
క్రాకర్స్ మోత మోగాల్సిన అవసరం లేదు!
పావళి రోజున ఇంటిని అందంగా అలంకరించి, మన కుటుంబసభ్యులకు, స్నేహితులకు స్వీట్లు ...
శ్రీయా శరణ్
దీపావళి రోజున ఇంటిని అందంగా అలంకరించి, మన కుటుంబసభ్యులకు, స్నేహితులకు స్వీట్లు , బహుమతులు ఇస్తే చాలు. ఇక ఆ సంతోషానికి మించింది లేదు. క్రాకర్స్ మోత మోగిస్తేనే దీపావళి అని కొందరి అభిప్రాయం. వాళ్లను నేను తప్పుబట్టను. ఎవరి ఇష్టం వాళ్లది. మా ఇంట్లో మాత్రం చాలా చక్కగా ఈ పండగ చేసుకుంటాం.
దీపావళి అంటే దీపాలను అందంగా అమర్చడమే. దాని కోసం క్రాకర్స్ కాల్చాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద శబ్దాలతో ఈ టపాసులు కాల్చడం వల్ల పర్యావరణంతో పాటు మన ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు.