మామా అల్లుళ్ల అల్లరి | venky mama movie regular shooting starts on aug 8 | Sakshi
Sakshi News home page

మామా అల్లుళ్ల అల్లరి

Published Sun, Jul 29 2018 1:53 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

venky mama movie regular shooting  starts on aug 8 - Sakshi

వెంకటేశ్, నాగచైతన్య

అల్లుడుకి తోడుగా మామ ఎంట్రీ కూడా ఉంటుందా? లేక మామ, అల్లుడు వేరు వేరుగా ఎంట్రీ ఇస్తారా? అసలు సెట్స్‌లోకి ముందు ఎవరు కాలుపెడతారు? ఈ డౌట్‌ ఆగస్టు సెకండ్‌ వీక్‌లో క్లియర్‌ అవుతుంది. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన కార్పొరేషన్‌ సంస్థలు నిర్మించనున్నాయి. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.

రియల్‌ లైఫ్‌ మాదిరిగానే రీల్‌ లైఫ్‌లోనూ వెంకటేశ్, నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటించనున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ ఆగస్టు 8న మొదలవుతుందని సమాచారం. మామా అల్లుళ్లు కలిసి వెండితెరపై చేయబోయే అల్లరి ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తారు. ఇక వెంకీ సరసన కథానాయికలుగా హ్యూమా ఖురేషీ, శ్రియ పేర్లను పరిశీలిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం అందించేందుకు టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లను సంప్రదిస్తున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement