నో డూప్‌... ఆల్‌ రియల్‌! | Balakrishna who ride the wild horse for the 'Gautamiputra Satakarni' | Sakshi
Sakshi News home page

నో డూప్‌... ఆల్‌ రియల్‌!

Published Mon, Jun 5 2017 11:48 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

నో డూప్‌... ఆల్‌ రియల్‌! - Sakshi

నో డూప్‌... ఆల్‌ రియల్‌!

బాలకృష్ణ డిక్షనరీలో ‘డూప్‌’ అనే పదం దాదాపు కనిపించదు. డూప్‌ లేకుండా ఆయన చేసే రిస్కీ స్టంట్స్‌ను లైవ్‌లో చూసే యూనిట్‌ జనాలు క్లాప్స్‌ కొట్టడం ఈ మధ్య కామన్‌ అయ్యింది.‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కోసం వైల్డ్‌ హార్స్‌ను రైడ్‌ చేసిన ఆయన, తాజాగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌లో కారును 360 డిగ్రీస్‌లో డ్రిఫ్టింగ్‌ పద్ధతిలో రైడ్‌ చేశారట!

పూరి మాట్లాడుతూ – ‘‘పోర్చుగల్‌ రాజధాని లిస్బన్‌లో ఆదివారం ఓ ఛేజ్‌ తీశాం. రెండుసార్లు డూప్‌ లేకుండా బాలకృష్ణగారు కారును డ్రిఫ్టింగ్‌ పద్ధతిలో 360 డిగ్రీస్‌లో తిప్పే షాట్‌ను షూట్‌ చేశాం. ఆయన పక్క సీట్లో కూర్చున్న శ్రియ షాక్‌కి గురైంది. షాట్‌ ఓకే అయ్యాక యూనిట్‌ అంతా క్లాప్స్‌ కొట్టారు’’ అన్నారు. ‘‘ఈ నెల 10న బాలకృష్ణగారి బర్త్‌డే సందర్భంగా 9వ తేదీ రాత్రి బాలకృష్ణగారు, పూరిగారు మా ‘భవ్య క్రియేషన్స్‌’ ఫేస్‌బుక్‌ పేజీ లైవ్‌లోకి వస్తారు’’ అన్నారు నిర్మాత వి. ఆనంద్‌ప్రసాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement