
ఎవరో చెప్పుకోండి!
ఈ ఫొటోలో శ్రీయ చూపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా?! వీరి వీరి గుమ్మడిపండు.. దాగుడుమూతల దండాకోర్.. వీరి పేరు ఏంటో? చెప్పుకోండి చూద్దాం - అనే చిన్నపిల్లల ఆటలు శ్రీయ ఆడుతున్నట్టు లేదూ! నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ లొకేషన్ ఈ సరదా దృశ్యానికి వేదికైంది. నృత్య దర్శకురాలు బృందా నేతృత్వంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు విరామంలో ఆటవిడుపుగా తీసుకున్న ఫొటో ఇది. ఇంతకీ, ఆ కళ్లు మూసుకున్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా? దర్శకుడు క్రిష్ అండీ.