
దృశ్యంపైనే ఆశలు
శ్రీయ మంచి నటి. నోడౌట్ ఎబౌట్ ఇట్. కథానాయికగా దశాబ్దం దాటి ఏలారు. స్టిల్ షీఈజ్ హీరోయిన్. అయితే అంత డిమాండ్ లేకపోవచ్చు. అలాగని అవకాశాలే లేవనడం సరి కాదు. దక్షిణాదిలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజినీకాంత్ నుంచి యువహీరోలందరితోనూ నటించిన ఘనత శ్రీయది. ‘జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. నా కేరీర్‌లో సూపర్ డూపర్ హిట్స్, డిజాస్టర్స్ చూశాను.
అయినా నాకు దేవుని దయ ఉంది. అందుకే ఇంకా అవకాశాలు వస్తున్నాయి’ అంటున్న శ్రీయకు తమిళం, తెలుగు భాషల్లో చిత్రాలు లేకపోయినా, ప్రస్తుతం దృశ్యం హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈమె హిందీలో ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే అవేవీ తన కేరీర్‌కు అంతగా హెల్ప్ అవ్వలేదు. అయితే దృశ్యం చిత్రం విజయంపై చాలా నమ్మకం ఉందంటున్నారు. ఆమె నమ్మకానికి కారణం లేక పోలేదు. మలయాళంలో తెరకెక్కిన దృశ్యం చిత్రం విశేష విజయాన్ని సాధించింది. అది అక్కడితో ఆగలేదు.
తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో పునర్‌నిర్మాణం అయ్యి మంచి విజయం పొందింది. అలా మలయాళం, తెలుగు భాష ల్లో మీనా, తమిళంలో గౌతమి నటించి మెప్పించి పాత్రను హిందీలో శ్రీయ పోషిస్తున్నారు. అజయ్‌దేవగన్ కథనాయకుడు. ఇందులో పిల్లల తల్లిగా నటించడం గురించి శ్రీయ స్పందిస్తూ అమ్మగా నటించడం నాకిష్టం. పైగా సులభం కూడా. అజయ్‌దేవగన్ చాలా స్పీట్ పర్సన్. ఇందు లో ముఖ్య పాత్ర పోషిస్తున్న నటి టబుతో నేనింతకుముందు కూడా కలిసి నటించాను. దృశ్యం హిందీలో నూ మంచి సక్సెస్ కావడం తధ్యం అని శ్రీయ దృఢ నమ్మ కం వ్యక్తం చేస్తున్నారు.