ఫ్యాన్స్‌కు పండగ
పూరి జగన్నాథ్ హీరో ఎలా ఉంటాడు? మాంచి మాస్‌గా, సై్టలిష్‌గా ఉంటాడని టకీమని ఆన్సర్ వచ్చేస్తుంది. హీరో గెటప్, బాడీ లాంగ్వేజ్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. డౌట్ ఉంటే.. ‘పైసా వసూల్’ సినిమా స్టిల్ చూడండి. దర్శకుడు పూరి జగన్నాథ్ మార్క్ మేకోవర్‌లో బాలకృష్ణపై ఓ లుక్కేయండి. స్టిల్ మాంచి మాసీగా, సై్టలిష్‌గా ఉంది కదూ.బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకు ‘పైసా వసూల్’ టైటిల్ కన్ఫర్మ్ చేశారు.
నేడు బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. పూరి మాట్లాడుతూ – ‘‘ఇటీవల ఎక్కువగా సీరియస్ రోల్స్ చేసిన బాలకృష్ణగారు ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ రోల్ చేస్తున్నారు. ఆయన డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కు పండగే. కథకు తగ్గ టైటిల్ కుదిరింది’’ అన్నారు. ‘‘బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం 2.50 గంటలకు ఆయన, పూరి జగన్నాథ్ ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి వస్తారు’’ అన్నారు నిర్మాత. శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.