ఉండదన్నారు. తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. త్యాగాల పునాదుల మీద ఏర్పాటవుతున్న తెలంగాణ పునర్నిర్మాణం ఎలా ఉండాలనేది ఇప్పుడు చర్చగా ఉందన్నారు. కవు లు, కళాకారులు తెలంగాణ కోసం ధూంధాం నిర్వహించి ప్రజ లను చైతన్యపరిచారని వివరించారు. మన నీళ్లు, మన బొగ్గు, ఉద్యోగాలు, వనరులతో తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని అభిప్రాయపడ్డారు. నాటి ఆర్ఈసీ, కేయూలో అనేక మంది ఉద్యమబాట పట్టారని, తాను ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదువుకున్నానని గుర్తుచేశారు. అడవిబాట పట్టిన తర్వాతే సామాజిక అంశాలపై చదువును నేర్చుకున్నానన్నారు. పునర్నిర్మాణంపై కేయూలో చర్చలు జరిపి ఒక డిక్లరేషన్‌గా తీర్మానం చేసి పంపించాలని ని ర్వాహకులకు గద్దర్ సూచించారు. తెలంగాణ కోసం అనేక గ్రా మాలకు కూడా వెళ్లామని, సీపీఐ, బీజేపీలాంటి వారితో కూడా కలిసి ఉద్యమించామని గుర్తుచేశారు. అకుట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సారంగపాణి మాట్లాడుతూ రాబోయే తెలంగాణలో మన వనరులను ఎలా ఉపయోగించుకోవాలో కూడా చర్చించుకోవాలన్నారు. తెలంగాణ కోసం ఎంతోమంది బలిదానాలు చేశారన్నారు. రాబోయే తెలంగాణలోను దోపిడీ ప్రభుత్వాలు వస్తే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఓయూ ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ మాట్లాడుతూ రాబోయే తెలంగాణలో వనరులను సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేయూ ప్రొఫెసర్ టి.జ్యోతి రాణి మాట్లాడుతూ మహిళలపై హింసలేని తెలంగాణను నిర్మించుకోవాలని సూచించారు. శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరిపల్లి సుజాత మాట్లాడుతూ తెలంగాణను ప్ర యోగశాలగా మార్చి సీమాంధ్ర పెట్టుబడిదారులు వనరులను కొల్లగొట్టారని ఆరోపించారు. కేయూ విద్యార్థులు తెలంగాణ పునర్నిర్మాణంలో కీలకభూమిక పోశించాలన్నారు. నడస్తున్న తెలంగాణ ఎడిటర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో వసతులు లేవని తెలిపారు. సీమాంధ్రులు మన విద్య, సంస్కృతిని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ యూనివర్సిటీల బిల్లును తెలంగాణలో అమలు చేయకుండా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై కేయూ ప్రొఫెసర్ సీతారాంనాయక్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సదస్సు కన్వీనర్ పి.మోహన్‌రాజు, బాధ్యు లు దబ్బెల మహేష్, దాసరి నివాస్, రంజిత్, యుగేందర్, వీరన్న, టి.రమేష్, డి.రమేష్, బాలరాజు, నరేందర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అమరవీరుల ఆశయాలను నెరవేర్చుదామని విద్యార్థులతో గద్దర్ ప్రతిజ్ఞ చేయించారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. గద్దర్ ఆటపాటలతో విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు.