సైకో థ్రిల్లర్లో సీనియర్ హీరోయిన్ | Shriya in Psycho Thriller | Sakshi
Sakshi News home page

సైకో థ్రిల్లర్లో సీనియర్ హీరోయిన్

Published Thu, Aug 31 2017 11:22 AM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

సైకో థ్రిల్లర్లో సీనియర్ హీరోయిన్

సైకో థ్రిల్లర్లో సీనియర్ హీరోయిన్

12 ఏళ్లుగా హీరోయిన్గా కొనసాగుతున్న సీనియర్ బ్యూటీ శ్రియ, ఇన్నేళ్ల తరువాత తనకు నచ్చిన కథ దొరికిందని చెపుతున్నారు. కెరీర్లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన ఈ బ్యూటీ, పవిత్ర లాంటి ప్రయోగాలు చేసిన పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం సీనియర్ హీరోలతో జతకడుతూ బిజీగా ఉన్న శ్రియ త్వరలో ఓ ఆసక్తికరమైన సినిమాలో కనిపించనుందట.

ప్రస్తుతం బాలకృష్ణ సరసన నటించిన పైసా వసూల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న శ్రియ, సైకో థ్రిల్లర్గా తెరకెక్కుతున్న సినిమాలో లీడ్ రోల్ లో నటించనున్నారు. ఈ సినిమాతో ఏ 23 ఏళ్ల కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడని హింట్ ఇచ్చిన శ్రియ త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నారని తెలిపారు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో తొలిసారిగా అభిమానులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు శ్రియ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement